ప్రశాంత్ నీల్ కథ అందించిన 'బఘీర' మూవీ రివ్యూ, రేటింగ్

First Published | Oct 31, 2024, 9:38 PM IST

దీపావళి కానుకగా కొన్ని తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి. కన్నడలో క్రేజీ హీరోగా గుర్తింపు పొందిన శ్రీమురళి, యంగ్ బ్యూటిఫుల్ నటి రుక్మిణి వసంత్ నటించిన లేటెస్ట్ మూవీ బఘీర. సూపర్ హీరో కథగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలయింది.

దీపావళి కానుకగా కొన్ని తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి. కన్నడలో క్రేజీ హీరోగా గుర్తింపు పొందిన శ్రీమురళి, యంగ్ బ్యూటిఫుల్ నటి రుక్మిణి వసంత్ నటించిన లేటెస్ట్ మూవీ బఘీర. సూపర్ హీరో కథగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలయింది. విశేషం ఏంటంటే ఈ చిత్రానికి కథ అందించింది ఎవరో కాదు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ కథ అందించాడంటే తెలుగు ఆడియన్స్ లో కూడా తప్పకుండా ఆసక్తి ఉంటుంది. డిఆర్ సూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రకాష్ రాజ్, రంగయాన రఘు, రామచంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉందొ లేదో సమీక్షలో తెలుసుకుందాం. 

కథ : 

వేదాంత్ ప్రభాకర్ ( శ్రీమురళి) చిన్నప్పటి నుంచి సూపర్ హీరో కావాలని కలలు కంటూ ఉంటాడు. సూపర్ హీరోగా మారి ప్రజలని రక్షించాలని, వాళ్ళకి ఉపయోగపడాలనేది వేదాంత్ కోరిక. కానీ తన తల్లి మాట ప్రకారం పెద్దయ్యాక వేదాంత్ పోలీస్ అధికారి అవుతాడు. వేదాంత్ సిన్సియారిటీ వల్ల మంగుళూరులో క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది. రౌడీలని ఊచకోత కోయడం ప్రారంభిస్తాడు. కానీ ఒక్కసారిగా వేదాంత్ లంచగొండిగా మారుతాడు. 

అదే క్రమంలో విలన్ మానవుల అవయవాలతో పెద్ద బిజినెస్ చేస్తుంటాడు. ఈ క్రమంలో వేదాంత్ కి అనేక రాజకీయ సవాళ్లు ఎదురవుతాయి. ఇంతలో బఘీర పేరుతో సంచలన హత్యలు జరుగుతుంటాయి. అసలు బఘీరకి వేదాంత్ కి సంబంధం ఏంటి ? బఘీర పోలీస్ శాఖకి సంధించిన సవాల్ ఏంటి ? ప్రధాన విలన్ ని వేదాంత్ ఎలా నిలువరించాడు ? లాంటి అంశాలు కథలో కీలకంగా ఉంటాయి. వాటిని సిల్వర్ స్క్రీన్ పై చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ :

ఇది పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించిన కథ కాబట్టి మాస్ అంశాలకు కొదవ లేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ డిఆర్ సూరి తెరకెక్కించినప్పటికీ ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్ సీన్లు కనిపిస్తాయి. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఎలివేషన్స్ ఉంటాయి. డైరెక్టర్ సూరి కథకి తగ్గట్లుగా హీరోని మాస్ గా ప్రజెంట్ చేస్తూ కొన్ని పవర్ ఫుల్ మూమెంట్స్ అందించారు. అయితే కొన్ని చోట్ల మాస్ మితిమీరి ఊచకోతగా మారింది. ఇలాంటి ఊచకోత సన్నివేశాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చవు. 

కథ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే పాయింట్ తో, ఒకే ఎజెండాతో సీరియస్ గా వెళుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని సీన్లు బాగా బోరింగ్ అవుతాయి. కనీసం హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ నడపడానికి కూడా డైరెక్టర్ ఆసక్తి కనబరిచినట్లు లేదు. మాస్ అంశాలని హైలైట్ చేస్తూ, సూపర్ హీరో పాయింట్ ని తీసుకువచ్చారు. ఇది తప్ప కథలో వేరియేషన్స్ ఏమి కనిపించవు. టిస్టులు కూడా తక్కువే. కాబట్టి సినిమా మొత్తం రెప్ప వాల్చకుండా చూడడం కష్టమే. 

కానీ పర్టికులర్ గా మాస్ చిత్రాలని కోరుకునే వారికీ ఈ మూవీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక శ్రీమురళి నటన, యాటిట్యూడ్ అమేజింగ్ అని చెప్పొచ్చు. అతడి స్క్రీన్ ప్రజెన్స్ ఈ చిత్రానికి బిగ్ ప్లస్. శ్రీమురళి యాక్షన్ సన్నివేశాల్లో అతడి ప్రదర్సన వన్ మాన్ షో అన్నట్లుగా ఉంటుంది. శ్రీమురళి ఎలాంటి యాక్షన్ స్టంట్స్ చేసినప్పటికీ, ఊచకోత కోసినట్లుగా విజృంభించినప్పటికీ అతడి పర్సనాలిటీ, బాడీలాంగ్వేజ్ నమ్మేలా చేసేశాయి. 

ఇక కథలో ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. హీరోయిన్ రుక్మిణి వసంత్ మరోసారి తన నటనతో సర్ప్రైజ్ చేసింది. తనకి ఇచ్చిన పాత్ర మేరకు అద్భుతంగా నటించింది. హీరోకి తగ్గ విలన్ గా రామచంద్ర రాజు అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన వణుకు పుట్టించేలా ఉంటుంది. ఇలాంటి విలన్ కి అలాంటి హీరోనే ఎదురు నిలబడాలి అని ప్రేక్షకులు కోరుకునేలా ఉంటుంది. ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే తన మార్క్ ప్రదర్శించారు. కొన్ని సన్నివేశాల్లో హీరో ఎలివేషన్స్, కథని నడిపించిన విధానం ఓల్డ్ స్కూల్ అన్నట్లుగా ఉంటుంది. కథలో కొన్ని మాస్ ఎలిమెంట్స్, శ్రీమురళి నటన తప్ప కొత్తదనం లేదు. 

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

ముందుగా చెప్పినట్లుగా ఈ చిత్రానికి హీరో శ్రీమురళి నటనే ప్రాణం పోసింది. ఈ కథకి అతడే పర్ఫెక్ట్ అనేలా ఉంటుంది. కథ రొటీన్ అయిపోయినప్పటికీ మైండ్ ట్విస్ట్ తో పాటు సినిమా భారం మొత్తం శ్రీమురళి మోశాడు. హీరోయిజం చూపిస్తూనే ఎమోషనల్ గా నటించే అవకాశం శ్రీమురళికి దక్కింది. రుక్మిణి వసంత్ తనకి ఏ పాత్ర ఇచ్చినా బెస్ట్ ఇస్తానని మరోసారి ప్రూవ్ చేసుకుంది. సూపర్ హీరో కథకి విలన్ పాత్ర ఎలా ఉండాలో రామచంద్ర రాజు(గరుడ రామ్) అలా కనిపించారు. 

టెక్నికల్ గా : 

హోంబాలే సంస్థ నిర్మాణ విలువలు పాటించడంలో తమకి తామే సాటి అని మరోసారి నిరూపించుకుంది. నిర్మాత విజయ్ కిరగందూర్ సూపర్ హీరో చిత్రం ఎలా ఉండాలో అంత ఖర్చు పెట్టారు. ఎక్కడా రాజీ పడినట్లు అనిపించలేదు. మ్యూజిక్ డైరెక్టర్ అంజనీష్ లోక్ నాథ్ విషయానికి వస్తే సూపర్ హీరో చిత్రానికి అవసరమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. చాలా సన్నివేశాల్లో అంజనీష్ బిజియం సన్నివేశాలని ఎలివేట్ చేసింది. ఒకటి రెండు సాంగ్స్ కూడా బావున్నాయి. ఎడిటింగ్ చాలా బాగా కుదిరింది. తెలుగు డబ్బింగ్ ని కూడా ప్రశంసించవచ్చు. 

ఇక డైరెక్టర్ డిఆర్ సూరి విషయానికి వస్తే స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని మైనస్ లు ఉన్నాయి. కానీ ఉన్న కథకి ఓవరాల్ కి మంచి అవుట్ పుట్ తీసుకువచ్చారు. తాను ఎంత పెద్ద కథని అయినా హ్యాండిల్ చేయగలను అని నిరూపించుకున్నారు. 

ఓవరాల్ గా :

రొటీన్ కథలో మాస్ ఎలిమెంట్స్ మెప్పించాయి. సినిమా చూడాలనుకునేవారు వీలైనంత తక్కువ అంచనాలతో వెళ్ళాలి. 

రేటింగ్ : 2.75/5

నటీనటులు: శ్రీ మురళి, రుక్మిణి వసంత్, రామచంద్ర రాజు, ప్రకాశ్ రాజ్, రంగయాన రఘు, అచ్యుత్ కుమార్ తదితరులు. 

Latest Videos

click me!