మళ్ళీ ముంబై వెళ్లి 2010 నుంచి కెరీర్ మళ్ళీ ప్రారంభించా. ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేశా అని ఆదిత్య ఓం తెలిపారు. నాకు ఇంత ఇచ్చిన ఇండస్ట్రీకి, ప్రజలకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో.. భద్రాద్రి కొత్తగూడెం దగ్గర చెరువు పల్లి, కొత్తపల్లి గ్రామాల్లో సామజిక సేవ చేస్తున్నట్లు ఆదిత్య తెలిపారు. తనని తాను తిరిగి ఆడియన్స్ కి పరిచయం చేసుకునేందుకు బిగ్ బాస్ కి వచ్చినట్లు ఆదిత్య తెలిపారు. నాగార్జునతో సరదాగా ముచ్చటించిన తర్వాత తన పెయిర్ గా నటి సోనియా ఆకులని ఎంచుకున్నారు.