నిఖిల్ గాడిని చూస్తేనే కోపం వస్తోంది.. హౌస్ నాశనం కావాలంటే విష్ణుప్రియ చాలు..చిట్టా విప్పుతున్న సోనియా

First Published | Sep 12, 2024, 8:54 AM IST

బిగ్ బాస్ హౌస్ లో క్రమంగా ప్రకంపనలు పెరుగుతున్నాయి. రెండవ వారంలో కంటెస్టెంట్స్ వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు. ముందుగా విష్ణుప్రియ, సోనియా మధ్య మొదలైంది.

బిగ్ బాస్ హౌస్ లో క్రమంగా ప్రకంపనలు పెరుగుతున్నాయి. రెండవ వారంలో కంటెస్టెంట్స్ వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు. ముందుగా విష్ణుప్రియ, సోనియా మధ్య మొదలైంది. లవ్ ట్రాక్ లో ఉన్నారన్న సోనియా, నిఖిల్ మధ్య కూడా చిచ్చు రేగింది. బుధవారం రోజు ఫుడ్ కి సంబంధించిన టాస్క్ జరిగింది. 

ఈ టాస్క్ లో కూడా టెన్షన్ వాతావరణమే నెలకొంది. నిఖిల్ టీం ఫుడ్ టాస్క్ లో ఓడిపోవడంతో వాళ్ళకి ఎక్కువ ఫుడ్ లభించలేదు. యాష్మి, నైనికా టీం మాత్రమే ఫుడ్ టాస్క్ లో విజయం సాధించారు. నిఖిల్ టీం తరుపున పాల్గొన్న మణికంఠ గెలవలేకపోయాడు. అతడికి పోటీ సీత బరిలోకి దిగింది. మణికంఠ, నిఖిల్ కి ఫుడ్ లేకపోవడంతో సీత కూడా కన్నీరు పెట్టుకుంది. 

బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


బిగ్ బాస్ పంపిన కూరగాయలు ఉడికించుకుని తిని నిఖిల్, మణికంఠ కడుపునింపుకున్నారు. తనకి బాగా నీరసంగా ఉందని ఎవరైనా పల్పి ఆరెంజ్ ముఖాన కొట్టండి అని మణికంఠ వేడుకున్నాడు. పక్కనే ఉన్న నిఖిల్..రక్తం తాగుతున్నావు కదరా ఇంకేమి కావాలి నీకు అని ఘాటుగా అడిగాడు. 

Also Read: తనకి బాగా ఇష్టమైన ఇద్దరు హీరోయిన్లు ఎవరో చెప్పిన ఏఎన్నార్.. సావిత్రి ఎప్పుడూ బరువు ఎక్కువే అంటూ

హౌస్ లో ప్రస్తుతం బాగా సౌండ్ చేస్తున్న సోనియా..అభయ్ తో సీక్రెట్ విషయాలు మాట్లాడింది. ఒకవైపు సోనియా నామినేషన్స్ లో ఇచ్చిన షాక్ నుంచి నిఖిల్ ఇంకా తేరుకోలేదు. ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. దీనితో నైనిక.. నిఖిల్ వద్దకి వెళ్లి నువ్వొక ఎమోషనల్ ఫూల్ అని తిట్టింది. 

అభయ్ తో సోనియా మాట్లాడుతూ.. నిఖిల్ గాడిని చూస్తేనే కోపం వస్తోంది అంటూ హాట్ కామెంట్స్ చేసింది. అభయ్ సమాధానం ఇస్తూ నువ్వు.. నిఖిల్ ని పదేపదే లూజర్ అని తిడుతున్నావు అంట కదా.. దానికి నిఖిల్ ఫీల్ అవుతున్నాడు. ఇలా తిడుతుంటే ఇంకెలా మాట్లాడతా అని నిఖిల్ అంటున్నట్లు అభయ్ సోనియాకి తెలిపాడు. మరీ అంత మాట్లాడనవసరం లేదు.. క్యాజువల్ గా మాట్లాడొచ్చు కదా అని తెలిపింది. 

హౌస్ నాశనం కావాలంటే విష్ణుప్రియ లాంటి వాళ్ళు చాలు అన్నట్లుగా సోనియా మాట్లాడింది. హౌస్ లో అందరిని రెచ్చగోట్టెది విష్ణుప్రియ, ప్రేరణ అని సోనియా నిందలు వేసింది. ఇలా సోనియా ఒక్కొక్కరిపై తనకున్న ద్వేషాన్ని ప్రదర్శిస్తోంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. 

Latest Videos

click me!