శివాజీ తన మైండ్ గేమ్ తో టైటిల్ ఫెవరేట్ అయ్యాడు. చెప్పాలంటే అతనికి పోటీ ఇచ్చే కంటెస్టెంట్ లేకపోయాడు. బిగ్ బాస్ హౌస్లో బ్యాచ్ లు ఏర్పడ్డాయి. దాంతో శివాజీ.. పల్లవి ప్రశాంత్, యావర్ లతో ఒక టీమ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. వీరిద్దరూ శివాజీకి సేవలు చేసేవారు. చివరి వారాల్లో శివాజీకి నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. అదే సమయంలో పల్లవి ప్రశాంత్ రైజ్ అయ్యాడు.
సెలెబ్రిటీ హోదాలో ఉన్న శివాజీ, అమర్ దీప్ లకు షాక్ ఇస్తూ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ గెలవడాన్ని శివాజీ ఆహ్వానించాడు. తన శిష్యుడు గెలిచినందుకు ఆనందం వ్యక్తం చేశాడు. కాగా సీజన్ 8కి గాను శివాజీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాడన్న న్యూస్ కాకరేపుతుంది.