ఐదు వారాలకు భారీగా ఆర్జించిన గంగవ్వ, ఇక హరితేజకు ఎన్ని లక్షలు అంటే?

First Published | Nov 12, 2024, 4:37 PM IST

పదవ వారం ఇద్దరు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇంటిని వీడారు. ఒకరు గంగవ్వ కాగా, మరొకరు హరితేజ. వీరిద్దరూ రెమ్యూనరేషన్ రూపంలో భారీగా ఆర్జించినట్లు సమాచారం అందుతుంది. 
 


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో షో ముగియనుంది. గత వారం ఇద్దరు బిగ్ బాస్ ఇంటిని వీడారు. గంగవ్వ, హరితేజ బయటకు వచ్చారు. గంగవ్వ ఎలిమినేట్ కాలేదు. ఆమె వ్యక్తిగత కారణాలతో వెళ్లిపోయారు. ఇక హరితేజను ప్రేక్షకులు ఎలిమినేట్ చేశారు. 
 

గంగవ్వ, హరితేజ పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ రూపంలో ఆర్జించినట్లు సమాచారం. ఆ వివరాలు పరిశీలిస్తే... సీజన్ 8లో ఎన్నడూ లేని విధంగా 8 మందిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్లోకి ప్రవేశ పెట్టారు. వారు మాజీ కంటెస్టెంట్స్ కావడం మరొక విశేషం. గత సీజన్స్ లో పార్టిసిపేట్ చేసిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎంపిక చేశారు.


వారిలో గంగవ్వ, హరితేజ కూడా ఉన్నారు. గంగవ్వ సీజన్ 4 కంటెస్టెంట్ యూట్యూబర్ అయిన గంగవ్వ సోషల్ మీడియా వేదికగా పాపులారిటీ తెచ్చుకుంది. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ లో గంగవ్వ వీడియోలు చేసేవారు. ఆ ఫేమ్ ఆమెకు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం తెచ్చిపెట్టింది. ప్రేక్షకుల్లో గంగవ్వకు విపరీతమైన సింపతీ ఉండేది. అందువల్ల ఆమెకు ఓట్లు పడేవి. ఇతర కంటెస్టెంట్స్ సైతం ఆమెను నామినేట్ చేసేవారు కాదు. 
 

Bigg boss telugu 8

అయితే గంగవ్వకు బిగ్ బాస్ ఇంటి వాతావరణం పడలేదు. ముఖ్యంగా ఆమె చలికి ఇబ్బంది పడేవారు. కుటుంబ సభ్యులపై బెంగతో కొన్ని వారాలకు ఆమె బయటకు వెళ్లిపోయారు. మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత సీజన్ 8లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. గంగవ్వ వద్దని మొదటి నుండి డిమాండ్ వినిపించింది. కానీ మేకర్స్ ఆమెకు మరో ఛాన్స్ ఇచ్చారు. ఈసారి కూడా ఆమె ప్రేక్షకులు ఎలిమినేట్ చేయకుండానే ఇంటిని వీడింది. 
 

ఇక హరితేజ విషయానికి వస్తే 2017లో ప్రసారమైన సీజన్ 1 కంటెస్టెంట్. నటిగా ఆమెకు కొంత పాపులారిటీ ఉంది. ఆ విధంగా ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. సీజన్ 1లో హరితేజ సత్తా చాటింది. ఆమె ఫైనల్ కి వెళ్ళింది. టైటిల్ రేసులో నిలిచిన హరితేజ టాప్ 3 పొజీషన్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేశాక హరితేజకు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ పెరిగాయి. 

పలు హిట్ చిత్రాల్లో హరితేజ కీలక రోల్స్ చేసింది. ఏడేళ్ల అనంతరం సీజన్ 8లో తిరిగి కంటెస్ట్ చేసింది. ఈసారి పూర్తి స్థాయిలో హరితేజ రాణించలేదు. ఆమె జర్నీ ఐదు వారాలకే ముగిసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన హరితేజ 10వ వారం ఎలిమినేట్ అయ్యింది. 
 

ఇక గంగవ్వ ఐదు వారాలకు రెమ్యూనరేషన్ గా రూ. 15 లక్షలు తీసుకుందని సమాచారం. వారానికి రూ. 3 లక్షలు ఒప్పందం పై గంగవ్వ హౌస్లో అడుగుపెట్టారట. మరోవైపు హరితేజ వారానికి రూ. 3.5 లక్షల ఒప్పందంతో కంటెస్ట్ చేశారట. ఆ లెక్కన ఐదు వారాలకు రూ. 17.5 లక్షలు తీసుకున్నారట. వారిద్దరికి ఉన్న ఫేమ్ రీత్యా ఇది పెద్ద మొత్తమే అని చెప్పొచ్చు. 

ఇక 11వ వారానికి యష్మి, గౌతమ్, పృథ్వి, అవినాష్, టేస్టీ తేజ, విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. గౌతమ్ ఓటింగ్ లో ముందంజలో ఉండగా, విష్ణుప్రియ, అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 
  

Latest Videos

click me!