హోస్ట్ నాగార్జునను కూడా కంట్రోల్ చేసే బిగ్ బాస్ ఎవరు? ఆ గంభీరమైన స్వరం వెనుక ఉన్న అదృశ్య శక్తి డిటైల్స్!

First Published | Aug 31, 2024, 11:58 AM IST


బిగ్ బాస్ రియాలిటీ షో సక్సెస్ వెనుక ఓ వ్యక్తి ఉన్నాడు. తెర వెనుక నుండి హోస్ట్ నాగార్జునతో పాటు కంటెస్టెంట్స్ ని కంట్రోల్ చేసే ఆ గంభీరమైన వాయిస్ ఎవరిదో తెలుసా?

Bigg Boss Telugu 8

ఎక్కడో విదేశాల్లో బిగ్ బ్రదర్ రియాలిటీ షోగా ప్రాచుర్యం పొందిన టెలివిజన్ షోని బిగ్ బాస్ గా ఇండియాకు తీసుకొచ్చారు. 2006లో నటుడు అర్షద్ వార్షి హోస్ట్ గా బిగ్ బాస్ హిందీ ఫస్ట్ సీజన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి అప్రతిహతంగా షో కొనసాగుతుంది. శిల్పా శెట్టి, అమితాబ్, సంజయ్ దత్ బిగ్ బాస్ హోస్ట్స్ గా చేశారు. అయితే సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ ఖాన్ తన మార్కు హోస్టింగ్ స్కిల్స్ తో సెటిల్ అయ్యారు. 
 


హిందీలో మొదలైన పదేళ్లకు 2017లో స్టార్ మా బిగ్ బాస్ షోని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయ్యింది. టాప్ సెలెబ్రిటీలు పాల్గొన్న సీజన్ వన్ ట్రెమండస్ సక్సెస్ కొట్టింది. షో గురించి పూర్తిగా అవగాహన లేకున్నా ఆడియన్స్ ఎగబడి చూశారు. 


Bigg Boss Telugu 7

ఫస్ట్ సీజన్ విన్నర్ గా శివబాలాజీ అవతరించారు. ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఎన్టీఆర్ సీజన్ 2 నుండి తప్పుకున్నారు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ అవతారం ఎత్తారు. నానికి యావరేజ్ మార్కులు పడ్డాయి. సీజన్ 3 లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున షోకి మరింత ఆదరణ తీసుకొచ్చారు. హోస్టింగ్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. నాగార్జున సారథ్యంలో బిగ్ బాస్ సీజన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. అధిక టిఆర్పి రాబడుతున్నాయి.
 

Bigg boss telugu 8

ఈ రియాలిటీ షో సక్సెస్ లో ఎవరికీ కనిపించని బిగ్ బాస్ పాత్ర ఎంతో ఉంది. తెరవెనుక నుండి వినిపించే బిగ్ బాస్ వాయిస్ ఆసక్తికరంగా ఉంటుంది. గంభీరమైన స్వరంతో కంటెస్టెంట్స్ కి ఆదేశాలిచ్చే బిగ్ బాస్ గొంతు ప్రేక్షకుల్లో ఎక్కడలేని క్యూరియాసిటీ కలగజేస్తుంది. బిగ్ బాస్ ప్రేక్షకులు ఒకసారి బిగ్ బాస్ ని చూడాలని కోరుకుంటారు. ఎలాంటి ఎమోషన్స్ చూపించకుండా కేవలం రూల్స్, రెగ్యులేషన్స్ మాట్లాడుతూ కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ గైడ్ చేస్తూ ఉంటాడు. చివరికి హోస్ట్ నాగార్జునకు కూడా ఆదేశాలిచ్చే అధికారం బిగ్ బాస్ కి ఉంటుంది. ఆయన కూడా బిగ్ బాస్ మాట వినాల్సిందే. 

Bigg boss telugu 8

అంతలా కట్టిపడేసే ఆ బిగ్ బాస్ వాయిస్ రేణుకుంట్ల శంకర్ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ది. ఆయన చాలా కాలంగా సినిమాలు, సీరియల్స్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు. శంకర్ వాయిస్ బిగ్ బాస్ క్యారెక్టర్ కి చక్కగా సెట్ అయ్యింది. దీంతో అన్ని సీజన్స్ కి ఆయనే బిగ్ బాస్ వాయిస్ అందిస్తున్నారు.   

Bigg Boss Telugu 8 Logo

కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 7న గ్రాండ్ గా లాంచ్ కానుంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన జరిగింది. మరోసారి నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు చేపట్టారు. లేటెస్ట్ సీజన్ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈసారి ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్ట్స్ కి లిమిటే లేదంటున్నారు నాగార్జున. లేటెస్ట్ సీజన్ సరికొత్తగా రూపొందించారని అర్థం అవుతుంది. 

Latest Videos

click me!