మాజీ మామకి సాయం చేసి రికార్డు బద్దలు కొట్టిన సమంత..అందరికి షాక్ తెలుసా..

First Published | Sep 1, 2024, 11:09 AM IST

బిగ్ బాస్ తెలుగు షో ఆల్రెడీ 7 సీజన్లు పూర్తి చేసుకుంది. 8వ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. మరికొన్ని గంటల్లో సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ తో ప్రారంభం కాబోతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్

బిగ్ బాస్ తెలుగు షో ఆల్రెడీ 7 సీజన్లు పూర్తి చేసుకుంది. 8వ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. మరికొన్ని గంటల్లో సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ తో ప్రారంభం కాబోతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

కొత్త సీజన్ లో హౌస్ డిజైన్ ఎలా ఉండబోతోంది ? కంటెస్టెంట్స్ ఎవరు ? ఎలాంటి ఈసారి ఎలాంటి రూల్స్ ఉండబోతున్నాయి ? లాంటి విషయాలు ఆసక్తికరంగా మారాయి. 

ఈ క్రమంలో బిగ్ బాస్ షోకి సంబంధించిన అన్ని సీజన్లలో జరిగిన ఆసక్తికర విషయాలని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. తొలి సీజన్ కి ఎన్టీఆర్, రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా చేశారు.

మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. అయితే వీరు ముగ్గురే కాదు.. మరికొందరు కూడా బిగ్ బాస్ తెలుగు షోకి టెంపరరీ హోస్ట్ లుగా చేశారు. వారు ఎవరో కాదు.. సమంత, రమ్యకృష్ణ. 


Samantha

నాగార్జున బిజీగా ఉన్న సమయంలో వీరిద్దరూ కొన్ని వారాలు హోస్ట్ గా మేనేజ్ చేశారు. సీజన్ 4లో సమంత ఓ వీకెండ్ లో హోస్ట్ గా మెరిసింది. సీజన్ 4 లో ఏడవ వారం వీకెండ్ లో నాగార్జున అందుబాటులో లేరు.

మనాలిలో షూటింగ్ కి హాజరు కావలసి వచ్చింది. దీనితో మామగారి కోసం సమంత టెంపరరీ హోస్టుగా చేసింది. సమంతకి గతంలో కొన్ని టాక్ షోలకి హోస్ట్ గా చేసిన అనుభవం కూడా ఉంది. 

ఇక యువతలో సమంతకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత బిగ్ బాస్ హోస్ట్ గా కనిపించడంతో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఆసక్తికర విషయం ఏంటంటే లాంచ్ ఎపిసోడ్, గ్రాండ్ ఫినాలే కాకుండా ఆ సీజన్ అన్ని వీకెండ్స్ లో హైయెస్ట్ టీఆర్పీ వచ్చింది సమంత ఎపిసోడ్ కె కావడం విశేషం. ఏకంగా 11.4  టీఆర్పీ తో సామ్ రికార్డులు బద్దలు కొట్టేసింది. 

మామగారి కోసం సమంత చేసిన ఆ సాయం బిగ్ బాస్ షోకి రికార్డు వ్యూస్ తెప్పించింది. ఆ తర్వాత కాలంలో సమంత నాగ చైతన్యతో విడిపోయి అక్కినేని ఫ్యామిలీకి దూరం అయిన సంగతి తెలిసిందే. 

సీజన్ 7 లాంచ్ ఎపిసోడ్ కి 18.1 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మరి సీజన్ 8 లాంచ్ ఎపిసోడ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. లాంచ్ ఎపిసోడ్ కి చాలా మంది అతిథులు వేదికపై సందడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పటిలాగే హీరోయిన్ల ఆటపాటలు ఎంటర్టైన్ చేయబోతున్నాయి. 

Latest Videos

click me!