Bigg boss telugu 8: బిగ్ బాస్ లోకి వెళ్తున్నా మనశ్శాంతి కావాలి.. సెకండ్ కంటెస్టెంట్ గా నిఖిల్..

First Published | Sep 1, 2024, 7:54 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో సెకండ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు సీరియల్ నటుడు నిఖిల్. హౌస్ లోకి జంటగా ఎంట్రీ ఇచ్చాడు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అట్టహాసంగా స్టార్ట్ అయ్యింది. నాగార్జున కొత్త లుక్ తో సరికొత్తగా కనిపించాడు. ఇక ఇక హౌస్ లో ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తుండగా..

సెకండ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు కన్నడ హీరో నిఖిల్. తెలగులో సీరియల్స్ ద్వారా ఫేమస్ అయ్యాడు నిఖిల్. ఈ హ్యాండ్సమ్ హీరో.. తెలుగులో వరుస సీరియల్స్ తో సందడి చేశాడు. 


Nikhil Profile, bio

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తూనే.. ఏం కావాలి అని నాగార్జున అడగ్గా.. తనకు మనశాంతి కావాలని.. కాని అది బిగ్ బాస్ లో ఉండడని అన్నాడు నిఖిల్. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన గోల్ వేరే అని. లవ్ లాంటివి కాదు.. తన గేమ్ తాను పర్ఫెక్ట్ గా ఆడతాను అంటున్నాడు నిఖిల్. 

 కన్నడ పరిశ్రమకు చెందిన నిఖల్.. తెలుగు సీరియల్స్ లో బాగా పాపులర్ అయ్యాడు. తెలుగులో గోరింటాకు, కోయిలమ్మ లాంటి సీరియల్స్ తో పాపులర్ అయ్యాడు. మైసూర్ లో పుట్టి పెరిగిన నిఖిల్..  అక్కడే గ్రాడ్యూయేషన్ కంప్లీట్ చేశాడు. ప్రవేట్ జాబ్ చేస్తూ.. కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. కన్నడాలో ఒక్కటే ఒక్క సీరియల్ చేశాడు. 
 

ఇక తెలుగులో వరుస సీరియల్స్ చేసి.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు నిఖిల్. గోరింటాకుతో బాగా ఫేమస్ అయిన నిఖిల్. ఆతరువాత కోయిలమ్మ సీరియల్ తో తెలుగులో పాతుకుపోయాడు. ఇక ఆతరువాత కలిసి ఉంటే కలదు సుఖం,అనుపల్లవి లాంటి సీరియల్స్ చేస్తున్నాడు నిఖిల్. 

nikhil maliyakkal

ఇక నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటాడో చూడాలి. మరో సీరియల్ యాక్ట్రస్ యాష్మి గౌడతో కలిసి హౌస్ లోకి వెళ్ళాడు నిఖిల్. తన స్ట్రాటజీ ఏం లేదు అన్నాడు. హౌస్ లో నిఖిల్ ఎలా ఉండబోతున్నాడో చూడాలి. 
 

Latest Videos

click me!