టాప్‌ 10 తెలుగు టీవీ షోస్‌.. అనసూయ దెబ్బకి రష్మి, శ్రీముఖి, సుధీర్‌లకు మైండ్‌ బ్లాక్‌.. ఫస్ట్ ప్లేస్‌ ఎవరంటే?

First Published | Aug 3, 2024, 1:06 PM IST

కరోనా తర్వాత టీవీ షోస్‌కి ఆదరణ పెరిగింది. ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి యూత్‌ వరకు అంతా వీటిని చూస్తున్నారు. అలా టీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ షోస్‌ బుల్లితెరపై దుమ్ములేపుతున్నాయి. లేటెస్ట్ టాప్‌ టీవీ షోస్‌ టీఆర్‌పీ రేటింగ్‌ వచ్చింది. ఇందులో టాప్‌లో ఏ షో ఉందనేది చూస్తే. 

ప్రస్తుతం తెలుగులో ప్రముఖంగా వినిపించే షోస్‌.. రష్మి గౌతమ్‌ `జబర్దస్త్`, నందు `ఢీః డాన్స్ షో`, రష్మి `శ్రీదేవి డ్రామా కంపెనీ`, శ్రీముఖి `స్టార్ మా పరివార్‌`, అనసూయ `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్`, సుమ `సుమ అడ్డా`, `డ్రామా జూనియర్స్`, సుడిగాలి సుధీర్‌ `ఫ్యామిలీ స్టార్‌`వంటి షోస్‌ ప్రముఖంగా ఉన్నాయి. వీటిలో ఏది టాప్‌ ఉందనేది చూస్తే. ఇందులో అనసూయ జోరు సాగుతుంది. ఆమె జబర్దస్త్ షోకి యాంకర్‌గా చేసింది. ఆ తర్వాత సినిమాల్లో బిజీ కావడంతో షోకి గుడ్‌ బై చెప్పింది. మళ్లీ ఇటీవలే `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` షోతో కమ్‌ బ్యాక్‌ అయ్యింది. 
 

దీనికి శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తుండా, శేఖర్‌ మాస్టర్‌, అనసూయ జడ్జ్ లుగా ఉన్నారు. లేడీ టీమ్‌కి అనసూయ, బాయ్స్ టీమ్‌కి శేఖర్ మాస్టర్ లీడర్స్ గా వ్యవహరిస్తుంటారు. ఇందులో చాలా వరకు బిగ్‌ బాస్ కంటెస్టెంట్లు, పాపులర్‌ టీవీ కమెడియన్లు, సీరియల్‌ నటులుపాల్గొంటున్నారు. రీతూ చౌదరి, విష్ణుప్రియా వంటి యాంకర్లు కూడా ఉన్నారు. లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో ఈ షో టాప్‌లో ఉంది. దీనికి అర్బన్‌, రూరల్‌ కలిపి 4.93 రేటింగ్‌ వచ్చింది. అర్బన్‌లో 5.38 రేటింగ్‌ రావడం విశేషం. ఇది నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. అనసూయ, శ్రీముఖి ఉండటమే ఈ క్రేజ్‌కి కారణమని నెటిజన్లు అంటున్నారు.  
 


ఆ తర్వాత స్థానంలో శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న `ఆదివారం స్టార్‌ మా పరివార్‌` ఉంది. ఇది కమెడియన్లు, టీవీ ఆర్టిస్టు లతో కలిసి శ్రీముఖి ఆడించే సరదా కామెడీ షో. స్టార్‌ మాలోనే వస్తోంది. దీనికి అర్బన్‌, రూరల్‌ కలిపి 4.80 రేటింగ్‌ రాగా, అర్బన్‌ 5 రేటింగ్‌ రావడం విశేషం. ఇలా రెండో స్థానంలో ఉంది. 
 

మూడో స్థానంలో ఈటీవీ న్యూస్‌ ఉంది. నాల్గో స్థానంలో రష్మి యాంకర్‌గా చేస్తున్న `శ్రీదేవి డ్రామా కంపెనీ నిలిచింది. దీనికి 3.94 రాగా, అర్బన్ లో 4 రేటింగ్‌ వచ్చింది. రష్మి మరో షో `జబర్దస్త్` 3 రేటింగ్‌తో ఏడో స్థానంలో ఉంది. 
 

ఐదో స్థానంలో సుడిగాలి సుధీర్‌ ఉన్నారు. ఆయన యాంకర్‌గా చేస్తున్న `ఫ్యామిలీ స్టార్` షోకి 3.5 రేటింగ్‌ వచ్చింది. అర్బన్‌లో 2.9 ఉంది. జబర్దస్త్ లో మెప్పించిన సుధీర్‌ యాంకర్‌ గా సోలోగా ఆ స్థాయిలో మెప్పించలేకపోతున్నాడు. 
 

డాన్స్ షో `ఢీ` కూడా రేటింగ్‌ బాగానే ఉంది. 3.38తో రేటింగ్‌తో ఇది ఆరో స్థానంలో నిలిచింది. `డ్రామా జూనియర్స్` 2.7తో ఎనిమిదో స్థానంలో, యాంకర్‌ సుమ హోస్ట్ చేస్తున్న `సుమ అడ్డా` 2.27 రేటింగ్‌తో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఏడు గంటలకు వచ్చే ఈటీవీ న్యూస్‌ పదో స్థానంలో నిలవడం విశేషం. 

ఇలా అనసూయ షో ముందు మిగిలిన వారంతా వెనకబడిపోయారని చెప్పొచ్చు. సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ ఉన్న రష్మి, సుధీర్‌లు, అలాగే టాప్‌ యాంకర్‌గా రాణించిన సుమ సైతం ఈ గేమ్‌లో వెనకబడిపోవడం గమనార్హం. 
 

Latest Videos

click me!