ఈసారి బిగ్ బాస్ హౌస్లో కన్నడ వారిదే ఆధిపత్యం. మొత్తం నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ ని శాసిస్తున్నారు. నిఖిల్, యష్మి గౌడ్, పృథ్వి శెట్టి, ప్రేరణ స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో నటించారు. వీరు కన్నడ నటులు. ఎన్నడూ లేని విధంగా కర్ణాటకకు చెందిన నలుగురు సెలెబ్స్ తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు.
దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తోంది. తెలుగువారు కన్నడ వాళ్ళను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని ఒక వర్గం అసహనం వ్యక్తం చేస్తుంది. మాకు భాషా బేధాలు ఉండదు. గేమ్ ఆడినవారిని ప్రోత్సహిస్తామని మరో వర్గం అంటున్నారు. కన్నడ మీడియాలో మాత్రం తెలుగు బిగ్ బాస్ షోలో కన్నడ హవా అని కథనాలు వెలువడుతున్నాయి.
వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీరి దూకుడు కొంత మేర తగ్గించారు కానీ... పూర్తి అధిపత్యానికి అడ్డుకట్టవేయలేకపోయారు. ప్రేరణ, నిఖిల్, యష్మి, పృథ్వి మధ్య చిన్న చిన్న గొడవలు చోటు చేసుకుంటాయి. కానీ మరల ఒకటైపోతారు. వీరు ఒకరినొకరు నామినేట్ చేసుకోరు. గ్రూప్ గేమ్ ఆడతారు. ప్రతి సీజన్లో గ్రూప్స్ సహజమే. కానీ నిఖిల్ గ్రూప్ కి పోటీ ఇచ్చే మరో గ్రూప్ బిగ్ బాస్ హౌస్లో లేదు.
అయితే మొదటిసారి కన్నడ బ్యాచ్ కి షాక్ తగిలిందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. అనూహ్యంగా మారిన ఓటింగ్ నేపథ్యంలో పృథ్వి, యష్మిలలో ఒకరు ఎలిమినేట్ కానున్నారట. ఓటింగ్ లో విష్ణుప్రియ వెనుకబడింది. ఆమె ఎలిమినేట్ కావచ్చని కథనాలు వెలువడ్డాయి. విష్ణుప్రియ ఎలిమినేట్ కాని పక్షంలో అవినాష్ ఇంటిని వీడే అవకాశం ఉందన్నారు.
డేంజర్ జోన్లో ఉన్న విష్ణుప్రియ, అవినాష్ పుంజుకున్నారట. రెండో స్థానంలో ఉన్న యష్మి డేంజర్ జోన్లోకి వచ్చిందట. ఆమె చివరి స్థానంలో ఉందట. ఇక ఐదో స్థానంలో పృథ్విరాజ్ ఉన్నాడట. కాబట్టి ఈ వారం వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారట. కన్నడ టీమ్ నుండి ఒకరు హౌస్ నుండి బయటకు వెళ్లనున్నారట.
Bigg boss telugu 8
అనధికారిక ఓటింగ్ ప్రకారం పృథ్వి, యష్మిలలో ఒకరు అవుట్ అంటున్నారు. మరొక వాదన ఏమిటంటే.. డబుల్ ఎలిమినేషన్ అట. కాకపోతే ఒకరు బయటకు వెళతారట. మరొకరిని సీక్రెట్ రూమ్ కి పంపుతారట. టీఆర్పీ కోసం ఇలా చేయనున్నారని కొందరు బిగ్ బాస్ రివ్యూవర్స్ తెలియజేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.
గత వారం ఇద్దరు ఎలిమినేటైన సంగతి తెలిసిందే. గంగవ్వ వ్యక్తిగత కారణాలతో సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది. గంగవ్వ బిగ్ బాస్ నిర్వాహకులను డబ్బులు డిమాండ్ చేసిందనే ఓ వాదన వినిపిస్తోంది. గతంలో మాదిరి ఇల్లు కట్టించాలని ఆమె అడిగారని కథనాలు వెలువడుతున్నాయి. ఇక హరితేజ తక్కువ ఓట్లు తెచ్చుకున్న కారణంగా ఎలిమినేట్ అయ్యింది.