ఇక ఇంట్లోకి రేషన్ కావాలి అంటే.. ఇచ్చిన టైమ్ లోనే పోటీపడి రేషన్ తెచ్చుకోవాల్సి ఉంది. ఇక నబిల్, నిఖిల్ కలిసి రేషన్ కోసం హౌస్ లోకి వెళ్ళారు. వాళ్ళు తీసుకురాగలిగినంత రేషన్ తీసుకువచ్చారు. కాని అసలైన సాల్ట్ మిస్ చేశారు. దాంతో బిగ్ బాస్ ను అందరు బ్రతిమిలాడుకోవడం స్టార్ట్ చేశారు. సాల్ట్ కావాలని అడగడంతో బిగ్ బాస్ బేరాలు మొదలు పెట్టారు.
సాల్ట్ కావాలంటే ప్రైజ్ మని నుంచి 50 వేలు కోల్పోవలసి వస్తుందని హెచ్చరించారు. దాంతో ఒక్క ప్యాకెట్ ఉప్పుకోసం 50 వేలు పెట్టాల్సిన పరిస్థితి. అది కూడా నెక్ట్స్ టైమ్ వరకూ సరిపోతుందా లేదా అనేది తెలియదు. ఇక హౌస్ లో ఎవరికి వారు తమ పాయింట్స్ ను రెడీ చేసుకుంటున్నారు. ఈక్రమంలో ముందుగా అనుకున్నదే జరుగుతుంది.