ఎవడిగోల వాడిదే.. బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల మంటలు..

First Published | Sep 3, 2024, 12:07 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అసలు కథ మొదలయ్యింది. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. మొదటి రోజే గొడవలు కొట్లాటలతో గందరగోళంగా మారిన బిగ్ బాస్ హౌస్ లో.. నామినేషన్ల ప్రక్రియ మరింత మంటను రగిల్చింది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 స్టార్ట్ అయ్యింది. మొదటిరోజు జరిగిన రచ్చ అంతా తెలిసిందే.. చిల్లరగొడవలతో హౌస్ అంతా చిందరవందరగా తయారయ్యింది. ఎవరికి వారు తాము హైలెట్ అవ్వాలన ఆరాటంలో.. దొరికిన ప్రతీ వారితో గోడవపెట్టుకోవడం మొదలు పెట్టారు. ఇక మరీ ముఖ్యంగా సోనియా అయితే.. నోటికి ఏమాత్రం రెస్ట్ ఇవ్వకుండా ప్రతీ ఒక్కరిపై ఒంటికాలితో లేస్తోంది. ఈక్రమంలోనేవీరి గొడవల మంటను రెట్టింపు చేయడానికి నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యింది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మొదలైన నామినేషన్ల గొడవ.. అసలే ఒకరిపై మరొకరు కోపాలు పెంచుకుని.. మండిపోయి ఉండగా.. ఈ నామినేషన్లు ఆమంటలను ఇంకాస్త పెంచుతున్నాయి. బేబక్కను మరోసారి కుక్కర్ విషయంలో నామినేట్ చేసింది సోనియా. మళ్లీ పాడిన పాటే పడింది. ఇర్రెస్పాన్సుబుల్ అంటూ ఓ వందసార్లు ఆ పదం వాడి ఉంటుమంది సోనియా. 


కాని ఈసారి బేబక్క మాత్రం కాస్త తనను తాను డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేసింది. కుక్కర్ పనిచేయకపోతే నన్నేం చేయమంటారు.. అందులో ఆవిరి మొత్తం పోవాలి కదా.. అంటూ తన వర్షన్ ను తాను వెల్లడించింది. 


ఇక బేబక్కతో పాటు బేబక్కతో పాటు..తాను నామినేట్ చేస్తున్న ఇతర కంటెస్టెంట్స్ పై ఫైర్ అయింది సోనియా. అందరిని టార్గెట్ చేస్తూ.. హౌస్ లో తానే హైలెట్ అవ్వాలని చూస్తుంది.  

ఇక అందరి మధ్య పుల్లలు పెడుతూ వస్తున్న మణికంఠ కూడా నామినేషన్స్ లో తన టాలెంట్ చూపించాడు. శేఖర్ బాషా ను నామినేట్ చేసి షాక్ ఇచ్చాడు. ఇక  మణికంఠ చేసిన పనితో  ఇద్దరి మధ్య ఘర్షన వాతవారణం వచ్చింది. నువ్వు చేసింది కరెక్ట్ కాదు అంటూ మణికంఠపై ఫైర్ అయ్యాడున శేఖర్ బాషా... 
 

వాడీ వేడిగా జరిగిన నామినేషన్ ప్రక్రియలో.. హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన వారు ఎవరు.. ఈ నామినేషన్లతో హౌస్ లో ఇంకెన్ని గొడవలు చూడబోతున్నాం.. ఇప్పటికే ముగ్గురు చీఫ్ లు తమ బాధ్యతలను తీసుకున్నారు. వారి మాటలు హౌస్ లో ఎంత మంది వింటారు. ఎపిసోడ్ లో చూస్తే తెలుస్తుంది మరి. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. వచ్చీరావడంతోనేమొదటిరోజే గొడవ స్టార్ట్ అయ్యింది. మణికఠ నుంచి స్టార్ట్ అయిన గొడవ.. హౌస్ అంతా పాకింది. సోనియాచేసిన రచ్చకు అందరు హడలిపోయారు. అటు శేఖర్ బాషా కూడా పైర్ అయ్యాడు.. 

ఇటు యాష్మి కూడా తన టంగ్ పవర్ ను చూపించింది. అటు బేబక్క మాత్రం కాస్త సేఫ్ గేమ్ ఆడుతుండగా.. నబిల్ మాత్రం అసలు ఉన్నాడా లేదా అన్నట్టుగా ఉంటున్నాడు. హౌస్ లో ఎవరి టాలెంట్ వారు చూపిస్తున్నారు. ఎవరు ఎక్కడా తగ్గడంలేదు.  

,

Latest Videos

click me!