మరోసారి ప్లైట్ ఎక్కి చెక్కేసిన మహేష్ బాబు.. ఫారెన్ కు వెళ్తున్నావా.. పక్కూరికి వెళ్తున్నావా బ్రో

First Published | Oct 8, 2024, 7:30 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి ఫారెన్ ప్లైట్ ఎక్కేశాడు. ఈమధ్యే ఇండియాకు వచ్చిన మహేష్.. మళ్లీ విదేశాకు చెక్కేశాడు. దాంతో టాలీవుడ్ లో మహేష్ ట్రిప్స్ పై కమాన్ గుసగుసా అనేస్తున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ ఇండియాలో ఉండేదానికంటే.. ఫారెన్ లో ఉండేది ఎక్కువైపోయింది. షూటింగ్స్ ఉంటనే ఇండియాలో ఉంటున్నారు. షూటింగ్స్ లేవు అంటే వెంటనే ఏదో ఒక ప్లైట్ ఎక్కేసి.. ఫారెన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక షూటింగ్ మధ్యలో కూడా కొన్నిరోజులు చిల్ అవ్వడానికి బ్రేక్ ఇచ్చి మరీ.. చెక్కేస్తుంటాడు మహేష్. ఈ మధ్య మరీ ఎక్కువగా ఫారెన్ కు వెళ్తున్నాడు సూపర్ స్టార్. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.
 

త్వరలో రాజమౌళి సినిమా స్టార్ట్ కాబోతోంది. ఈసినిమా షూటింగ్ ఎక్కువగా ఫారెన్ లోనే ఉండే అవకాశం ఉంది. ఇక ఈసినిమాను పాన్ వరల్ట్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. అందుకోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే మహేష్ బాబు లుక్స్ కు సబంధించిన ఫైనల్ అవుట్ పుట్ రావాల్సి ఉంది. ఇప్పటికే మహేష్ బాబులో చాలా ఛేంజ్ కనిపిస్తోంది. లాంగ్ హెయిర్.. మీడియాం గెడ్డంతో మెరిసిపోతున్నాడు మహేష్. 

నిర్మాతకు Jr NTR వార్నింగ్


అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. అంతే కాదు మహేష్ లుక్ పై కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈక్రమంలో మహేష్ బాబు లుక్ ఇంకా ఫైనల్ కాలేదు అంటున్నారు. ఆ లుక్ ను సెట్ చేసుకోవం కోసమే.. చాలా రోజులుగా ఆయన ఫారెన్ లో ఉంటున్నాడట. దానికి తగ్గ వాతావరణంలో.. స్పెషల్ మేకప్ తో పాటు..నేచురల్ గా తన లున్ ను ఇంప్రూవ్ చేసుకుంటున్నాడట మహేష్ బాబు. ఇప్పుడు ఉన్నదే ఫైన్ లుక్ అనుకుంటున్నారు కొందరు. 

నటన నేర్పిన గురువుకు ప్రభాస్ ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్

కాని మహేష్ ఫైనల్ లుక్ వచ్చిన తరువాత ఎవరీకి కనిపించే అవకాశం లేదు. షూటింగ్ ఓపెనింగ్ రోజు కూడా మహేష్ కనిపించరు. ఎందుకంటే.. ఆయన సినిమాల ఓపెనింగ్ కు మహేష్ బాబు ఎప్పుడూ రాలేదు. ఆయనకు అదో సెంటిమెంట్ ఉంది.

ఒక వేళ ఆయన తన సినిమా ఓపెనింగ్ కు వస్తే.. అది ప్లాప్అవుతుంది అనుకుంటాడో ఏమో. ఇక ఈక్రమంలోనే మహేష్ బాబు తాజాగా మరోసారి ఫారెన్ చెక్కేయడంతో.. ఈ టాపిక్ టాలీవుడ్ లో గట్టిగా నడుస్తోంది. 

ప్రస్తుతం ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఫ్యామిలీతో మాత్రం కనిపించాడు. గౌతమ్ ఎలాగో అమెరికాలో చదవుకుంటున్నాడు. ఇక మహేష్ తో పాటు నమ్రత, సితార కూడా వెంట ఉన్నారు. ఈసారి మహేష్ వెళ్లింది ఫ్యామిలీ వెకేషన్ కా.. లేకు రాజమౌళి సినిమా లుక్ కంప్లీట్ చేయడానికా అనేది మాత్రం క్లారిటీ రాలేదు. సో చూడాలి. మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతోందో..? 

Mahesh Babu

ఇక సూపర్ స్టార్ ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈసినిమా పర్వాలేదు అనిపించింది కాని మహేష్ బాబు రేంజ్ హిట్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఇక రాజమౌళి పాన్ వరల్డ్ సినిమాతో మహేష్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్ళబోతోంది అనేది మాత్రం నిజం. సో ఈమూవీని ఎప్పుడు మొదలు పెడతారో  చూడాలి. 
 

Latest Videos

click me!