కంగనా రనౌత్
కంగనా 2017 సెప్టెంబర్‌లో రూ.20.7 కోట్లకు ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. 2022 డిసెంబర్‌లో ఆమె ఐసిఐసిఐ బ్యాంక్ నుండి రూ.27 కోట్ల రుణం కూడా తీసుకుంది. ఈ ఆ డబ్బులు ఆమె నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ కార్యాలయం నిర్మాణానికి వాడినట్టు తెలుస్తోంది.
కంగనా ఇల్లు
నిర్మాణ సంస్థ కు సబంధించిన ఓనర్ పేరు బయటకు చెప్పలేదు కాని.. ఆ కార్యాలయం కంగనాదే అని తెలుస్తోంది. వీడియో వివరణ ప్రకారం, బంగ్లా తో పాటు నిర్మించబడిన భూమి సైజు 285 చదరపు మీటర్లు, మొత్తం నిర్మాణ స్థలం 3042 చదరపు అడుగులు.
కంగనా రనౌత్
నివాసంలో 500 చదరపు అడుగుల పార్కింగ్ స్థలం కూడా ఉంది. ఈ నిర్మాణం రెండు అంతస్తులతో ఉంది, దీని విలువ రూ.40 కోట్లు. 2020లో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తనిఖీ చేసిన ఆస్తి ఇదే. 2020 సెప్టెంబర్‌లో ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి బీఎంసి కంగనా బాంద్రా కార్యాలయంలోని కొన్ని భాగాలను కూల్చివేసింది.
కంగనా రనౌత్
సెప్టెంబర్ 9న, బాంబే హైకోర్టు స్టే ఇవ్వడంతో కూల్చివేత పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కంగనా బీఎంసిపై పిటిషన్ దాఖలు చేసి, బీఎంసి నుండి రూ.2 కోట్ల పరిహారం కోరింది, కానీ 2023 మేలో తన కంప్లైయింట్ ను రిటర్న్ తీసుకుంది. ఇక ఇప్పుడు ఆ ఇంటిని ఆమె అమ్మేసినట్టు సమాచారం.