బిగ్‌ బాస్‌ నాలుగో కంటెస్టెంట్‌ తింగరి పిల్ల... ఈమెను హ్యాండిల్‌ చేయడం మామూలు విషయం కాదు!

First Published | Sep 1, 2024, 8:19 PM IST

Bigg Boss Telugu Season 8: కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో తింగరి పిల్లగా ఫేమస్ అయిన ప్రేరణ కంబం... బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నాలుగో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. స్పోర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న ప్రేరణ... బిగ్ బాస్ హౌస్‌లో గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

Prerana Kambam

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 8లో నాలుగో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది ప్రేరణ కంబం. ఈమె కూడా బుల్లితెర నటిగానే గుర్తింపు పొందింది. మా టీవీలో ప్రసారమయ్యే కృష్ణా ముకుంద మురారి సీరియల్‌లో ప్రేరణ హీరోయిన్‌గా నటించింది. కృష్ణా ముకుంద మురారి సీరియల్‌లో కృష్ణ పాత్రలో నటించింది. తింగరి పిల్లగా బాగా పేరు తెచ్చుకుంది. ఇన్నోసెంట్‌ డాక్టర్‌ పాపులర్‌ అయింది. 

Prerana Biggboss Telugu 8

ప్రేరణ హీరోయిన్‌గా నటించిన కృష్ణా ముకుందా మురారి సీరియల్‌లో విలన్‌గా నటించిన యష్మీ గౌడ్‌  బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 8 తొలి కంటెస్టెంట్‌ అడుగు పెట్టింది. మా టీవీలోని ఒకే సీరియల్‌లో నటించిన ఇద్దరు యాక్టర్లు బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. 


prerana kambam

డబ్బు, సంతోషంతో గడపడం, మంచి రిలేషన్‌ షిప్‌ కలిగి ఉండటం, చేసే పనిని జాలీగా చేయడం ప్రేరణకి ఇష్టం. ఇంకా, ప్రేరణ వంట బాగా చేస్తుంది. 

ఇంకా, స్పోర్ట్స్‌ అంటే ప్రేరణకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అనేక స్పోర్ట్స్‌ కాంపిటేషన్స్‌లో పాల్గొంది. లాంగ్‌, జంప్‌ లాంటి క్రీడల్లో పాల్గొంది. బేస్‌ బాల్‌, ఫుట్‌ బాల్‌, సాఫ్ట్‌ బాల్‌, రగ్బీ ఆటలు బాగా ఆడతారు. 

ప్రేరణ గురించి మరో ఇంట్రెస్టింగ్‌ విషయం ఏంటంటే.. నేషనల్‌ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మంధనాకి ప్రేరణ క్లోజ్‌ ఫ్రెండ్‌. ఎంత క్లోజ్‌ ఫ్రెండ్‌ అంటే అర్ధరాత్రులు స్కూటీ వేసుకొని రోడ్లపై తిరిగే అంత.

prerana kambam Husband

ఎల్లో కలర్‌ డ్రెస్‌లో నాలుగో కంటెస్టెంట్‌గా ప్రేరణ బిగ్‌ బాస్‌లోకి ఎంట్రోకి ఇచ్చింది. ప్రేరణకి పెళ్లయి 8 నెలలు అవుతోంది. పెళ్లి చేసుకున్న ఎనిమిది నెలలకే బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి రావడం. భర్త పేరు శ్రీపాద్‌. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో ప్రేరణ వివాహ వేడుక జరిగింది. 

ఈ సీజన్‌లో థీమ్‌ 'నో మోర్‌ సింగిల్‌'.. సో, మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అభిరామ్ నవీన్‌తో కలిసి జోడీగా బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రేరణ. తన జోడిగా అభిరామ్‌ ఎంచుకున్న కార్డ్‌ ఎల్లో.. అదే కలర్‌ డ్రెస్‌లో ప్రేరణలో బిగ్‌ బాస్‌లోకి వచ్చింది. ఇంకా, ప్రేరణలో ఉండే క్వాలిటీస్‌ వాగుడు కాయ (మాట్లాడుతూనే ఉంటుంది), ఫైటర్‌ (గట్టిగా పోట్లాడుతుంది), ఇంకా తెలివైంది. 

Latest Videos

click me!