ముగిసిన ఓటింగ్, ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ కి ఊహించని దెబ్బ, ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు

First Published | Nov 30, 2024, 10:35 AM IST

శుక్రవారంతో ఓటింగ్ ముగిసింది. నామినేషన్స్ లో ఉన్న 8 మందిలో ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయం. ఆదివారం బిగ్ బాస్ హౌస్లో భారీ ఎమోషనల్ డ్రామా చోటు చేసుకోనుంది.. 
 

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకోగా రసవత్తరంగా మారింది. ఈ వారం మొత్తం టికెట్ టు ఫినాలే గెలుచుకునేందుకు కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. టికెట్ టు ఫినాలే చాలా కీలకం. గెలిచిన కంటెస్టెంట్స్ నేరుగా ఫైనల్ కి వెళతారు. ఈ రెండు వారాలు సదరు కంటెస్టెంట్ నామినేషన్స్ లో ఉండరు. టాప్ 5లో బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. 
 

టికెట్ టు ఫినాలే టాస్క్స్ నిర్వహించేందుకు గత సీజన్లో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి రావడం విశేషం. అఖిల్ సార్థక్-హారిక, మానస్-ప్రియాంక జైన్, పునర్నవి-వితిక షేరు.. ఎంట్రీ ఇచ్చారు. వీరి రాకతో హౌస్ కి కొత్త కళ వచ్చింది. కంటెస్టెంట్స్ వారితో మమేకం అయ్యారు. చివర్లో శ్రీముఖి వచ్చింది. ఆమె ఫైనల్ టాస్క్స్ నిర్వహించింది. 


తేజ, రోహిణి, అవినాష్, నిఖిల్.. టికెట్ టు ఫినాలే టాస్క్ లో చివరి కంటెండర్స్ గా ఉన్నారు. తేజ సైతం రేసు నుండి తప్పుకున్నాడు. రోహిణి, నిఖిల్, అవినాష్ పోరాడారు. చివరకు అవినాష్, నిఖిల్ టికెట్ టు ఫినాలే కోసం తలపడ్డారు. ఫైనల్ టాస్క్ లో గెలిచి అవినాష్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. అవినాష్ బిగ్ బాస్ తెలుగు 8కి గాను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అయితే అవినాష్ నామినేషన్స్ లో ఉన్నాడు. అతడు ఎలిమినేట్ అయితే.. టికెట్ టు ఫినాలే వృద్థా అవుతుంది. 

ఇక 13వ వారానికి 8 మంది నామినేట్ అయ్యారు. మెగా చీఫ్ కావడంతో రోహిణిని ఎవరూ నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ సూచించారు. ఆమె మినహా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నామినేట్ అయ్యారు. శుక్రవారం అర్థరాత్రితో ఓటింగ్ ముగిసింది. లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఓటింగ్ రిజల్ట్స్ వచ్చాయి. గౌతమ్ తన ఆధిపత్యం కొనసాగిస్తూ మొదటి స్థానంలో ఉన్నాడు. 

నిన్నటి వరకు ప్రేరణ రెండో స్థానంలో ఉంది. నిఖిల్ ఆమెను చివర్లో అధిగమించాడని తెలుస్తుంది. దాంతో ప్రేరణ మూడో స్థానానికి వచ్చిందట. ఇక నాలుగో స్థానంలో అవినాష్ ఉన్నాడట. టేస్టీ తేజకు ఐదో స్థానం దక్కిందట.కాగా నబీల్, పృథ్వి, విష్ణుప్రియ వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారట. ఓటింగ్ సరళి ప్రకారం విష్ణుప్రియ ఈ వారం అవుట్. డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కాబట్టి, పృథ్వి సైతం ఇంటిని వీడే అవకాశం ఉంది. 

Bigg boss telugu 8

ఒకవేళ పృథ్వి ఎలిమినేటై విష్ణుప్రియ హౌస్లో ఉంటే.. భారీ ఎమోషనల్ డ్రామా చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. పృథ్వి కోసం విష్ణుప్రియ కన్నీరు మున్నీరు అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇది అనధికార ఓటింగ్ కాబట్టి అవినాష్, టేస్టీ తేజలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. మొత్తంగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కొనసాగుతుంది.. 

Latest Videos

click me!