బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ప్రెగ్నెంట్ అయితే ..? ఓ సారి ఏం జరిగిదంటే..?

First Published | Aug 30, 2024, 6:30 PM IST

బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తరువాత లేడీ కంటెస్టెంట్స్ ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే..? అప్పుడు కంటెస్టెంట్‌ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇప్పటివరకు జరిగిన 7 సీజన్లలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? 

Bigg Boss Telugu

బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తరువాత లేడీ కంటెస్టెంట్స్ ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే..? అప్పుడు కంటెస్టెంట్‌ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇప్పటివరకు జరిగిన 7 సీజన్లలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? అలా జరిగితే ఏం చేస్తారు..? తెలుగు లేదా ఇతర భాషల్లో బిగ్‌ బాస్‌ హౌస్‌లలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైందా?.. 

Nagarjuna

బిగ్ బాస్ రియాల్టీషో.. ఎక్కడా లేని వింతలు .. విశేషాలు.. స్టార్ సెలబ్రిటీల పర్సనల్ విషయాలు. యాటీట్యూడ్ లు.. వారి వారి అభిరుచులు ఇవన్నీ బిగ్ బాస్ హౌస్ లోనే తెలుస్తాయి. మరీ ముఖ్యంగా సినిమా తారలు ఎలా ఉంటారు.. వారి బిహేవియర్ ఎలాంటిది అనేది కూడా బిగ్ బాస్ హౌస్ లోనే తెలిసిపోతుంటుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తరువాత ఎక్కువ కాలం తమ ఓరిజినాలిటీని దాచుకోలేరు కదా.. 


Bigg Boss Telugu 7

బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులు ఉండటం అంటే మాటలు కాదు.. ఎంతటి సెలబ్రిటీ అయినా.. వారి వారి పర్సనల్ జీవితంలో కొన్ని ముఖ్యమైన రోజులు అందులో త్యాగం చేయాల్సి వస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే.. కొంతమంది మెయిల్ స్టార్ కంటెస్టెంట్స్ బార్యలకు డెలివరీ అయ్యి.. పిల్లలు పుట్టి చూడలేని పరిస్థితి వచ్చింది. కొంత మంది లేడీ కంటెస్టెంట్స్ అయితే పిల్లలు పుట్టి నెల గడవకముందే హౌస్ లోకి వచ్చినవారు కూడా లేకపోలేదు. 
 

Bigg Boss House

ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తరువాత ఎవరైనా లేడీ కంటెస్టెంట్స్ కు ప్రెగ్నెస్సీ వస్తే..  ఏం చేస్తారు.. ఇంత వరకూ ఇలాంటి సంఘటన బిగ్ బాస్ హిస్టరీలో జరిగిందా...? ప్రెగ్నెంట్ అని తెలియగానే నెక్ట్స్ స్టెప్ ఏంటి..? హౌస్ నుంచి పంపిస్తారా..? లేక ఇంకా ఏమైన స్పెషల్ వసతులు కల్పిస్తారా...? చాలా మంది బిగ్ బాస్ అభిమానులకు ఈ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. 

అయితే ఎవరైనా సరే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తరువాత ప్రెగ్నెంట్ అవ్వడం అనేది ఉండదు. బయట నుంచి హౌస్ నుంచి వచ్చే టైమ్ లో కూడా అన్ని రకాల పరీక్షలు చేసే లోపలికి పంపిస్తారు. కాని లోపలకి వచ్చిన తరువాత ప్రెగ్నెన్సీ కన్ ఫార్మ్ అయితే  మాత్రం దానికి తగట్టుగానే నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.  ఈ విషయంలో హిందీ బిగ్ బాస్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ ను ఎక్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. 

గత సీజన్ లో హిందీ బిగ్ బాస్ లో ఇలాంటి సిచ్యూవేషన్ ఎదురయ్యింది ఓసారి.  దివంగత స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే బిగ్ బాస్ లో సందడి చేసింది. లాస్ట్ సీజన్ లో ఆమె తన భర్త విక్కీ జైన్ తో కలిసి బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఓ సందర్భంలో ఆమె తాను గర్భం  దాల్చానని అనుమానం వ్యక్తం చేసింది..తన భర్తతో మాట్లాడుతూ.. ‘నాకు పీరియడ్స్‌ రాలేదు. నా బీపీలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నేను ప్రెగ్నెట్ అనే అనుమానం వస్తుంది అని తెలిపింది.  దాంతో బిగ్ బాస్ అంకితను ప్రెగ్నెన్సీ టెస్ట్ కు పంపించారు.

ఒకవేళ ఆమె ప్రెగ్నెస్సీ కన్ ఫార్మ్ అయితే.. ఆమె వెళ్ళాలి అనుకుంటే వెంటనే ఇంటికి పంపించేవారు బిగ్ బాస్ టీమ్. కాని అత్యంత ఉత్కంఠపరిస్థితుల్లో అంకితాకు ప్రెగ్నెస్నీ టెస్ట్ నెగెటీవ్ వచ్చింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంలో అంకితకు, విక్కీకి మధ్య హౌస్ లో గొడవలు కూడా వచ్చాయి. ఇక ఇలా బిగ్ బస్ లోకి వెళ్తి ప్రెగ్నెంట్ అయితే తప్పకుండా ఆమెను తన ఇష్టప్రకారం ఇంటికి పంపించక తప్పదని తెలుస్తోంది. 
 

Latest Videos

click me!