సెకండ్ వీక్ నామినేషన్స్ లిస్ట్ ఇదిగో, మళ్ళీ మణికంఠకి గండం..ఆమెని సేవ్ చేసి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు

First Published | Sep 9, 2024, 12:12 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తొలి వారం ముగిసింది. అంతా ఊహించినట్లుగానే బేబక్కని ఎలిమినేట్ చేశారు. దీనితో తొలివారం ఎండ్ అయింది. ఫస్ట్ వీక్ హౌస్ లో జరిగిన పరిణామాలపై ఆడియన్స్ లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తొలి వారం ముగిసింది. అంతా ఊహించినట్లుగానే బేబక్కని ఎలిమినేట్ చేశారు. దీనితో తొలివారం ఎండ్ అయింది. ఫస్ట్ వీక్ హౌస్ లో జరిగిన పరిణామాలపై ఆడియన్స్ లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కంటెస్టెంట్స్ ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ.. ఎవరికీ ఆసక్తి కలగడం లేదు. ఆదిత్య ఓం, పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు సెకండ్ వీక్ లో అయినా యాక్టివ్ కావాలని ఆడియన్స్ భావిస్తున్నారు. 

ఇంతలోనే సెకండ్ వీక్ నామినేషన్స్ పూర్తయ్యాయి. సెకండ్ వీక్ లో నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ ముందుగానే బయటకి వచ్చేసింది. నామినేట్ అయిన కంటెస్టెంట్ వివరాలని ఏసియా నెట్ మీకు అందిస్తోంది. మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో మణికంఠ, నిఖిల్, పృథ్వీరాజ్, శేఖర్ భాషా, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, సీత, నైనికా అనసూరు ఉన్నారు. 
 


ఫస్ట్ వీక్ లో నామినేట్ అయిన మణికంఠ, పృథ్వీరాజ్, శేఖర్ భాషా, విష్ణుప్రియ మరోసారి సెకండ్ వీక్ లో కూడా నామినేట్ అయ్యారు. అంటే వీరికి మళ్ళీ ఎలిమినేషన్ గండం ఉంది. వీరిలో ప్రమాదకరంగా ఎలిమినేషన్ అంచున ఉన్నది మణికంఠ, పృథ్వీరాజ్ అనే పేర్లు వినిపిస్తున్నాయి. వీక్ మొత్తం బాగా పెర్ఫామ్ చేసి ఆడియన్స్ ఓట్లు గెలుచుకోవాలి. లేకుంటే మణికంఠ లాంటి వాళ్లకు కష్టమే అని అంటున్నారు. 

ఇదిలా ఉండగా నామినేషన్స్ లో దిమ్మతిరిగే ట్విస్ట్ చోటు చేసుకుంది. వాస్తవానికి సోనియా ఆకుల కూడా నామినేట్ అయింది. ఫస్ట్ వీక్ లో నామినేట్ అయిన సోనియా మంచి ఓటింగ్ పొంది సేఫ్ అయిపోయింది. సెకండ్ వీక్ లో కూడా ఆమె నామినేట్ చేశారు. కానీ నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేసే అధికారం యాష్మి క్లాన్ టీమ్ కి ఉంది. దీనితో యాష్మి క్లాన్.. సోనియాని సేవ్ చేశారు. ఆ విధంగా సోనియా ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. 

Sonia Akula

నామినేషన్స్ లో ఉన్న వారిలో నిఖిల్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి అతడికి ఎక్కువ ఓట్లు పడే ఛాన్స్ ఉంది. సో నిఖిల్ సేఫ్ అంటూ అంచనాలు వినిపిస్తున్నాయి. ఆదిత్య ఓం, విష్ణుప్రియ కూడా సేఫ్ కావచ్చు. శేఖర్ భాషా జోకులు వేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. అతడిపై కూడా ఆడియన్స్ లో పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఇక జాగ్రత్త పడాల్సింది మిగిలిన వాళ్లే. 

Latest Videos

click me!