Guppedantha Manasu: వసుధారతో కాకుండా మరొకరితో రిషికి పెళ్లి.. మహేంద్రను బలవంతం చేస్తున్న దేవయాని!

First Published Oct 5, 2022, 9:29 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 5వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 


ఈరోజు ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..వసు,రిషి క్యాబిన్లోకి వెళ్లి కూర్చుంటుంది. రిషి అప్పుడు వసు ని బయటనుంచి వీడియో తీస్తాడు. అప్పుడు వసు రిషి క్యాబ్లో కూర్చొని,రిషి లా మాట్లాడుతూ, ఏ బాయ్ వెళ్లి వసుధారని తీసుకురా క్లాసు ఇవ్వాలి అని అంటుంది. అప్పుడు లేచి, సర్ చాక్లెట్ కావాలా?చాక్లెట్ తిందాము సార్ తీసుకోండి. అయినా ఈ ప్రేమున్నది కదా సార్ చాలా పిచ్చిది. ఒకరినొకరు మర్చిపోనివ్వకుండా చేస్తుంది అని కుర్చీతో మాట్లాడుతూ ఉంటుంది.దీన్ని అంతా రిషి వీడియో తీస్తూ ఉంటాడు.అప్పుడు వసు వెళ్ళి హార్ట్ సింబల్ ఉన్న కార్డ్ బోర్డ్ ముక్కకు ముద్దు పెట్టుకుంటుంది. అదే సమయంలో రిషికి ఫోన్ వస్తుంది.ఉలిక్కిపడి, వసుధార దాన్ని జర్చేసే లోగా, జాగ్రత్తగా పట్టుకో అని రిషి అంటాడు. అప్పుడు వసు పట్టుకుంటుంది.

ఇంతలో నేను తర్వాత ఫోన్ చేస్తాను అని రిషి ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు అని రిషి అనగా, ఏం లేదు సార్ అని పారిపోతుంది వసు.అప్పుడు రిషి ఆ చాక్లెట్ ని తీసుకొని చాక్లెట్ తినడం కూడా ఒక ఆర్ట్ అని అనుకుంటాడు.ఆ తర్వాత సీన్లో మహేంద్ర బాధపడుతూ ఉంటాడు.ఎందుకు బాధపడుతున్నావు అని జగతి అనగా,రిషి చెప్పిన మాట గురించి జగతికి చెబుదామా, లేదు ఇది వింటే తను కూడా బాధపడుతుంది అని అనుకోని, ఏమీ లేదు జగతి నీకు ఒంట్లో బాలేదు కదా ఎలా ఉన్నది అని అడుగుతాడు మహేంద్ర.మాట బానే మారుస్తున్నావు అని జగతి అంటుంది. ఇంతలో రిషి అక్కడికి వచ్చి, మేడం మీరు ఇక్కడున్నారు ఏంటి?మిషన్ ఎడ్యుకేషన్ కోసం వెళ్లలేదా అని అడగగా మహేంద్ర, జగతికి కొంచెం తలనొప్పిగా ఉన్నదట రిషి అందుకే వెళ్ళను అని అన్నాది అని అనగా, మరి వసుధార ఒక్కతే వెళ్లిందా అని అడుగుతాడు రిషి.

అవును కంపెనీ వాళ్ళు టూ వీలర్ ఇచ్చారట దాంతో వెళ్ళింది అని జగతి అంటుంది. అప్పుడు రిషి కోపం వచ్చి అయితే ఆ బండి తనదే అనమాట. నాకు చెప్పి వెళ్లాలి కదా అని వెంటనే కారులో బయలుదేరుతాడు రిషి. మరోవైపు వసు బైక్ డ్రైవింగ్ చేస్తూ వెళుతుంది. ఇంతలో రిషి, వసు కు ఫోన్ చేయగా డ్రైవింగ్ లో ఉన్నాను అని వసు ఫోన్ ఎత్తదు. ఊరు వచ్చేసిన తర్వాత ఫోన్ చూసేసరికి రిషి మిస్డ్ కాల్స్ ఉంటాయి. అమ్మో రిషి సార్ ఎన్ని సార్లు చేశారు అనుకోని తిరిగి చేసేసరికి రిషి వెనకాతలే ఉంటాడు. మీరు ఎందుకు సార్ ఇక్కడికి వచ్చారు అని అనగా, వెళ్లిపోమంటావా అని హనీ అంటుంది.లేదు సార్ రండి అని అనగా, అయినా ఒక్కదానివే బండి మీద ఇక్కడ వరకు వచ్చేసావు వర్షాలు పడుతున్నాయి కదా భయంలేదా అని రిషి అడుగుతాడు. లేదు సార్ నేను సైకిల్ తొక్కి చాలా సంవత్సరాలు ప్రావీణ్యం పొందాను నాకు ఏ మాత్రం భయం లేదు అని వసు అనగా,ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు అని అంటాడు రిషి .

ఇంతలో కిషోర్ అక్కడికి వస్తాడు. కిషోర్ అన్న రా వెళ్దాము,దీని గురించి అందరికీ చెప్పావా అని అనగా, అందరూ అక్కడ మీకోసమే ఎదురు చూస్తున్నారమ్మ త్వరగా రండి అని కిషోర్ అంటాడు. అప్పుడు వసు, రిషిలు ఇద్దరూ పొలం మీద నడుస్తూ వెళ్తూ ఉండగా, వసు జారుతుంది, రిషి పట్టుకుంటాడు.అప్పుడు కిషోర్, మా ఊరికి, పల్లెటూరు కి కొత్త కదమ్మా అందుకే అలవాటు లేనట్టు ఉన్నది అని అనగా అప్పుడు వసు మొదలుపెడుతుంది. మాది కూడా పల్లెటూరే కిషోర్ అన్న అనీ, మా ఊర్లో కూడా ఈ చెట్టు ఉన్నది అవి ఉన్నాయి అని కదంతా చెప్తూ వస్తుంది వసుదారం వెనకనుంచి రిషి ఆపేయండి అని కిషోర్ తో సైగకు చేస్తాడు.అప్పుడు కిషోర్, ఏంటి సార్ ఏదో అంటున్నారు అని అనగా ఏం లేదు అని అంటాడు రిషి. ఇంతలో రిషి వాసుదారతో, మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుదాము మీ ఊరు కథలన్నీ భోజనం చేస్తున్నప్పుడు చెప్పు అని అనగా, కిషోర్ అన్నే ఈ ఊరి తరపున మన మిషన్  ఎడ్యుకేషన్ గురించి చూసుకుంటారు అన్నారు సార్ అని వసు అంటుంది.

 ఇది అవసరమైనది కాబట్టి వీలున్న ప్రతిసారి దీని గురించి ఆలోచించండి అని రిషి అంటాడు. ఆ తర్వాత నడుస్తున్నప్పుడు రిషి,వసుతో జాగ్రత్త అని చెప్పి రిషియే పడిపోతాడు. అప్పుడు వసు రిషిని పట్టుకుంటుంది. అప్పుడు నవ్వుకొని అలా వెళ్ళిపోతుంది వసుధార. ఆ తర్వాత సీన్లో మహేంద్ర డల్ గా ఇంట్లో కూర్చుని ఉంటాడు. ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి, ఏమైంది మహీంద్రా, మొఖం మాడినట్టు ఉన్నది. నేను ఇచ్చిన డోస్ సరిపోలేదా అయినా నువ్వు ఎందుకు ఇలా ఉండడం? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నువ్వు వసుధార ని మర్చిపోమని రిషికి చెప్పు, నేను సాక్షిని మర్చిపోతాను.
 

 అప్పుడు ఒక మంచి గొప్పింటి అమ్మాయిని చూసి రిషికి పెళ్లి చేద్దాము అని అనగా, మహేంద్ర,దేవయాని వైపు కోపంగా చూస్తాడు. అప్పుడు దేవయాని, రిషి ఒప్పుకోడని భయపడుతున్నావా అని అనగా, మీరు అడగండి వదినగారు నన్ను ఎందుకు అడుగపించడం అని అనగా, నాకు ఏ సమయంలో ఏం చేయాలో తెలుసు మహేంద్ర ఇన్ని చేసిన దాన్ని ఒక పని చేయలేనా కానీ తండ్రిగా అది నువ్వు అడిగితేనే మర్యాద.రిషిని వేరే సంబందానికి ఒప్పించు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దేవయాని.దారిలో జగతి కనిపించినప్పుడు జగతిని ఆపి దేవయాని, వెళ్ళు జగతి మహేంద్ర ఎందుకో డల్ గా కనిపిస్తున్నాడు.
 

అలాగే ఒక మాట, మహేంద్ర చేత సారీ చెప్పించుకున్న దాన్ని, నేను ఏదైనా చేయగలను అని తెలుసుకుంటే నీకే మంచిదే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దేవయాని. అప్పుడు జగతి, మహింద్ర దగ్గరికి వచ్చి ఏమైంది మహేంద్ర అని అడగగా, విషపు పాము ఏం చేస్తుంది జగతి,ఎప్పుడు ఎవరిని కాటేద్దామనే చూస్తుంది అని మహేంద్ర అంటాడు.ఆ తర్వాత రిషి, వసులు పని అంతా పూర్తి చేసుకుని నడుస్తూ ఒక బల్ల దగ్గరికి వస్తారు. అప్పుడు రిషికి కాళ్ళు నొప్పి పుట్టి అక్కడ కూర్చుంటాడు. ఇంతలో కిషోర్, రండి సార్ మీకు మా పొలం చూపిస్తాను అని అనగా వసు, పదండి అన్న అని అంటుంది.
 

 రిషి మాత్రం, నాకు ఓపిక లేదయ్యా కిషోర్ తర్వాత వస్తాములే ఇప్పుడు బయలుదేరుదాము అని అనగా, అయితే ఆగండి సార్ అని చెప్పి తన పొలంలో ఉన్న మామిడి కాయలు తెస్తాడు కిషోర్. అప్పుడు వసు నాకు చాలా ఇష్టం అని తింటూ ఉంటుంది. నీకు ఏది ఇష్టం లేదు వసుదార,అన్ని తింతవు గా అని ఎటకారిస్తూ అంటాడు రిషి. అప్పుడు కిషోర్, నాకు ఇంకా పొలం పని ఉన్నది సర్ వెళ్లి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు కిషోర్. అప్పుడు రిషి,వసుని పక్కన కూర్చోమంటాడు. ఇంతటి ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!