నబీల్ గెలిస్తే నేను గెలిచినట్లే.. వెళుతూ వెళుతూ యాష్మికి ఆదిత్య లాస్ట్ పంచ్

First Published | Oct 5, 2024, 11:01 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 34వ రోజు సరదాగా సాగింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఆదిత్య ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు. ఆయన్ని నాగార్జున వేదికపైకి పిలిచి మాట్లాడారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 34వ రోజు సరదాగా సాగింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఆదిత్య ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు. ఆయన్ని నాగార్జున వేదికపైకి పిలిచి మాట్లాడారు. ఈవారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఆదిత్య మిడ్ వీక్ లో ఎలిమినేటి అవుతున్నట్లు ప్రకటించారు. ఇక నైనికా సండే రోజు ఎలిమినేట్ కానుంది. ఆమె ఎలిమినేషన్ కూడా కంఫర్మ్ అయింది. 

ముందుగా నాగార్జున.. మణికంఠ ఏడుపు గురించి క్లాస్ పీకుతూ ఎపిసోడ్ ని ప్రారంభించారు. హౌస్ మేట్స్ చేత చిన్న గేమ్ ఆడించారు నాగార్జున. ప్రతి ఒక్కరు మిగిలిన వారిలో ఇద్దరినీ ఎంచుకుని వారిలో ఉన్న జెలసీ, విసిగించడం లాంటి బ్యాడ్ క్వాలిటీస్ చెప్పాలి. మణికంఠ అయితే తాను ఎవరిని జడ్జ్ చేయనని.. ఎందుకంటే తనలోనే బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయని ఏడ్చేశాడు. ఈ గేమ్ ముగిశాక నాగార్జున.. మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయిన ఆదిత్యని వేదికపైకి ఇన్వైట్ చేశారు. ఆదిత్య ఓం తన బిగ్ బాస్ జర్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేడు ఆదిత్య బర్త్ డే కూడా. దీనితో బర్త్ డే బాయ్ ని నాగార్జున, హౌస్ మేట్స్ విష్ చేసారు. 


ఆదిత్య మాట్లాడుతూ.. ఈ నెలరోజుల్లో ఒక లైఫ్ మొత్తం చూసినట్లు అనిపించింది అని అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని తెలిపాడు. హౌస్ మేట్స్ అంతా ఆదిత్యని అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచారు. ఆదిత్య మాట్లాడుతూ తనకి ఇష్టమైన హౌస్ మేట్స్ గురించి తెలిపాడు. నబీల్ అంటే తనకి చాలా ఇష్టం అని చెప్పిన ఆదిత్య అతడి పెద్ద హగ్ అని తెలిపాడు. గేమ్ బాగా ఆడాలని ఆదిత్య నబీల్ ని కోరాడు. నబీల్ బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే తాను గెలిచినట్లే అని ఆదిత్య తెలపడం విశేషం. 

అదే విధంగా పృథ్వీ, విష్ణుప్రియ అంటే కూడా చాలా ఇష్టం అని పేర్కొన్నాడు. పంచ్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తావు అని నాగ్ అడగగా.. యాష్మి, మణికంఠ పేర్లని ఆదిత్య తెలిపాడు. ఎందుకంటే యాష్మి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని ఆదిత్య సూచించాడు. అదే విధంగా మణికంఠ కూడా గేమ్ లో చాలా ఇంప్రూవ్ కావాలని.. నిన్ను నీవు నిరూపించుకోవాలని ఆదిత్య సూచించాడు. 

Latest Videos

click me!