Bigg Boss Telugu 8:ఫస్ట్ కంటెస్టెంట్ యాష్మి లవ్ స్టోరీ.. బాయ్ ఫ్రెండ్ విషయంలో నాదే తప్పు, అందుకే బ్రేకప్ 

First Published | Sep 1, 2024, 7:40 PM IST

ఒక్కో కంటెస్టెంట్ బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇవ్వడం ప్రారంభించారు. వేదికపైకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ కంటెస్టెంట్ బుల్లితెర నటి యాష్మి గౌడ. మంచి డాన్స్ పెర్ఫామెన్స్ తో యాష్మి గౌడ ఎంట్రీ ఇచ్చింది. 

నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ తో ప్రారంభం అయింది. ఒక్కో కంటెస్టెంట్ బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇవ్వడం ప్రారంభించారు. వేదికపైకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ కంటెస్టెంట్ బుల్లితెర నటి యాష్మి గౌడ. మంచి డాన్స్ పెర్ఫామెన్స్ తో యాష్మి గౌడ ఎంట్రీ ఇచ్చింది. 

Yashmi Bigg boss8

ఆ తర్వాత నాగార్జున యాష్మి గురించి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. యాష్మి గౌడ కూడా ఎక్కడా తగ్గలేదు. రాగానే నాగార్జునకి బిస్కెట్లు వేసే ప్రయత్నం చేసింది. కొన్ని రోజ్ ఫ్లవర్స్ తీసుకువచ్చింది. మీ స్మైల్ అంటే ఇష్టం, మీ లుక్స్ అంటే ఇష్టం, మీ హోస్టింగ్ అంటే ఇష్టం అంటూ నాగార్జునకి యాష్మి ఒక్కో రోజా ఫ్లవర్ ఇచ్చింది. 


ఇక నాగార్జున యాష్మి పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నించారు. బాయ్ ఫ్రెండ్ గతంలో ఉండేవాడని.. బ్రేకప్ జరిగిందని తెలిపింది. అతని తప్పు లేదు. నా మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. అందుకే బ్రేకప్ జరిగింది అని యాష్మి గౌడ తెలిపింది. 

ఇక పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకి ఇప్పట్లో లేదని యాష్మి పేర్కొంది. మొదట రిలేషన్ షిప్ స్టార్ట్ అవ్వాలని ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని పేర్కొంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన 100 పెర్సెంట్ డెడికేషన్ ఇస్తానని పేర్కొంది. తన ఫుడ్ హాబిట్స్ చెప్పింది. బిర్యానీ లేకుండా ఉండలేనని పేర్కొంది. దీనితో నాగార్జున ఆమెకి ఫన్నీగా బిర్యానీ టెస్ట్ పెట్టారు. ఆ తర్వాత నాగ్ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. యాష్మిని హౌస్ లోకి పంపలేదు. కంటెస్టెంట్స్ లో ఒకరిని నీ పెయిర్ గా ఎంచుకుని అతడితో హౌస్ లోకి వెళ్లాలని నాగ్ తెలిపారు. దీనితో యాష్మి గౌడ తన పెయిర్ గా తెలివి, పౌరుషం లాంటి లక్షణాలు ఉన్న బుల్లితెర నటుడు నిఖిల్ ని ఎంచుకుంది. 

Latest Videos

click me!