భాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ ఇంపాక్ట్ ఏ స్టాయిలో ఉందో చెప్పిన కరణ్ జోహార్

First Published | Sep 12, 2024, 8:21 AM IST

 ఎన్టీఆర్ వచ్చి మా సినిమా గురించి మాట్లాడటం కలసి వచ్చింది. ఆయన ఇంపాక్ట్  బాక్సాఫీస్ దగ్గర బాగా ఉంది. అది ఆ చిత్రం బిజినెస్ బాగా ఉపయోగపడింది. 

Karan Johar, Jr NTR, Ranbir Kapoor, Alia Bhatt, Brahmastra


ట్రైలర్ రిలీజ్ తర్వాత  బాలీవుడ్ లో మెల్లిమెల్లిగా  'దేవర' మేనియా ఆవరించటం మొదలైంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముంబై వెళ్లినప్పటి నుంచి అటు సినిమా సర్కిల్స్, ఇటు సోషల్ మీడియా... అంతటా ఆయనే కనిపిస్తున్నారు. ఆయన్ను కలవడానికి అక్కడ  దర్శకులు అమితాసక్తి చూపిస్తున్నారు.  అలాగే బాలీవుడ్ స్టార్ డైరక్టర్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన కరణ్ జోహార్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ కరణ్ జోహార్ ఏమన్నారు. 


‘దేవర’ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా  మంచి  అంచనాలు ఉన్నాయి. ఇక అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ ఫిల్మ్ ‘జిగ్రా’ కూడా విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమా అక్టోబర్ 11న థియేటర్లలోకి రానుంది. ఆ రెండు సినిమాల పబ్లిసిటీ కోసం వీరిద్దరిని ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంటర్వ్యూ చేశారు.
 

Latest Videos



 ఈ క్రమంలో ఆలియా భట్ ద్వారా హిందీ ప్రేక్షకుల్లో ఇంకా ఎక్కువ మందికి దేవర చేరువ అవుతుందనేది నిజం . ఇక ఎన్టీఆర్ వల్ల సౌత్ ప్రేక్షకులకు జిగ్రా సినిమా గురించి తెలుస్తుందనేది ఇన్నర్ స్ట్రాటజీ. దీనివల్ల ఇద్దరి మిత్రులకు లాభం ఉంటుంది. కరణ్ జోహార్ తెలివిగా  జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ కలిపి ఇంటర్వూ చేసి విషయాన్ని హాట్ టాపిక్ గా మార్చేసారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ గురించి కరుణ్ జోహార్ చెప్పుకొచ్చారు. 


కరణ్ జోహార్ మాట్లాడుతూ..., “నాకు ఇంకా గుర్తుంది ఎన్టీఆర్ వంటి మాసివ్ మెగాస్టార్ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని జనంలోకి తీసుకు వెళ్లటానికి చేసిన ప్రయత్నం. ఆయన ‘బ్రహ్మాస్త్ర’ని హైదరాబాద్ లో ప్రెజెంట్ చేసారు. అది మా సినిమాకు పెద్ద మూమెంట్. ఎన్టీఆర్ వచ్చి మా సినిమా గురించి మాట్లాడటం కలసి వచ్చింది.

ఆయన ఇంపాక్ట్ ‘బ్రహ్మాస్త్ర’ బాక్సాఫీస్ దగ్గర బాగా ఉంది. అది ఆ చిత్రం బిజినెస్ బాగా ఉపయోగపడింది.  అందుకు మేము చాలా రుణపడి ఉన్నాం. కేవలం తారక్ మాత్రమే కాదు , ఈ జర్నిలో మాకు పరిచయమైన అందరూ మాకు సన్నిహితులు అయ్యారు. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. నేనేం మాట్లాడుతున్నానో ఎన్టీఆర్ కు తెలుసు.”  అన్నారు. 
 


ఇక రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor)‌, అలియా భట్ (Alia Bhatt)‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మకంగా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అయాన్‌ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకుడు. ఇందులోని మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ’ పేరుతో విడుదల చేసారు.

2022  సంవత్సరం సెప్టెంబర్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ ప్రీ రిలీజ్‌  రామోజీఫిల్మ్ సిటీ లో జరిపారు. సెప్టెంబర్‌ 2న జరిగిన ఈ వేడుకలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.  


అలాగే ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో ఆ తర్వాత తను చేసే ప్రాజెక్ట్స్‌పై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు ఎన్‌టీఆర్. ఆ మూవీ విడుదలయిన తర్వాత నుండి కొరటాల శివతో చేస్తున్న ‘దేవర’తోనే బిజీ అయ్యాడు. ‘దేవర’ కూడా ఇతర ప్యాన్ ఇండియా చిత్రాల్లాగానే రెండు భాగాలుగా విడుదల కానుందని,

అంతే కాకుండా ఇందులో ఎన్‌టీఆర్ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నాడని దర్శకుడు కొరటాల శివ స్వయంగా ప్రకటించాడు. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్‌లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. సెప్టెంబర్ 27న విడుదల తేదీని ఖరారు చేసుకోవడంతో ‘దేవర’ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఆ ప్రమోషన్స్ సమయంలోనే ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు ఎన్‌టీఆర్.
 


అసలైతే ‘దేవర’ మూవీ 2024 సమ్మర్‌లోనే విడుదల కావాల్సింది. పలు కారణాల వల్ల అక్టోబర్‌కు పోస్ట్‌పోన్ అయ్యింది. కానీ ఎవరూ ఊహించని విధంగా సెప్టెంబర్‌కు మూవీని ప్రీపోన్ చేశారు మేకర్స్. ఫైనల్‌గా సెప్టెంబర్ 27న ఈ మూవీ విడుదల అవుతుందని ప్రకటించారు.

దీంతో ముందుగా పాటలు విడుదల చేయడంతో సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇక సెప్టెంబర్ 10న ట్రైలర్ విడుదల అవుతుందని ప్రకటించి ఫ్యాన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యారు. ‘దేవర’ ప్రమోషన్స్ కోసం ఎన్‌టీఆర్ స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. అందుకే కరణ్ జోహార్‌, ఆలియా భట్‌తో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
 

click me!