యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. శర్వానంద్ నటిస్తున్న రెండు చిత్రాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. శర్వానంద్.. అభిలాష్ రెడ్డి అనే దర్శకుడి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. ఈ దర్శకుడు లూసర్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆసక్తికరమైన కథాంశంతో శర్వానంద్, అభిలాష్ రెడ్డి చిత్రం తెరకెక్కుతోంది.