ఇది సినిమా కాదు.. జాగ్రత్తగా మాట్లాడండి.. హీరో విశాల్ కు హైకోర్ట్ వార్నింగ్..

తమిళ స్టార్ హీరో  విశాల్ పై మద్రాస్ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్ట్ కు సమాధానం చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. ఇంతకీ విషయం ఏంటంటే..? 
 

స్టార్ హీరో  విశాల్‌పై ఆగ్రహంవ్యక్తం చేసింది  మ‌ద్రాస్ హైకోర్ట్. విశాల్ కోర్ట్ కు వచ్చినప్పుడు అతని సమాధానం సరైనదై ఉండాలని సూచించింది.  లైకా ప్రొడెక్ష‌న్స్ కు సబంధించిన కేసు విషయంలో విశాల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జ్ అడిగిన ప్రశ్నలకు విశాల్ ఇచ్చిన సమాధానం కోపం తెప్పించడంతో.. ఈ వ్యాక్యలు చేశారు.  లైకాతో జ‌రిగిన ఒప్పందం గురించి ప్ర‌శ్నించ‌గా.. తాను కేవ‌లం తెల్ల కాగీతంపై సంత‌కం చేశాన‌ని చెప్పుకొచ్చారు. ఈ స‌మాధానంపై జ‌డ్జి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అసలు తెల్ల ఖాగీతంపై  సంతకం ఎలా  చేశారంటూ ప్ర‌శ్నించారు. ఇదేమీ సినిమా కాదు.. మీ సినమా షూటింగ్ అంతకన్నా కాదంటూ మండి పడ్డారు. అంతే కాదు  తెలివిగా స‌మాధానం చెబుతున్నానుకుంటున్నారా అంటూ..  ఘాటుగానే స్పందించారు  న్యాయమూర్తి. కోర్టులో ఉన్నప్పుడు  కాస్త జాగ్ర‌త్త‌గా సమాధానం చెప్పండి అన్నారు. ఇంత చెప్పిన తరువాత కూడా విశాల్ మరోసారి కోర్డ్ కు చిరాకు తెప్పించినట్టు తెలుస్తోంది. 
 


పందెం కోడి2 సినిమా  రిలీజ్ టైమ్ లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ వేసిన పిటీషియన్ కు సబంధించిన విషయంలో ఈ కేసు నడుస్తోంది. అసలు విషయం ఏంటంటే..  తమిళ సినిమా పరిశ్రమకు చెందిన అతిపెద్ద నిర్మాణ సంస్థ  లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ తో  హీరో విశాల్‌కు పడటం లేదు. వీరి మ‌ధ్య చాలా ఏళ్ల క్రితం నుంచి  విభేదాలు కొనసాగుతున్నాయి. లైకా వారిని విశాల్ మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. 

సినిమా తీస్తానని చెప్పి విశాలో లైకా నుంచి  21.29 కోట్లు అప్పుగా తీసుకున్నార‌ని, ఆ డ‌బ్బును విశాల్  ఇంత వరకూ ఇవ్వలేదంటూ...  నిర్మాత‌లు మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ చేసిన తరువాత విశాల్  15 కోట్లు డిపాజిట్ చేయాల‌ని కోర్ట్ ఆదేశించింది. అంతే కాదు ఈకేసు తేలే వరకూ..  విశాల్ న‌టించిన సినిమాల‌ు రిలీజ్ అవ్వకూడదంటూ స్టే  కూడా విధించింది. 

Madras high court

గతంలో ఈ తీర్పు ఇవ్వగా.. ఈవిషయాన్ని పట్టిచుకోకుండా  విశాల్ పందెం కోడి2 ను రిలీజ్ చేసి... కోర్టు తీర్పును ఉల్లంఘిచంచారని మరోసారి లైకా కోర్టును ఆశ్ర‌యించింది. ఈ విషయంలో విచారణ సమయంలో విశాలో ను కోర్డు కొన్ని ప్రశ్నలు వేసింది.  ముందే డ‌బ్బు తిరిగి ఇచ్చేస్తాన‌ని మాటిచ్చారా.? అన్న ప్ర‌శ్న‌కు విశాల్‌.. స‌మాధానం చెప్పేందుకు ఆస‌క్తి చూపించ‌లేదు… దాంతో మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన జ‌డ్జి, ఇలా ప్ర‌వ‌ర్తిసే కుద‌నర‌ద‌ని కరాఖండీగా చెప్పేశారు. 

Vishal Quit Smoking

ఇక విశాలు తనతప్పును ఒప్పుకున్నారు. తాను లైకా ద‌గ్గర డ‌బ్బు అప్పుగా తీసుకున్న‌ట్లు విశాల్ అంగీక‌రించారు. ఇక వాదనల అనంత‌రం కోర్ట్ ఈ కేసును శుక్ర‌వారానికి వాయిదా వేశారు. మరి విశాల్ ఈ కేసులో నెక్ట్స్ స్టెప్ ఏం తీసుకుంటారో చూడాలి. తమిళనాట సినీపరిశ్రమలో వివాదాస్పద నటుడిగా కొనసాగుతున్నారు విశాల్. తెలుగు సంతతికి చెందిన హీరో కావడంతో.. విశాల్ పై అక్కడ నాన్ లోకల్ అన్న వాదన ఎక్కువగా వినిపిస్తుంటుంది. 

Latest Videos

click me!