బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా మొదటివారం పూర్తి చేసుకుంది. సోషల్ మీడియా స్టార్ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. శేఖర్ బాషా, నాగ మణికంఠ, విష్ణుప్రియ, పృథ్విరాజ్, సోనియా ఆకుల, బెజవాడ బేబక్క నామినేట్ అయ్యారు. వీరిలో బేబక్కకు అత్యల్పంగా ఓట్లు పోల్ అయ్యాయి. దాంతో ఆమె ఎలిమినేట్ అయ్యారని నాగార్జున వెల్లడించాడు.
ఇక హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈసారి పెద్దగా పేరున్న సెలెబ్స్ షోకి రాలేదు. బిగ్ బాస్ వలన పాజిటివిటీ కంటే నెగిటివిటీకి ఎక్కువ అవకాశం ఉంది. అనవసరంగా కెరీర్ రిస్క్ లో పడుతుందని టాప్ సెలెబ్స్ ఈ షోకి దూరంగా ఉంటున్నారు. సీజన్ 8 కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులు కొంత నిరాశకు గురయ్యారు.