ప్రభాస్ 'రాజా సాబ్' లో రీమిక్స్ సాంగ్ ఇదే ? రైట్స్ కు అన్ని కోట్లా

First Published | Nov 16, 2024, 2:22 PM IST

ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో రీమిక్స్ పాట ఉండబోతుందని సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు. ఈ పాట ఓ పాత హిందీ పాట రీమిక్స్ అని, దీని కోసం దాదాపు రెండు కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

The Raja Saab Prabhas film reviews out


లేటెస్ట్ గా థమన్ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ తాజా చిత్రం రాజా సాబ్ కు సంబంధించిన కొన్ని విశేషాలు పంచుకున్నాడు. అందులో అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం రీమిక్స్ సాంగ్. కొన్నాళ్ల క్రితం రీమిక్స్ సాంగ్స్ అనేది ఓ ట్రెండ్ లా కనిపించింది. ఈ మధ్యన ఎవరూ చేయటం లేదు.

అప్పట్లో చిరంజీవి పాటలను ఆయన ఫ్యామిలీ మెంబర్స్ సినిమాల్లో ఎక్కువగా వాడారు. అలాగే పెద్దాయన ఎన్టీఆర్ పాటలను తారక్, బాలయ్య పాటలను కళ్యాణ్ రామ్ రీమిక్స్ చేశారు.  అయితే  ఒరిజినల్ లోని ఫీల్ ను రీ క్రియేట్ చేయడంలో వీళ్లంతా ఫెయిల్ అయ్యారనే విమర్శలు వచ్చాయి. దాంతో ఆ ట్రెండ్ కు ఫుల్ స్టాఫ్ పడింది.  అయితే రాజా సాబ్ లో ప్రభాస్ కోసం ఓ రీమిక్స్ సాంగ్ చేస్తున్నాడట తమన్. 

Prabhas, The Raja Saab, maruthi


రీమిక్స్ సాంగ్  కాక సినిమాలో ఇంకా ఆరు పాటలు ఉంటాయి అంటున్నాడు. అయితే ప్రభాస్ ఎవరి సాంగ్ ను రీ మిక్స్ చేయబోతున్నాడు అనే చర్చలు సాగుతున్నాయి. కొందరైతే ఓ అడుగు ముందుగు వేసి  ఖచ్చితంగా కృష్ణంరాజు పాటలే చేస్తున్నాడు అన్నారు. అయితే అవేమీ కాదు ఓ పాత హిందీ సాంగ్ ని రీమిక్స్ చేయబోతున్నారు. ఈసారి ఓల్డ్ బాలీవుడ్ క్లాసిక్ ని రీమిక్స్ చేస్తున్నారని టాక్‌.
 


Prabhas, The Raja Saab, maruthi


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ‘ఇన్ సాఫ్ అప్‌నే ల‌హోసే’ (1994) అనే చిత్రంలోని ‘హ‌వా… హ‌వా’ అనే పాట హ‌క్కుల్ని `రాజాసాబ్‌` టీమ్  చేజిక్కించుకొంద‌ని తెలుస్తోంది. మంచి మాస్ బీట్ ఉన్న పాట కావటంతో మారుతి పట్టుబట్టి మరీ ఆ పాటను తీసుకున్నారట.

ఆ పాట వచ్చిన కొత్తల్లో ఎక్కడ విన్నా ఆ పాటే వినపడేది.  ఇప్పుడు ఈ పాట‌ని మ‌ళ్లీ వినిపించి, థియేట‌ర్లో ఆ మ్యాజిక్  ని రీక్రియేట్ చేయాలనుకొంటున్నారు. ఈ పాట కోసం దాదాపు రూ.2 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు చేశార‌ని చెప్పుకుంటున్నారు. 

Prabhas, The Raja Saab, maruthi

ఇక సినిమాలో సెంకడాఫ్ లో ఈపాట చాలా కీల‌క‌మైన స‌మ‌యంలో వ‌స్తుంద‌ని, థియేట‌ర్ మొత్తం షేకైపోయేలా ఈ పాట‌ని తీర్చిదిద్ద‌నున్నార‌ని చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ చూపించనంత హారర్‌ను ‘రాజా సాబ్‌’లో చూపించనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పి సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజా సాబ్‌’ (Raja Saab).ప్రభాస్ కు పెరిగిన క్రేజ్ దృష్య్యా భారీ ఎత్తున ఈ సినిమా బిజినెస్ చేస్తున్నారు.  
 

Prabhas, The Raja Saab, maruthi


బడ్జెట్ విషయానికి వస్తే... అందుతున్న సమాచారం మేరకు రాజా సాబ్ మూవీ 450 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. హైదరాబాద్ అజీజ్ నగర్ లో సెట్స్ వేసి ఈ సినిమాని అక్కడే ఎక్కువ భాగం షూట్ చేసారు.

150 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ వర్కింగ్ డేస్. మారుతి సినిమాలో మేజర్ పోర్షన్ షూటింగ్ పూర్తి చేసారు. అయితే ప్రభాస్ అందుబాటులో లేక ఆయన పోర్షన్ పెండింగ్ లో ఉంది. ఈ సంవత్సరం చివర లోపల షూటింగ్ పూర్తి చేయాలనేది ప్లాన్. 

Prabhas, The Raja Saab, maruthi


ఇక ఈ సినిమాలో మేజర్ బడ్జెట్  VFX వర్క్ కు ఎలాట్ చేసారు.   నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్తూ..... ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని ఈమధ్యనే ప్రారంభం చేయలేదని.. ఈ సినిమాను రెండేళ్ల క్రిందటే ప్రారంభించామని ఆయన తెలిపారు.

అంతేగాక, ఈ సినిమాకు చాలా ఎక్కువ బడ్జెట్ కేటాయించామని.. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని హార్రర్ ఎలిమెంట్స్ ‘ది రాజా సాబ్’ మూవీలో ప్రేక్షకులు చూస్తారని ఆయన తెలిపారు.

Latest Videos

click me!