ఇదిలా ఉంటే ప్రస్తుత సీజన్‌లో హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ల గురించి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈసారి షోలో పాల్గొనబోతున్నది వీళ్లేనంటూ ఓ లిస్ట్ నెట్టింట బాగా చక్కర్లు కొడుతుంది. అందులో ప్రముఖంగా సింగర్ రేవంత్ పేరు ముందు వరుసలో ఉంది. ఇంకా .. చలాకి చంటి, యూట్యూబర్ ఆదిరెడ్డి, హీరో అర్జున్ కళ్యాణ్, కామన్ మ్యాన్ రాజశేఖర్, సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్, దీపిక పిల్లి, వాసంత కృష్ణన్, గీతూ రాయల్, నటి శ్రీసత్య, అభినయ శ్రీ, రోహిత్, మెరీనా అబ్రహాం, యాంకర్ నేహా చౌదరి, ఆర్జే సూర్య, నటుడు బాలా దిత్య, షాన్ని, సింగర్ రేవంత్, నటి సుదీప, యాంకర్ అరోహీ రావ్, సీరియల్ నటి శ్రీ సత్య, కీర్తి, ఇనయా సుల్తానా, జబర్దస్త్ ఫహిమా, ఇస్మార్ట్ అంజలీ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.