మణికంఠకు భార్యతో చెడింది అక్కడే,  అసలు ప్రియ ఎక్కడ ఉందో తెలుసా?

First Published | Oct 25, 2024, 10:09 AM IST

నాగ మణికంఠకు భార్యతో విబేధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఒక చోట ఈయనొక చోట ఉంటున్నారు. భార్య ప్రియతో మణికంఠకు గల విబేధాలు కారణాలు ఏమిటో స్వయంగా తెలియజేశాడు.. 
 

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి నాగ మణికంఠ ఒక సెన్సేషన్. నాగ మణికంఠ చర్యలు చర్చకు దారి తీశాయి. విమర్శలతో పాటు ఒక ఐడెంటిటీ కూడా క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా కుటుంబాన్ని ఉద్దేశించి నాగ మణికంఠ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 
 

Bigg boss telugu 8

బాల్యంలోనే తండ్రి మరణించాడు. తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. స్టెప్ ఫాదర్ వలన అన్నీ కష్టాలే. వేధింపులు, అవమానాలు ఎదుర్కొన్నాను. చివరకు మా అమ్మ మరణిస్తే దహన సంస్కారాలకు డబ్బులు లేవు. అడుక్కుని ఆ కార్యక్రమం పూర్తి చేశాను అన్నాడు. 

అలాగే భార్య పిల్లలను ఉద్దేశించి కూడా నాగ మణికంఠ కీలక వ్యాఖ్యలు చేశాడు. నాకు వాళ్ళు కావాలి. అత్తారింటిలో గౌరవం దక్కాలి. అది జరగాలంటే నేను టైటిల్ విన్నర్ కావాలని కన్నీరు పెట్టుకున్నాడు. నాగ మణికంఠకు భార్యతో విబేధాలు ఉన్నాయనే సందేశాన్ని పరోక్షంగా జనాల్లోకి మణికంఠ కామెంట్స్ పంపాయి. 
 


నాగ మణికంఠ చెల్లులు సైతం ఇదే విషయాన్ని తెలియజేసింది. భార్య ప్రియకు నాగ మణికంఠకు మధ్య విబేధాలు ఉన్నాయని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. తాజాగా నాగ మణికంఠ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. భార్య ప్రియతో గొడవలకు కారణాలు చెప్పాడు. మీ భార్యతో మనస్పర్థలు విడాకుల వరకు వెళ్లిందట కదా? అసలు గొడవేంటి? ఎందుకు తలెత్తింది? అని యాంకర్ అడిగాడు. 

విడాకులు తీసుకునేంత పెద్ద గొడవలేమీ మాకు లేవు. పెళ్లయ్యాక నేను ప్రియతో పాటు అమెరికా వెళ్ళాను. డిపెండెంట్ వీసా మీద నేను అక్కడ ఉండేవాడిని. మూడు నెలల్లో వీసా వస్తుందని అనుకున్నాము. ఏడాదిన్నర గడిచినా వీసా లేదు. దానికి తోడు నాకు సంపాదన లేదు. వీసా ఎప్పుడు వస్తుందని ప్రియ తరచుగా అడిగేది. కాలం గడిచే కొద్దీ ఆమెలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. 
 

నువ్వు తిరిగి ఇండియా వెళ్ళిపోయి అక్కడ కెరీర్ చూసుకో అంది. ఇప్పుడా అని నేను అన్నాను. అప్పుడు పాపతో పాటు నేను ఇండియాకు వచ్చేశాను. తర్వాత నాకు వీసా వచ్చింది. తిరిగి అమెరికా వెళ్లాలనుకున్న సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. నా భార్య చాలా మంచిది. తనకు సహనం ఎక్కువ. చాలా మెచ్యూరిటీగా ఉంటుంది. నన్ను మూడేళ్లు భరించింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు... అని నాగ మణికంఠ చెప్పుకొచ్చాడు. 

నాగ మణికంఠకు వాళ్ళ తాతయ్య పెళ్లి చేశాడట. 25 ఏళ్లకే పెళ్లి అంటే కరెక్ట్ కాదేమో అని నాగ మణికంఠ అన్నాడట. ఎన్ఆరై అయిన ప్రియతో తాతయ్య సంబంధం కుదర్చాడట. పెళ్లి చూపుల కోసం ఇండియా వచ్చిన ప్రియతో మూడు గంటల్లో ప్రేమలో పడిపోయానని నాగ మణికంఠ అన్నాడు. 

Bigg boss telugu 8

ప్రస్తుతం నాగ మణికంఠ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. గతంలో నాగ మణికంఠ పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో నటించాడు. బిగ్ బాస్ షోతో భారీ ఫేమ్ తెచ్చుకున్న నేపథ్యంలో సినిమాల్లో అవకాశాలు వస్తాయని నాగ మణికంఠ భావిస్తున్నాడు. నాగ మణికంఠకు అమెరికా వీసా వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్ లోనే ఉంటాడా? తిరిగి అమెరికా వెళ్ళిపోతాడో? చూడాలి. 

నాగ మణికంఠ 7వ వారం ఎలిమినేటైన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో నాగ మణికంఠ బిగ్ బోస్ షో నుండి తప్పుకున్నాడు. తాను బిగ్ బాస్ హౌస్లో ఉండలేనని రిక్వెస్ట్ చేశాడు. ప్రేక్షకులు నాగ మణికంఠకు ఓట్లు వేశారు. అందరికంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ నాగ మణికంఠ అనారోగ్యం కారణంగా వెళ్లిపోతానన్నాడు. దాంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న నాగ మణికంఠ బిగ్ బాస్ ఇంటిని వీడాల్సి వచ్చింది. 
 

Bigg boss telugu 8

నాగ మణికంఠ ఎలిమినేషన్ ఒకింత చర్చకు దారి తీసింది. ఆయన అభిమానులు నిరాశ చెందారు. నాగ మణికంఠ జర్నీకి సంబంధించిన స్పెషల్ ఏవీ కూడా ప్రదర్శించలేదు. నాగ మణికంఠకు ఓట్లు పడుతున్నాయి. కాబట్టి అతడు ఎలిమినేట్ కాడని టీమ్ భావించి ఉండొచ్చు. గౌతమ్ కి తక్కువ ఓట్లు వచ్చాయి కనుక అతడి ఏవీ ఎడిట్ చేసి ఉంటారనే వాదన వినిపించింది. ఏది ఏమైనా ఫైనలిస్ట్స్ లో ఒకడిగా ఉంటాడనుకున్న నాగ మణికంఠ షోకి గుడ్ బై చెప్పాడు. 

ఈ వారం పక్కాగా ఇంటికి వెళ్లే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు?

Latest Videos

click me!