చివరి నిమిషంలో ఛాన్స్ కొట్టేసిన వరంగల్ కుర్రాడు... అతడు డ్రాప్ కావడంతో హౌస్లోకి, ఇంతకీ ఎవరీ నబీల్!

First Published | Sep 2, 2024, 12:17 AM IST

బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. చివరి నిమిషంలో వరంగల్ కుర్రాడు నబీల్ ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇంతకీ ఎవరీ నబీల్ ఆ వివరాలు తెలుసుకుందాం.. 
 

BIGG BOSS TELUGU 8


బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయ్యింది. హౌస్లోకి 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. సీరియల్ నటి యాష్మి గౌడ, నటుడు అభయ్ నవీన్, నిఖిల్, ప్రేరణ, నటుడు ఓం ఆదిత్య, సోషల్ మీడియా స్టార్ బేబక్క ఎంట్రీ ఇచ్చారు. 

BIGG BOSS TELUGU 8

వీరితో పాటు కిరాక్ సీత, నటుడు నాగమణికంఠ, ఆదిత్య ఓం, నటుడు అభయ్ నవీన్, యాంకర్ విష్ణుప్రియ, యాష్మి గౌడ, ప్రేరణ, సీరియల్ హీరో నిఖిల్,ప్రేరణ, కిరాక్ సీత, బెజవాడ బేబక్క, నటి సోనియా ఆకుల, సీరియల్ యాక్టర్ పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. 


BIGG BOSS TELUGU 8

వీరితో పాటు ఒక యూట్యూబర్ ఛాన్స్ కొట్టేశాడు. అతని పేరు నబీల్ అఫ్రిది. వరంగల్ కి చెందిన ఈ కుర్రాడు లాస్ట్ మినిట్ లో ఛాన్స్ పట్టేశాడట. ఓ కంటెస్టెంట్ లాస్ట్ మినిట్ లో తప్పుకోవడంతో నబీల్ కి అవకాశం దక్కిందట. 

BIGG BOSS TELUGU 8

ఇంతకీ ఎవరీ నబీల్ ఎవరు అంటే.. అతడు యూట్యూబర్. నబీల్ యూట్యూబ్ ఛానల్ ని ఏకంగా 1.62 మిలియన్ ఫాలో అవుతున్నారు. ఇతడు సోషల్ అవేర్నెస్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. నబీల్ ని కొందరు నెటిజెన్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతారు. 

BIGG BOSS TELUGU 8

కాగా బిగ్ బాస్ సీజన్ 8లో 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. దీన్ని బట్టి బిగ్ బాస్ మినీ లాంచ్ ఈవెంట్ ఉంటుందని అర్థం అవుతుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరికొందరు ఆడియన్స్ ఎంట్రీ ఇవ్వనున్నారు.   
బిగ్ బాస్ తెలుగు, బిగ్ బాస్,  నాగార్జున,  బిగ్ బాస్ తెలుగు సీజన్ 8, బిగ్ బాస్ తెలుగు 8, 

Latest Videos

click me!