వార్త నిజమైతే, హరీష్ శంకర్ కు పెద్ద దెబ్బే

First Published | Sep 2, 2024, 12:37 AM IST

‘మనం సినిమా చేస్తే ‘ఫ్యాన్ 5 లో తిరగాలి కానీ 2 లో తిరగకూడదు’ అని రామ్ ఓ సందర్భంలో హరీష్ తో చెప్పాడట.  

సక్సెస్ అయితేనే సినిమా ఫీల్డ్ లో గౌరవం, విలువ అన్నీ..టాలెంట్ తర్వాతే. ఇక్కడ సక్సెస్ తోనే అన్ని కొలుస్తారు. అప్పటిదాకా హిట్ లలో ఉన్నవారికి ఒక్క ప్లాఫ్ వస్తే చాలు వాళ్లను ఏకి పారేస్తూంటారు. అప్పటిదాకా పొగిడిన నోళ్లే ..అబ్బే అంత లేదు అని ప్రక్కన పెట్టేస్తూంటారు క్షణాల్లో. ఇప్పుడు అలాంటి పరిస్దితే టాలెంటెడ్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ కు ఎదురు అవుతోందని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది.  
 


మొన్న  ఆగస్టు 15న హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయింది. ఎంతో హైప్ తో రవితేజ హీరోగా వచ్చిన ఈ చిత్రం మార్నింగే షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది . తర్వాత కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యి కమర్షియల్  గా డిజాస్టర్ గా నమోదు అయ్యింది.  దానికి తోడు హరీష్ శంకర్  దర్శకత్వం పట్ల ప్రేక్షకులు పెదవివిరిచారు. పాత కాలం నాటి దర్శకత్వ ప్రతిభను హరీష్ శంకర్ కనబరిచాడని, ఈ సినిమా ఫెయిల్యూర్ క హరీష్ కారణమని ట్రోల్ చేయటం మొదలెట్టేసారు . దీంతో ఈ దర్శకుడి నెక్ట్స్ సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి. 
 



‘మిస్టర్ బచ్చన్’  (Mr Bachchan) సినిమా  ప్రమోషన్స్ లో తన నెక్స్ట్ సినిమా రామ్ తో (Ram)  ఉంటుందని.. ‘అరుణాచల క్రియేషన్స్’ బ్యానర్ పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తారని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపాడు. కాబట్టి.. ఆగస్టు 15నే విడుదల కాబోతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)  కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు హరీష్ శంకర్ తెలిపాడు.
 
 


తన నెక్ట్స్ సినిమా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో చేస్తున్నానని ప్రకటించాడు. కానీ దురదృష్టవశాత్తు ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా ప్లాప్ అయ్యింది. కాబట్టి.. హరీష్ శంకర్- రామ్..ల సినిమా ఆగిపోయింది అనే వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ దీనిపై హరీష్ కానీ, రామ్ కానీ, నిర్మాత కానీ.. స్పందించి క్లారిటీ ఇచ్చింది లేదు.  అసలే భారీ డిజాస్టర్ ఇచ్చిన హరీష్ తో చేసేందుకు ఫ్లాఫ్ ల్లో ఉన్న రామ్ రెడీ గా లేదని టాక్ వినిపిస్తుంది. కాబట్టి  వీరిద్దరి కలయికలో సినిమా లేనట్టే అనే ప్రచారం మీడియాలో మొదలైపోయింది. అటు రామ్ ఫ్యాన్స్ కూడా ఈ దర్శకుడితో సినిమా వద్దంటూ సోషల్ మీడియాలో రచ్చ  చేస్తున్నారు. 
 

ఈరోజు జరిగిన ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) రీ-రిలీజ్ ప్రెస్ మీట్లో.. తన నెక్స్ట్ సినిమా గురించి హరీష్ శంకర్ కి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి అతను ”ఉస్తాద్ భగత్ సింగ్’  (Ustaad Bhagat Singh) సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుందని,పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  గారు వరుసగా తన నెక్స్ట్ సినిమాలకి డేట్స్ ఇస్తున్న క్రమంలో.. ‘ఉస్తాద్..’ కి కూడా డేట్స్ ఇస్తారని ఎదురుచూస్తున్నట్టు’ హరీష్ శంకర్ తెలిపాడు. కానీ రామ్ సినిమా గురించి అతను స్పందించింది లేదు. కాబట్టి .. హరీష్ – రామ్..ల సినిమా ఆగిపోయి ఉండొచ్చు అని అంతా అభిప్రాయపడుతున్నారు. 
 

‘గబ్బర్ సింగ్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు హరీశ్ శంకర్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను తెరకెక్కిస్తున్నారు. 16 ఏండ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ సెట్ అవడంతో అభిమానులు  ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోసారి పవన్ మాసీజానికి థియేటర్లు దద్దరిల్లి పోనున్నాయి. 
 

Latest Videos

click me!