తెలుగు బిగ్ బాస్ సీజన్ సీజన్ కు మరీ బోరింగ్ గా తయారవుతుంది. కింగ్ నాగార్జున హోస్టింగ్ కూడా రాను రాను చప్పగా తయారయ్యింది. అంతే కాదు సీజన్ సీజన్ కు టీఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోతూ వస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన 5 సీజన్ల టీఆర్పీ పెద్ద ఆశాజనకంగా లేదు. ఇక ఇప్పుడు జరుగుతున్న సీజన్ 6 రేటింగ్ అయితే మరీ దారుణంగా పడిపోయాయటతుంది.
ఈ ఆరు సీజన్లలో పరమచెత్త టిఆర్పి రేటింగ్ సంపాదించుకున్న సీజన్ గా బిగ్ బాస్ 6 రికార్డ్ సాందించేసింది. ఇక ఈ సిజన్ పై కూడా ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. ఇక ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ తో పాటు నాగార్జున కూడా టిఆర్పిని ఎలాగైనా పెంచాలని చూస్తున్నారు. అందుకే హౌస్ మెట్స్ మధ్య ఎంత వీలైతే అంత గొడవలు పెడుతూ.. రెచ్చగొడుతున్నారు.
కాని ఈసారి ఎందుకో.. నాగార్జున ఏం చేసినా..? ఎంతగా ప్రయత్నించినా.. ? కంటెస్టెంట్స్ మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు. అందుకే మరో ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నారట టీమ్. ఈ క్రమంలోనే వారికి ఉన్న ఒక్కొక్క ఒక్క ఆయుధం బయటకు తీస్తున్నారు బిగ్ బాస్ టీమ్.
ఈక్రమంలోనే అతి ముఖ్యమైన వైల్డ్ కార్డ్ ను ప్రయోగించబోతున్నారట టీమ్. ఫేమస్.. బుల్లితెర స్టార్స్ ను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారట టీమ్ ఈ విధంగా .. షోలో మరింత రచ్చ క్రియేట్ చేయాలని ప్లాన్ వేశారట. దాంతో టీఆర్పీ ఓ రేంజ్ లో ఎక్కుతుందని ప్లాన్ చేస్తున్నారట.
ఇక ఈ క్రమంలోనే ఐదో వారం చివర్లో నాగార్జున స్వయంగా బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ మెంబర్ ను పంపించబోతున్నట్టు సమాచారం. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లోకి వైల్డ్ కార్డుతో ఎంటర్ అవ్వబోతుంది ఎవరో కాదు జబర్దస్త్ స్టార్ కమెడియన్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న సుడిగాలి సుధీర్ ను రంగంలోకి దింపబోతున్నారట. దానికోసం అతనికి భారీగా పారితోషికం కూడా ఫిక్స్ చేశారట టీమ్. సుడిగాలి సుధీర్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అవుతున్నారని తెలుస్తుంది .ఒకవేళ ఇదే గనుక నిజమైతే బిగ్ బాస్ లో వార్ వన్ సైడ్ అవుతుంది అంటున్నారు బుల్లి తెర జనాలు.
అంతే కాదు బిగ్ బాస్ లోకి తీసుకోవాలి అని ఆగిపోయిన స్టార్ కంటెస్టెంట్స్ పై కూడా బిగ్ బాస్ మేకర్స్ కన్నేసినట్టు తెలుస్తోంది. అందులో ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను కూడా ఉందట. ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువగా అడగటంతో బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకెలేదని తెలుస్తోంది. ఇక ఇప్పుడు రేటింగ్ పెంచడం కోసం ఆమెను తీసుకోవాలి అని చూస్తున్నార టీమ్. ఉదయభాను ఉంటే బిగ్ బాస్ హౌస్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అని నమ్ముతున్నారు టీమ్.
ఇక ఈ ఇద్దరితో పాటు మరో జబర్థస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆదిని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలి అని చూస్తున్నారట టీమ్. ఆయన చాలా బిజీ స్టార్. బుల్లి తెరపై హైపర్ ఆదీకి మంచి డిమాండ్ ఉంది. ఆయన్ను హౌస్ లోకి తీసుకోవాలి అంటే చాలా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. కాని ఆది హౌస్ లో ఉంటే .. షో ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందనేది అందరికి తెలిసిన నిజం. సో ఇవన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న రూమర్స్. నిజంగా బిగ్ బాస్ ఇలా ఆలోచిస్తుందా..? లేదా అనేది చూడాలి.
ఈ ముగ్గరిలో ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా అంతే కాదు హౌస్ లో టోటల్ గేమ్ స్ట్రాటజీస్ అన్ని మారిపోతాయి . ఇప్పటివరకు జాన్ జిగుడి దోస్తులుగా ఉన్న హౌస్ మేట్స్ ..దీంతో అందరూ మారిపోయే పరిస్తితి ఉంటుంది అంటున్నారు జనాలు. మరి చూడాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో బిగ్ బాస్ పరిస్థితి చక్కబడుతుందా లేదా అనేది.