'గాడ్ ఫాదర్' ఖచ్చితంగా చూడడానికి 5 కారణాలు.. చిరంజీవి ఆ సాహసం చేయడమే హైలైట్, అసలైన రీఎంట్రీ

First Published Oct 5, 2022, 8:16 AM IST

మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ నేడు విజయ దశమి కానుకగా నేడు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బోలెడు అంచనాలు పెట్టుకున్న ఆచార్య నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ నేడు విజయ దశమి కానుకగా నేడు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బోలెడు అంచనాలు పెట్టుకున్న ఆచార్య నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో సోషల్ మీడియాలో మెగా హంగామా మొదలయింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఏ స్టార్ హీరో సినిమా విడుదలైనా ఫ్యాన్స్ కొన్ని అంచనాలు పెట్టుకుని మూవీకి వెళతారు. రీమేక్ అయినప్పటికీ చిరంజీవి కెరీర్ లో గాడ్ ఫాదర్ ఒక ప్రత్యేక చిత్రం అనే చెప్పొచ్చు. గాడ్ ఫాదర్ చిత్రం చూడడానికి 5 బలమైన కారణాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 

కొత్తగా అసలైన మెగాస్టార్ : ఈ చిత్రంలో చిరంజీవి కొత్త లుక్, మ్యానరిజమ్స్ ప్రతి ఒక్కరిని మెప్పిస్తున్నాయి. ఒక రకంగా అభిమానులు చిరంజీవి అసలు సిసలైన రీ ఎంట్రీ ఇదే అని అంటున్నారు. ఖైదీ నెంబర్ 150 రీ ఎంట్రీ మూవీ కావడంతో ఆ క్రేజ్ లో సినిమాలో లోపాలు ఏమీ కనిపించలేదు. ఆ తర్వాత తన ఇమేజ్ పక్కన పెట్టి ఇష్టపడి సైరా మూవీ చేశారు చిరు. ఆ తర్వాత వచ్చిన ఆచార్య పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే. కానీ గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవిని కొత్త లుక్ లో మునుపటి పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ లో చూడొచ్చు. 

జోడి లేకుండా: చిరంజీవి సినిమా అంటే హీరోయిన్ ఉండాలి, డ్యాన్సులు అదిరిపోవాలి.. ఇది ఫ్యాన్స్ లో ఉండే మినిమమ్ అంచనా. హీరోయిన్ లేకుండా సినిమా అంటే చిరంజీవి సాహసం చేసినట్లే. కానీ ఈ చిత్రంలో చిరంజీవి హీరోయిన్ లేకుండానే కథకి కట్టుబడి నటనతో అదరగొట్టారు. సినిమాలో ఎక్కడా హీరోయిన్ గురించి ప్రేక్షకులు ఆలోచించకుండా తన పెర్ఫామెన్స్ తో కట్టిపడేశారు. చిరంజీవిని చూస్తూ మైమరచిపోతారు తప్ప హీరోయిన్ లేదనే భావన ఉండదు. 

ఎమోషనల్ పొలిటికల్ డ్రామా: ఇది ఎమోషనల్ గా సాగే పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. చిరంజీవి ఈ చిత్రంలో ఎమోషనల్ ఫ్యాక్టర్ అని కూడా అద్భుతంగా క్యారీ చేశారు. సత్యదేవ్, చిరంజీవి, నయనతార మధ్య సాగే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. 

కాస్టింగ్ : ఈ చిత్రం కోసం అద్భుతమైన కాస్టింగ్ ఎంపిక చేసిన దర్శకుడు మోహన్ రాజాని అభినందించాలి. తమ నటనతో సినిమాకి ప్రాణం పోసిన నటీనటులే ఉన్నారు. ముఖ్యంగా సత్యదేవ్, నయనతారలని ఈ చిత్రానికి ఎంపిక చేసుకోవడం బిగ్ సక్సెస్ అనే చెప్పాలి. ఎవరో నార్త్ వాళ్ళని విలన్ గా పెట్టకుండా మన తెలుగు నటుడు సత్యదేవ్ ని తీసుకుని మంచి పని చేశారు. అద్భుతమైన అవుట్ పుట్ రాబట్టారు. సత్యదేవ్ విలన్ గా నటించడం వల్ల ఈ చిత్రానికి స్టైలిష్ నెస్ వచ్చింది. 

నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిన్న పాత్రే అయినప్పటికీ నయనతార తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఎమోషనల్ సీన్స్ లో కొన్ని సార్లు కళ్ళతోనే నటించాల్సి ఉంటుంది. అది నయనతారకు వెన్నతో పెట్టిన విద్య. సింపుల్ గా నయన్ కళ్ళతో భావాలు పలికిస్తూ ఈ కథ కోసం తన పని తాను చేసింది. 

డైరెక్టర్ : ఈ చిత్రానికి మోహన్ రాజాని డైరెక్టర్ గా అనుకున్నప్పుడు అనేక కామెంట్స్ వినిపించాయి. రీమేక్ చిత్రానికి తమిళం నుంచి దర్శకుడిని తీసుకురావాలా అని. చిరంజీవి తనని ఎందుకు ఏరికోరి ఎంచుకున్నారో మోహన్ రాజా తన దర్శకత్వంతో చూపించాడు. మెయిన్ స్టోరీని చెడగొట్టకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మోహన్ రాజా కథలో చేసిన మార్పులు బాగా వర్కౌట్ అయ్యాయి. మోహన్ రాజా దర్శకత్వంతోనే ఇది లూసిఫెర్ రీమేక్ అని మరచిపోయి ఒక తెలుగు సినిమాగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. 

మోహన్ రాజా దర్శకుడిగా కెరీర్ ప్రారంభించింది తెలుగు మూవీతోనే. 2001లో హనుమాన్ జంక్షన్ చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టారు. అది రీమేక్ మూవీ. ఆ తర్వాత చాలా చిత్రాలు చేశారు. తనిఒరువన్ చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. చివరగా తమన్ సంగీతం గురించి మరచిపోకూడదు. ప్రతి సన్నివేశం స్థాయిని పెంచేలా బిజియంతో తమన్ అదరగొట్టేసాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. 

click me!