హౌస్ లోపల అలాంటివి జరుగుతాయి, అందుకే ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కి వెళ్ళను..విష్ణుప్రియ సంచలనం

First Published | Sep 2, 2024, 10:08 AM IST

యాంకర్ గా రాణించిన విష్ణుప్రియ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. గ్లామర్ పరంగా కూడా విష్ణుప్రియకి ఫ్యాన్స్ ఉన్నారు. గతంలో చాలా సార్లు విష్ణుప్రియకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

Vishnu priya bigg Boss8

అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆదివారం రోజు గ్రాండ్ గా ప్రారంభం అయింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. యాష్మి గౌడ, నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ, ఆదిత్య ఓం , సోనియా ఆకుల, మధు నెక్కంటి అలియాస్ బేబక్క, శేఖర్ భాషా , కిరాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, విష్ణుప్రియ, నైనికా అనసూరు, నబీల్ అఫ్రిది ఇలా మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. 

Vishnu Priya Bhimeneni

వీరిలో విష్ణుప్రియ, హీరో ఆదిత్య ఓం, కమెడియన్ అభయ్, కిర్రాక్ సీత కాస్త ఆడియన్స్ కి తెలిసిన సెలెబ్రిటీలు అని చెప్పొచ్చు. ఊహించని విధంగా ఈసారి విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది. యాంకర్ గా రాణించిన విష్ణుప్రియ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. గ్లామర్ పరంగా కూడా విష్ణుప్రియకి ఫ్యాన్స్ ఉన్నారు. 


గతంలో చాలా సార్లు విష్ణుప్రియకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ బిగ్ బాస్ 8 ఆమె ఎంట్రీ ఇచ్చింది. గతంలో బిగ్ బాస్ షో గురించి విష్ణుప్రియ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె కామెంట్స్ ని వైరల్ చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

ఇంతకీ విష్ణుప్రియ ఏం చెప్పిందంటే.. గతంలో ఆమె మీడియాతో మాట్లాడుతున్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ గురించి ప్రశ్నించారు. దీనికి విష్ణుప్రియ సమాధానం ఇస్తూ..బిగ్ బాస్ వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్లను. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం జీవితంలో జరగదు. ఎందుకంటే బయట ఇంత అందమైన ప్రపంచాన్ని పెట్టుకుని, ఫ్యామిలీని పెట్టుకుని ఎందుకు ఇరుకైన ప్రదేశంలో ఉండాలి. 

నేను బిగ్ బాస్ లాంటి షాలిని ఎంకరేజ్ చేయను. నేను బిగ్ బాస్ పర్సన్ ని కాదు. ఎందుకంటే హౌస్ లోపల చాలా జరుగుతాయి. ఒకరినొకరు కొట్టుకోవడం, ఎలిమినేట్ చేయడం నాకు నచ్చదు. ఒక పర్సన్ ని ఎలిమినేట్ చేయడం ఏంటి ?వీలైతే ప్రేమించాలి కానీ అంటూ విష్ణుప్రియ తెలిపింది. ఇలాంటివి ఉంటాయి కాబట్టే నేను బిగ్ బాస్ షోకి వెళ్లను. ఇది మీరు రాసి పెట్టుకోవచ్చు. ఒక వేళ వెళితే మీరు నన్ను బ్లేమ్ చేయొచ్చు అని విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

ఆమె కామెంట్స్ ని నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇస్తే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళావు అంటూ ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే ఆల్రెడీ విష్ణుప్రియని టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్ అని అంచనా వేస్తున్నారు. 

Latest Videos

click me!