బిగ్ బాస్ లో ఈవారం నామినేషన్స్ లిస్ట్ ?..డేంజర్ జోన్ లో ఉన్నది అతడే..

First Published | Oct 14, 2024, 9:16 AM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డు ఎంట్రీలతో కొత్త మలుపు చోటు చేసుకుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్లలో టాప్ 5 లో ఎవరు ఉంటారు అనే ఉత్కంఠ నెలకొంది. 

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డు ఎంట్రీలతో కొత్త మలుపు చోటు చేసుకుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్లలో టాప్ 5 లో ఎవరు ఉంటారు అనే ఉత్కంఠ నెలకొంది. సండే రోజున కిరాక్ సీత ఎలిమినేట్ అయింది. ఇక సోమవారం రోజు నామినేషన్స్ పై ఆసక్తి నెలకొంది. ఆల్రెడీ సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. టెలికాస్ట్ చేయడమే ఆలస్యం. 

దీనితో నామినేషన్స్ కి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఈవారం ఏకంగా 9 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. ఇందులో 6 మంది ఒరిజినల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. కేవలం ముగ్గురు మాత్రమే వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉన్నారు. 


నామినేషన్స్ లో ఉన్న వారి వివరాలు ఇవే. నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్, నాగమణికంఠ, యాష్మి, నబీల్, ప్రేరణ, హరితేజ, టేస్టీ తేజ నామినేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళని ఎవరు, ఎలాంటి పాయింట్స్ తో నామినేట్ చేశారో చూడాల్సి ఉంది. అయితే వీరిలో కొందరు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నట్లు సమాచారం. 

Also Read : దురదృష్టం అంటే అల్లు అర్జున్ తో నటించిన ఆ ముగ్గురు హీరోయిన్లదే.. ఎవరికీ ఎదురుకాని విచిత్రమైన పరిస్థితి

Bigg boss telugu 8

వీరిలో పృథ్వీ రాజ్, టేస్టీ తేజ, హరి తేజ డేంజర్ జోన్ లో ఉన్నారట. వీరి ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎలిమినేట్ అయ్యే వారిలో పృథ్వీ పేరు బలంగా వినిపిస్తోంది. గత మూడు వారాలుగా పృథ్వీ పర్ఫామెన్స్ ఆశించిన స్థాయిలో లేదు. 

దీనితో పృథ్వీ ఎలిమినేట్ అయ్యేందుకు హై ఛాన్సెస్ ఉన్నట్లు నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఒక వేళ వైల్డ్ కార్డులో ఒకరిని సాగనంపాలి అని భావిస్తే పృథ్వీ సేఫ్ అవుతాడు. అప్పుడు హరితేజ, టేస్టీ తేజ లలో ఒకరు బలికాక తప్పదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

Latest Videos

click me!