రాజ్‌ తరుణ్‌ గుట్టు రట్టు, ఆమెతో ఎఫైర్‌ ? సంచలన నిజాలు బయటపెట్టిన లావణ్య

First Published | Sep 7, 2024, 12:12 AM IST

హీరో రాజ్‌ తరుణ్‌ అడ్డంగా దొరికిపోయాడు. ముంబయిలో ఓ హోటల్‌లో హీరోయిన్‌తో ఉండగా అడ్డంగా దొరికిపోయాడు. ఇదే ఇప్పుడు సోషల్‌ మీడియాని ఊపేస్తున్న విషయం. 
 

Raj Tarun

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన వివాదం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. రాజ్‌ తరుణ్‌ తనని మోసం చేస్తున్నాడని, హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉంటూ తనని దూరం పెడుతున్నారని లావణ్య గత కొన్ని రోజులు క్రితం రచ్చ చేసిన విషయం తెలిసిందే. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.

వీరికి సంబంధించిన కేసు కోర్ట్ లో ఉంది. అయితే లేటెస్ట్ గా పోలీసులు రాజ్‌ తరుణ్‌ పై ఛార్జి షీటు దాఖలు చేశారట. ఇందులో రాజ్‌ తరుణ్‌ని నిందితుడిగా పేరు నమోదు చేయడం గమనార్హం. అంతేకాదు లావణ్య పెట్టిన కేసులో ఆధారాలు ఉన్నాయని, అందులో భాగంగానే రాజ్‌ తరుణ్‌పై ఛార్జీషీటు దాఖలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 స్పెషల్స్

Raj Tarun and Lavanya

ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మరో షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. రాజ్‌ తరుణ్‌ అమ్మాయితో అడ్డంగా దొరికిపోయాడు. అది ఇక్కడ కాదు, ఏకంగా ముంబయిలో హీరోయిన్‌ మాల్వి మల్హోత్రాతో హోటల్‌లో దొరికిపోవడం గమనార్హం. లావణ్యనే స్వయంగా రాజ్‌ తరుణ్‌ గుట్టుని రట్టు చేసింది.

ఆమె చాలా రోజులుగా ఇదే ఆరోపిస్తూ వచ్చింది. హీరోయిన్‌ మాల్వి మల్హోత్రా మోజులో పడి తనని దూరం చేస్తున్నాడని, తనకు రాజ్‌ తరుణ్‌ కావాలని ఆమె వాదిస్తూ వస్తుంది. మీడియా ముఖంగానూ ఈ విషయాన్ని చెప్పింది. తనని కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని కూడా ఆమె వెల్లడించింది.

మాల్వితో రాజ్‌ తరుణ్‌కి ఎఫైర్‌ ఉందని, ఇద్దరు కలిసే ఉంటున్నారని లావణ్య వెల్లడించిన విషయం తెలిసిందే. కొన్ని ఫోటోలు కూడా ఆమె విడుదల చేసింది. 
 


Raj Tarun and Lavanya

అంతేకాదు తనని పెట్టిన ఇబ్బందులకు సంబంధించిన వివరాలను కూడా లావణ్య బయటపెడుతూ వచ్చింది. ఫోటోలు, వీడియోలు రిలీజ్‌ చేసి రాజ్‌ తరుణ్‌ బండారం బయటపెట్టే ప్రయత్నం చేసింది. అయితే ఇటీవల ఈ వివాదం సర్దుమనిగినట్టు కనిపించింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు మరోసారి బయటకు రావడం పెద్ద హాట్‌ టాపిక్ అవుతుంది.

ముంబయిలో ఓ హోటల్‌లో మాల్వి మల్హోత్రా ఉన్నట్టు తెలుసుకున్న లావణ్య.. తన తండ్రితో కలిసి ముంబయి వెళ్లింది. రాజ్‌ తరుణ్‌ ఉన్న రూమ్‌లోకి వెళ్లారు. డోర్‌ ఓపెన్‌ చేసి చూడగానే రాజ్‌ తరుణ్‌తోపాటు మాల్వి మల్హోత్రా ఉంది.

ఈ సందర్భంగా వీడియో తీసింది లావణ్య. దాన్నిప్పుడు సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, వైరల్‌ అవుతుంది. ఇందులో రాజ్‌ తరుణ్‌ కనిపిస్తున్నాడు. ఆయన కాసేపు ఉండి రూమ్‌లోకి వెళ్లిపోయాడు. మాల్వి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ కనిపించింది. 
 

ఇందులో లావణ్య ఫైర్‌ అవుతూ కనిపించింది. ఆమె నాన్న కూడా రాజ్‌ తరుణ్‌పై మండి పడుతున్నాడు. బూతులు తిడుతున్నారు. తాము పదేళ్లు పెళ్లి చేసుకుని కాపురం చేశామని, నా మనిషి(రాజ్‌ తరుణ్‌)ని పంపించమని అడుగుతుంది లావణ్య. మీరు చేస్తున్నది వ్యభిచారం అని, వేశ్యలు అని, ఉంపుడు గత్తెలంటూ రెచ్చిపోయింది లావణ్య.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తుంది. ఇప్పటికే రాజ్‌ తరుణ్‌ ఈ కేసులో ముందస్తు బెయిల్‌ పై ఉన్నాడు. ఇప్పుడు ఇలా రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో, ముంబయిలో హీరోయిన్‌తో ఆయన ఒకే రూమ్‌లో ఉండటంతో అసలు గుట్టు రట్టు అయ్యింది. ఇదిలా ఉంటే ఈ రోజు మార్నింగ్‌ లావణ్య మాట్లాడుతూ, రాజ్‌ తరుణ్‌ కోసం తమ పేరెంట్స్ 70లక్షల మనీ ఇచ్చారని, పెళ్లి కోసం కొన్న ఫ్లాట్స్ అమ్మి రాజ్‌ తరుణ్‌కి ఇచ్చారని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది లావణ్య.

ఇప్పుడు ఏకంగా రాజ్‌ తరుణ్‌ హీరోయిన్‌తో హోటల్‌లో ఉంటూ దొరికిపోవడం సంచలనంగా మారింది. మొత్తంగా రాజ్‌ తరుణ్‌ ఈ వివాదం ఇండస్ట్రీలో పెంట పెంటగా మారింది. రాజ్‌ తరుణ్‌ చేసిన పని ఇండస్ట్రీపై నెగటివ్‌ అభిప్రాయానికి కారణమవుతుంది క్రిటిక్స్ అంటున్నారు. 
 

షార్ట్ ఫిల్మ్స్ తో నటుడిగా మారాడు రాజ్‌ తరుణ్‌. దాదాపు 50కిపైగా షార్ట్ ఫిల్మ్స్ లో కలిసి నటించి మెప్పించాడు. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన `ఉయ్యాల జంపాల` చిత్రంతో హీరో అయ్యాడు రాజ్‌ తరుణ్‌. తొలి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. `సినిమా చూపిస్తా మావ` చిత్రంతో మరో హిట్‌ అందుకున్నాడు.

`కుమారి 21 ఎఫ్‌`తో బ్రేక్‌ అందుకున్నారు. ఇది సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రాజ్‌ తరుణ్‌ కెరీర్‌ జెట్‌ స్పీడ్‌తో సాగింది. ఈ క్రమంలోనే రాజ్‌ తరుణ్‌ ఈ ఎఫైర్లు పెట్టుకున్నట్టు తెలుస్తుంది.  లావణ్యతో ఆయన సహజీవనం చేసినట్టు సమాచారం. పెళ్లి చేసుకున్నామని లావణ్య చెబుతుంది.

12ఏళ్లు కలిసే ఉన్నామని ఆమె చెబుతుంది. తనకు రాజ్‌ తరుణ్‌ కావాలని, ఆయన్ని కేసుల్లో ఇరికించడం తన ఉద్దేశ్యం కాదని ఆమె చెబుతుంది. మరి ఇప్పుడు ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. 

రాజ్‌ తరుణ్‌ ఇప్పటికే ఈఏడాది మూడు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. సంక్రాంతికి నాగార్జున హీరోగా రూపొందిన `నా సామి రంగ` చిత్రంలో ముఖ్య పాత్రలో నటించాడు. దీంతోపాటు ఆయన సోలో హీరోగా నటించిన `పురుషోత్తముడు`, `తిరగబడరా సామి` చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ రెండూ ఆడలేదు. ఇప్పుడు `భలే ఉన్నాడే` చిత్రం రిలీజ్‌కి ఉంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి ఆయన చుట్టూ వివాదం రాజుకోవడం గమనార్హం. అన్నట్టు రాజ్‌ తరుణ్‌, మాల్వి మల్హోత్రా కలిసి ఇటీవల వచ్చిన `తిరుగబడరా సామి` చిత్రంలో నటించారు. ఇది డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ షూటింగ్‌ సమయం నుంచి ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారని, కలిసి ఉంటున్నారని తెలుస్తుంది. లావణ్య కూడా అదే ఆరోపిస్తుంది. 
 

Latest Videos

click me!