బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఘనంగా ముగిసింది. 14 మంది రెగ్యులర్, 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పాల్గొన్న లేటెస్ట్ సీజన్ కి గాను అవినాష్, ప్రేరణ, నబీల్, గౌతమ్, నిఖిల్ ఫైనల్ కి వెళ్లారు. అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచిన కారణంగా నేరుగా ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు.
టైటిల్ పోరు నిఖిల్-గౌతమ్ మధ్యనే అంటూ గత నాలుగు వారాలుగా ప్రచారం అవుతుంది. ఈ క్రమంలో అవినాష్, ప్రేరణ, నబీల్ ఎలిమినేట్ అవుతారని ముందే ప్రేక్షకులు ఊహించారు. అవినాష్ కి 5వ స్థానం దక్కింది. 4వ స్థానంలో ప్రేరణ, 3వ స్థానంలో నబీల్ నిలిచారు. ఇక నిఖిల్, గౌతమ్ లలో టైటిల్ ఎవరిదే ఉత్కంఠ నెలకొంది.
నాగార్జున సూట్ కేస్ సైతం ఆఫర్ చేశాడు. ఇద్దరిలో గెలిచేది ఒకరే కాబట్టి.. డబ్బులు తీసుకుని ఒకరు టైటిల్ రేసు నుండి తప్పుకోవచ్చని సూచించాడు. నిఖిల్, గౌతమ్ అందుకు నిరాకరించారు. ఫైనల్లీ హోస్ట్ నాగార్జున గెస్ట్ రామ్ చరణ్ ఎదుట.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ విన్నర్ ని రివీల్ చేశాడు. నిఖిల్ చేయి పైకెత్తి అతడిని విజేతగా ప్రకటించాడు. గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావడం వలనే టైటిల్ చేజారిందనే వాదన వినిపించింది.
ఇదిలా ఉంటే నిఖిల్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావడాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తుంది. కన్నడ నటుడికి బిగ్ బాస్ తెలుగు టైటిల్ ఎలా ఇస్తారు. గౌతమ్ మాత్రమే టైటిల్ అందుకునేందుకు అర్హుడు అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిఖిల్ ని ట్రోల్ కూడా చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక తన మీద ఎలాంటి ప్రచారం జరుగుతుందో తెలుసుకున్నట్లు నిఖిల్ చెప్పాడు.
వరుస ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్న నిఖిల్... కన్నడ, తెలుగు అనే భాషా భేదం తనకు లేవని అన్నాడు. నన్ను నిఖిల్ అని మాత్రమే పిలుస్తారు. నువ్వు కన్నడా తెలుగా? అని ఎవరు అడగరు అన్నారు. తాను విన్నర్ గా టైటిల్ పైకి ఎత్తగానే అమ్మ, తమ్ముడు భావోద్వేగానికి గురయ్యారని నిఖిల్ వెల్లడించారు.
ఇకపై తనపై ట్రోలింగ్ కి పాల్పడుతుంది. దుష్ప్రచారం చేస్తుంది ఎవరో నాకు తెలుసని నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాడు ఇవన్నీ ఆపేస్తే బాగుంటుంది. నాపై ఎంత దుష్ప్రచారం చేసినా, ట్రోల్ చేసినా పర్లేదు. నేను తీసుకుంటాను. కానీ కుటుంబ సభ్యులను, ఇష్టమైన వ్యక్తులను దీంట్లోకి లాగవద్దు. నేను యాక్షన్ లోకి దిగితే మామూలుగా ఉండదు.. అంటూ నిఖిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మరి నిఖిల్ వార్నింగ్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ విన్నర్ గా నిఖిల్.. రూ. 55 లక్షల ప్రైజ్ మనీ గెలిచారు. ఒక కారు సైతం గిఫ్ట్ గా లభించింది. అయితే ట్యాక్స్ రూపంలో కటింగ్స్ ఉంటాయి. నిఖిల్ గెలుచుకున్న మొత్తంలో దాదాపు 40 శాతానికి పైగా కటింగ్స్ రూపంలో పోనుంది. అయితే రెమ్యూనరేషన్ రూపంలో నిఖిల్ రూ. 33.75 లక్షలు పొందారు. ఇందులో పెద్దగా కోతలు ఉండవు.