రాంగోపాల్ వర్మ చిత్రాల్లో నటించడానికి కొంత మంది నటీమణులు ఆలోచిస్తారు. ఎందుకంటే ఆయన చిత్రాలు బోల్డ్ గా ఉంటాయి. సోనియాకి ఈ చిత్రంలో అవకాశం వచ్చినప్పుడు.. ఏంటి ఆర్జీవీ ఇలా ఫ్యామిలీ తరహా చిత్రం చేస్తున్నారా అని ఆశ్చర్యపోయిందట. ఆ తర్వాత కలవడానికి ఒక ఇంట్లోకి రమ్మని పిలిచారు. ఏంటి ఇంట్లోకి రమ్మంటున్నారు.. మోసం చేయడానికా, అసభ్యంగా ప్రవర్తించడానికా అనే డౌట్ తనకి మొదలైనట్లు సోనియా తెలిపింది.