ఆ తర్వాత టికెట్ టు ఫినాలే కోసం నిఖిల్, అవినాష్, రోహిణి పోటీ పడగా చివరికి అవినాష్ విజయం సాధించాడు. టికెట్ టు ఫినాలే విషయాల్లో టేస్టీ తేజకి అవకాశం ఇవ్వడానికి గౌతమ్ అంగీకరించలేదు. దీనితో తేజ హర్ట్ అయ్యాడు. ఆ తర్వాత తేజ, గౌతమ్ మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారింది. ఒకవైపు గౌతమ్ తప్పు లేదు, అతడి నిర్ణయం అతడి ఇష్టం అంటూనే టేస్టీ తేజ నెగిటివ్ కామెంట్స్ చేశాడు.