రామ్ పోతినేని.. చాక్లెట్ బాయ్ అన్నా పేరుతో తెచ్చుకున్న హీరో.. మంచి మంచి సినిమాలు చేసిని ఈ స్టార్.. ఆతరువాత మాస్ ఇమేజ్ వెంట పరుగులు తీశాడు. చాలా ప్రయత్నం చేశాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ఇమేజ్ వచ్చినా దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో రాంగ్ స్టెప్స్ వేశాడనే చెప్పాలి.
ఎంత పెద్ద హీరో అయినా.. ఫిల్మ్ ఇండసస్ట్రీ ఒక మాయ చేస్తుందని చెప్పాలి. ఉన్నట్టుండి మార్కెట్ పెరుగుతుంది... కెరీర్‌ను పైకి తెస్తాయని నమ్మి అదే ఫార్ములా చేస్తూ.. వెంటనే ముంచేస్తుంది. ఇదే పరిస్థితి మాస్ సినిమాలకు వచ్చింది. అది కూడా రామ్ లాంటి హీరోకు ఈ మాస్ ఇమేజ్ అనేది అతికిండం తప్ప.. అడాప్ట్ అవ్వడం లేదు.
అందుకే ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ చేసిన వరుస మాస్ సినిమాలు ప్లాప్ లుగా నిలుస్తూ వచ్చాయి. రామ్ సాలిడ్ హిట్ చూసి చాలా కాలం అయ్యింది. ఇక మాస్ వర్కౌట్ కాదు అనుకున్నాడో ఏంటో.. రామ్ కొత్త ఫార్ములాను తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.
గతంలో తగిలిన దెబ్బలకు చిరాకు వచ్చినట్టుంది.. మాస్ సినిమాల వైపు చూడాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు రామ్ పోతినేని.ఇక మాస్ అనేసరికి ఎంతసేపు కొట్టడం తన్నడం, చంపుకోవడం.. హీరోల ఎనర్జీ అంతా విలన్స్‌ను కొట్టడానికే సరిపోతుంది.
ఆడియన్స్ కూడా అవి బోర్ అనిపిస్తున్నాయి. దాంతో రామ్ తన పంథ మార్చుకోాలి అని చూస్తున్నాడట. గతంలో చాక్లెట్ బాయ్ గా క్లాస్ సినిమాలు చేసిన రామ్.. ఈసారి కాస్త డిఫరెంట్ గా సినిమాులు చేయబోతున్నట్టు తెలుస్తోంది.
అందుకే కత్తులు, కటార్లు కాకుండా.. ఇకపై పూలు, అమ్మాయిల వైపు చూస్తానంటున్నారు ఈ హీరో. రామ్‌ను మరీ ఇలా మాస్‌గా చూడ్డం కంటే.. కాస్త క్లాస్‌గా చూడ్డానికే ఇష్టపడుతుంటారు అభిమానులు. ఆయన కెరీర్‌కు పునాది వేసిన దేవదాస్, రెడీ, నేను శైలజ అన్నీ క్లాస్ సినిమాలే.
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా.. రీసెంట్ గా వచ్చిన డబుల్ ఇస్మార్డ్ మాత్రం దారుణంగా నిరాశపరిచియంది. దాంతో.. మాస్ ఫార్ములాకు మంగళంపాడేసి.. సరికొత్త కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చూస్తున్నారట. అందులో భాగంగానే ప్రస్తుతం కథలు వింటున్నాడట రామ్.
తాజాగా రామ్ ఒక సినిమాకు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. అనుష్క, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ దర్శకత్వంలో రామ్ సినిమా చేయబోతున్నట్టు టాక్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ ఫ్యామిలీ సబ్జెక్ట్‌కు ఓకే చెప్పారట రామ్.
చాలా ఏళ్ళ తర్వాత ఇందులో ప్రేమ పాఠాలు చెప్పబోతున్నారు ఈ హీరో. హరీష్ శంకర్‌తోనూ ఓ ప్రాజెక్ట్ ఉందంటున్నా.. మిస్టర్ బచ్చన్ రిజల్ట్ తర్వాత డైలమాలో పడింది. ఏదేమైనా కొన్నాళ్లు మాస్ కథలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారు రామ్.