ఆ కోరిక తీర్చుకునేందుకే గౌతమ్ కృష్ణ రీఎంట్రీ, విష్ణుప్రియకు పరీక్షే!

First Published | Oct 6, 2024, 9:52 PM IST

గౌతమ్ కృష్ణ గత సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా సత్తా చాటాడు.అతడికి మరో ఛాన్స్ దక్కింది. గౌతమ్ కృష్ణ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. 
 

Bigg boss telugu 8


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఐదవ వారం రసవత్తరంగా మారింది. అందుకు కారణం. ఏకంగా 8 మంది మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో గౌతమ్ కృష్ణ ఒకడు. గౌతమ్ కృష్ణ సీజన్ 7లో కంటెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 
 

Bigg boss telugu 8

గౌతమ్ కృష్ణకు నాగార్జున గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. అశ్వద్దామ 2.0 ఎలా ఉన్నాడని అడిగారు. ఇప్పుడు నేను 'సోలో బాయ్' సర్. ఆ టైటిల్ తో తెరకెక్కిన సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యిందని, గౌతమ్ చెప్పాడు. పనిలో పనిగా తాను ప్రధాన పాత్ర చేస్తున్న మూవీ ప్రమోషన్ చేసుకున్నాడు గౌతమ్ కృష్ణ.

గత సీజన్లో నేను బాగానే రాణించాను. కానీ ఫైనల్ కి వెళ్లలేకపోయాననే అసంతృప్తి ఉంది. ఆ కోరిక తీర్చుకోవాలనే బిగ్ బాస్ హౌస్ కి వచ్చానని గౌతమ్ అన్నాడు. ఇక గౌతమ్ కి తనతో పాటు సీజన్ 7లో కంటెస్టెంట్ చేసిన ప్రియాంక ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈసారి అశ్వద్ధామ 2.0 కాదు 4. 0 రేంజ్ లో ఆడాలని ఆమె సూచించారు. టైటిల్ గెలవాలని ఆశిస్తున్నట్లు ప్రియాంక సింగ్ తెలియజేసింది. 


బిగ్ బాస్ నాకు ప్రియాంక రూపంలో ఓ చెల్లిని ఇచ్చింది. మరోసారి రీ ఎంట్రీ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని గౌతమ్ అన్నాడు. హౌస్లో కత్తి ఎవరు? సుత్తి ఎవరు? అని నాగార్జున అడిగాడు. కత్తి ప్రేరణ, సుత్తి.. యష్మి అని గౌతమ్ తెలియజేశాడు. అలాగే తనకు నబీల్ పోటీగా భావిస్తున్నానని, నాగార్జున ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఓ టాస్క్ ఇచ్చి గౌతమ్ ని నాగార్జున హౌస్లోకి పంపాడు. హౌస్లోకి గౌతమ్ వంటి గ్లామరస్ ఫెలో వచ్చిన నేపథ్యంలో... విష్ణుప్రియకు పరీక్షే అనే వాదన వినిపిస్తుంది. ఆమె ఆల్రెడీ పృథ్వికి కనెక్ట్ అయ్యింది. 

కాగా గౌతమ్ కృష్ణ వృత్తి రీత్యా డాక్టర్. కానీ నటుడు కావాలనేది అతడి ఆకాంక్ష. తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్ చదివాడు. గౌతమ్ కృష్ణ ఒక ప్రొఫెషనల్ డాక్టర్. అతడు ఎంబిబిఎస్ పట్టా పొందాడు.    
 

Bigg Boss Telugu 7

డాక్టర్ అయ్యాక కూడా యాక్టర్ కావాలన్న తన కోరిక చంపుకోలేదు. 2018లో ఎంబీబీఎస్, 2021లో ఎంబీఏ పూర్తి చేసిన గౌతమ్ కృష్ణ... సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. 2022లో విడుదలైన ఆకాశ వీధుల్లో మూవీలో గౌతమ్ కృష్ణ హీరోగా నటించాడు. అది లోబడ్జెట్ మూవీ కావడంతో జనాల్లోకి వెళ్ళలేదు. 

పాపులారిటీ తెచ్చుకోవడానికి బిగ్ బాస్ షో మార్గమని నమ్మిన గౌతమ్ కృష్ణ ప్రయత్నం చేశాడు. 2023లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో గౌతమ్ కృష్ణ కంటెస్ట్ చేశాడు. గౌతమ్ కృష్ణ తోటి కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ పై చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. యావర్ శరీరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... అతడు స్టెరాయిడ్స్ తో శరీరం పెంచాడు. కానీ నాది సహజంగా అభివృద్ధి చేసిన శరీరం అన్నాడు. 

Bigg Boss Telugu 7

ఈ కామెంట్స్ పై నాగార్జున సైతం వివరణ కోరాడు. అనూహ్యంగా గౌతమ్ 5వ వారం ఎలిమినేట్ అయ్యాడు. అయితే హోస్ట్ నాగార్జున గౌతమ్ కి మరో ఛాన్స్ ఇచ్చాడు. సీక్రెట్ రూమ్ కి పంపించాడు. గౌతమ్ ఎలిమినేషన్ కి కంటెస్టెంట్స్ నిర్ణయం కారణం కావడంతో.. రీ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్, వారిపై ఫైర్ అయ్యాడు. అశ్వద్ధామ ఈజ్ బ్యాక్ అంటూ, ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. గౌతమ్ రీ ఎంట్రీ అనంతరం బాగానే ఆడాడు. అయితే ఫైనల్ కి వెళ్లలేకపోయాడు.  

Latest Videos

click me!