వస్తూనే ఆ ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ కి వల విసిరిన నయని పావని, ఈసారి మామూలుగా ఉండదట!

First Published | Oct 6, 2024, 9:00 PM IST

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ నయని పావని వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరోసారి ఆమె తన అదృష్టం పరీక్షించుకోనుంది. 
 

Bigg boss telugu 8

వేదికపైకి వచ్చిన నయని పావని చాలా ఎనర్జిటిక్ గా కనిపించింది. సీజన్ 7లో తాను త్వరగా ఎలిమినేట్ అయినందుకు ప్రేక్షకులు బాధపడ్డారని ఆమె అన్నారు. ఈసారి అసలు తగ్గేదే లేదు. సత్తా చాటుతానని విశ్వాసం వ్యక్తం చేసింది. కాగా నటుడు శివాజీ ఆమెకు ఓ సందేశం ఇచ్చాడు. ఆ వీడియో నాగార్జున ప్రత్యేకంగా ప్రదర్శించాడు.

Bigg boss telugu 8

టాస్క్ లలో గెలిస్తే నువ్వు మాత్రమే గెలుస్తావు. ప్రేక్షకుల హృదయాలు నువ్వు గెలవాలి. నిజాయితీగా గేమ్ ఆడు. ఆల్ ది బెస్ట్ అని శివాజీ ఆమెకు చెప్పాడు. బిగ్ బాస్ నాకు చాలా ఇచ్చింది. నాకు ఒక తండ్రిని(శివాజీ)ఇచ్చింది. హౌస్లోకి వెళ్లే మరో ఛాన్స్ ఇచ్చిందని నయని పావని ఆనందం వ్యక్తం చేసింది. 

కాగా హౌస్లోకి వెళ్లే ముందు పేరు చెప్పిన కంటెస్టెంట్స్ కి నువ్వు ఒక పాట డేడికేట్ చేయాలని నాగార్జున అన్నారు. మీరు మళ్ళీ ఫిటింగ్ పెట్టారా? అని నయని పావని టెన్షన్ పడింది. నబీల్ పేరు చెప్పగా... వీడు ఆరడుగుల బుల్లెట్, అనే సాంగ్ డెడికేట్ చేసింది. నిఖిల్ కి.. ఆరడుగులుంటాడా ఏడడుగులు వేస్తాడా.. డెడికేట్ చేసింది. ఇక పృథ్వికి... వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే, సాంగ్ నయని పావని డెడికేట్ చేసింది. వస్తూనే టాప్ కంటెస్టెంట్స్ కి నయని పావని వల వేసినట్లు అయ్యింది. 
 


Bigg boss telugu 8


నయని పావని.. సీజన్ 7 కంటెస్టెంట్. ఐదు వారాల అనంతరం ఆమె హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నయని పావని అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.వారం రోజుల వ్యవధిలో ఆమె ఎలిమినేట్ అయ్యింది. నయని పావని బాగా ఆడింది. కానీ ఆమెకు ఒక వారంలో ఫ్యాన్ బేస్ ఏర్పడలేదు. కాగా నయని పావని వారం రోజుల వ్యవధిలో ఎలిమినేట్ అవుతుందని అసలు ఊహించలేదు. నయని పావని చాలా ఆశలు పెట్టుకుంది. దాంతో ఎలిమినేషన్ ని తట్టుకోలేక బాగా ఏడ్చింది. 

నయని పావని ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో వివాదం నడిచింది. ఎట్టకేలకు ఆమెకు మరో ఛాన్స్ దక్కింది. ఈసారి మాత్రం ఆమె సత్తా చాటుతానని విశ్వాసం వ్యక్తం చేస్తుంది. ఇక నయని పావని కెరీర్ పరిశీలిస్తే.  
 

Bigg boss telugu 8

నయని పావని టిక్‌ టాక్‌ ద్వారా పాపులర్‌ అయ్యింది. ఆమె అసలు పేరు సాయి పావని రాజ్‌. తెలంగాణ అమ్మాయి. దీంతోపాటు షార్ట్ ఫిల్మ్స్ తో పేరు తెచ్చుకుంది. వాటిలో `సమయం లేదు మిత్రమా`, `ఎంత ఘాటు ప్రేమ`, `పెళ్లి చూపులు 2.0` వంటి షార్ట్ ఫిల్మ్స్ గుర్తింపు తెచ్చాయి. దీనికితోడు సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ రాణిస్తుంది. అలాగే డాన్స్ షో ఢీలోనూ పాల్గొంది. వీటితోపాటు `చిత్తం మహారాణి`, `సూర్యకాంతం` వంటి సినిమాల్లో నటించింది. 

హౌస్ నుండి బయటకు వచ్చాక ఫైనలిస్ట్ యావర్ తో కొన్ని వీడియోలు చేసింది. ఇద్దరూ రొమాన్స్ చేశారు. ఒక దశలో యావర్-నయని పావని లవర్స్ అంటూ ప్రచారం జరిగింది. అయితే వాళ్ళు కెరీర్ కోసమే సన్నిహితంగా కనిపించారని తర్వాత అర్థమైంది. ఇద్దరూ కలిసి సాంగ్స్ చేశారు. 

నయని పావని మెంటల్లీ అండ్ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్. ఆమె బిగ్ బాస్ హౌస్లో సత్తా చాటుతుంది అనడంలో సందేహం లేదు. తన కెరీర్ కి కూడా ఈ సీజన్ చాలా అవసరం అని ఆమె నమ్ముతున్నారు. హౌస్లో కొన్ని వారాలు రాణిస్తే.. గుర్తింపు లభించే అవకాశం కలదు. నయని పావనితో ప్రస్తుతం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ గట్టిగా పోరాడాల్సి ఉంటుంది. 

Bigg boss telugu 8

మరోవైపు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్న 8 మందిని రాయల్ క్లాన్ గా నాగార్జున ప్రకటించారు. హౌస్లో మొదటి నుండి ఉన్న కంటెస్టెంట్స్ ఒక క్లాన్, వైల్డ్ కార్డ్స్ మరొక క్లాన్ గా పోటీ పడనున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో షో మరింత రసవత్తరంగా మారనుంది. నయని పావనితో పాటు గత సీజన్స్ లో పాల్గొన్న అవినాష్, మెహబూబ్, హరితేజ, టేస్టీ తేజ, గంగవ్వ, గౌతమ్ కృష్ణ, రోహిణి హౌస్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో టైటిల్ విన్నర్ ఎవరనే చర్చ మొదలైంది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలై ఐదు వారాలు అవుతుంది. ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం వరుసగా ఇంటి బాట పట్టారు. నైనిక సైతం బిగ్ బాస్ ఇంటిని వీడనుందని సమాచారం. ఓటింగ్ లో వెనుకబడ్డ నైనిక కూడా ఎలిమినేట్ అయ్యింది. ఇక హౌస్లో 8 మంది ఉంటారు. 

ఆల్రెడీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ని నాగార్జున భయపెట్టే ప్రయత్నం చేశాడు. వైల్డ్ కార్డ్స్ తో మామూలుగా ఉండదు. వారు సామాన్యులు కాదు, జాగ్రత్తగా ఉండాలని నాగార్జున హెచ్చరించాడు. వైల్డ్ కార్డ్స్ మాకు అతిథులు. చక్కగా మర్యాదలు చేస్తాము. అనంతరం మెల్లగా ఇంటికి పంపిస్తామని, విష్ణుప్రియ విశ్వాసం వ్యక్తం చేసింది. వాళ్ళను ఓడించి నేను టైటిల్ గెలుచుకుంటానని ప్రేరణ.. నాగార్జునతో అన్నారు. 

బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి 
 

Latest Videos

click me!