ఇలా ఉన్నాడేంట్రా బాబు, జడ్జిలకే వార్నింగ్ ఇచ్చిన హృదయ్ మానవ్, బిందు మాధవి ఏం చేసిందంటే?

Published : Aug 22, 2025, 02:08 AM IST

బిగ్ బాస్ సీజన్ 9 కోసం సామాన్యులను తీసుకోబోతున్నారు. అందుకోసం అగ్నిపరీక్ష అంటూ సెలక్షన్స్ స్టార్ట్ చేశారు టీమ్. ఈ సెలక్షన్స్ లో ఓ వ్యక్తి జడ్జ్ లను తన కోపంతో ఇరిటేట్ చేశాడు. బిందుమాధవి అయితే కోపంతో ఏం చేసిందంటే? 

PREV
15

హాట్ స్టార్ లో మొదలైన హడావిడి

ఇక అగ్ని పరీక్ష’ ఇప్పటికే మొదలైపోయింది. ఈరోజు ఆగస్టు 22 నుంచి జియో హాట్ స్టార్‌లో ఈ కార్యక్రమంలో స్ట్రీమింగ్ అయిపోయింది. అగ్నిపరీక్షన్ పెట్టేందుకు జడ్జ్ లు గా బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అభిజీత్, బిగ్ బాస్ నాన్‌స్టాప్ టైటిల్ విన్నర్ బిందు మాధవితో పాటు బిగ్ బాస్ సీజన్ 1 ఫైనలిస్ట్ నవ్‌దీప్ నిర్వహిస్తుండగా, ఈకార్యక్రమాన్ని బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రన్నర్ శ్రీముఖిహోస్ట్ చేస్తోంది.

25

హాట్ స్టార్ లో మొదలైన హడావిడి

ఇక అగ్ని పరీక్ష’ ఇప్పటికే మొదలైపోయింది. ఈరోజు ఆగస్టు 22 నుంచి జియో హాట్ స్టార్‌లో ఈ కార్యక్రమంలో స్ట్రీమింగ్ అయిపోయింది. అగ్నిపరీక్షన్ పెట్టేందుకు జడ్జ్ లు గా బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అభిజీత్, బిగ్ బాస్ నాన్‌స్టాప్ టైటిల్ విన్నర్ బిందు మాధవితో పాటు బిగ్ బాస్ సీజన్ 1 ఫైనలిస్ట్ నవ్‌దీప్ నిర్వహిస్తుండగా, ఈకార్యక్రమాన్ని బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రన్నర్ శ్రీముఖిహోస్ట్ చేస్తోంది.

35

బిందు మాధవికి కోపం తెప్పించిన కంటెస్టెంట్

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో జడ్జ్ లకు షాక్ ఇస్తున్నారు కంటెస్టెంట్లు. మరీ ముఖ్యంగా రెండో వ కంటెస్టెంట్ అయితే హడలెత్తించాడు. ఇలాంటివారు కూడా ఉంటారా అనే విధంగా మాట్లాడి అందరికి ఆశ్చర్చపరిచాడు. వచ్చీ రావడంతోనే మస్క్ పెట్టుకుని భయంకరంగా వచ్చిన ఆ వ్యక్తి, తన మాటలతో అందరికి కోపం తెప్పించాడు. నా స్కిన్ నేమ్ హరీశ్.. సోల్ నేమ్ హృదయ్ మానవ్’ అని చెప్పడంతో హృదయ్ మానవ్ అంటే ఏంటని బిందు మాధవి అడిగింది. దానికి అతను హృదయం ఉన్న మానవడు’ అని అన్నాడు. దాంతో నవదీప్ అందుకుని మా అందరికీ హృదయాలు లేవనా.. అని అడగ్గా.. మీరు కావాలంటే అలా అర్థం చేసుకోవచ్చు.. సీరియస్ కామెంట్ చేశాడతను.

45

జడ్జిలకు చుక్కలు చూపించిన వ్యక్తి

తాను చాలా కోపిష్టి మనిషిని అని ఒప్పుకున్న హృదయ్ మానవ్ అలియాస్ హరీష్.. కోపం వస్తే ఏం చేస్తారు? అని అడగ్గా. కొట్టేస్తాను అని బదులిచ్చాడు. ఎవరిని కొడతావు భార్యని కొట్టావా అని బిందు మాధవి సీరియస్ గా అడిగారు. అవును అని అతను సమాధానం చెప్పగానే .. బిందు మాధవి కోపం కట్టలు తెంచుకుంది. భార్యను కొట్టే నువ్వు హృదయ్ మానవ్ కాదు, హృదయం లేని మనిషివి అని స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది బిందు మాధవి. ఇక అబిజీత్ తో కూడా అతను వాదనకు దిగాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ప్రెడ్షిప్ కోసం కాదు కదా వెళ్లేది అని అతను అనగా, ఫ్రెండ్‌ ఎందుకు చేసుకోకూడదు అంటూ అభిజీత్ అడిగాడు. దానికి అతను ‘ఫ్రెండ్‌కి ట్రోఫీ ఇచ్చేస్తారా?’ అంటూ రివర్స్ మాట్లాడుతూ వచ్చాడు.

55

మీరెవరు నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి అంటూ వార్నింగ్

ఇక అతని మాటలు యాటిట్యూత్ తట్టుకోలేని బిందు మాదవి. అతనితో మాస్క్ తీయించి, మెడలో లూజర్ అని బోర్డ్ కూడా తగిలించింది. అంతే కాదు అతనికి రెడ్ కార్డ్ కూడా చూపించారు. నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉండటానికి అర్హత లేని వాడివి అంటూ తేల్చేశారు. దాంతో అతను కూడా నాకు అవకాశం ఇవ్వకూడదని అనుకుంటే మంచిదే.. కానీ నా క్యారెక్టర్‌ని డిసైడ్ చేయకండి’ అంటూ స్ట్రాంగ్ గా చెప్పాడు. దాంతో ‘మేం జడ్జిలం కాబట్టే ఇక్కడ కూర్చున్నాం’ అంటూ నవ్‌దీప్ అన్నాడు. ‘కొన్ని నిమిషాల్లోనే నేనేంటో జడ్జ్ చేయగలరంటే మీరు దేవుళ్లు అయ్యుండాలి’ అని అతను సమాధానం ఇవ్వగా.. ‘నేను దేవుణ్ణి కాదు’ అని బిందు మాధవి సీరియస్ గా చెప్పింది. ఇక అందరు రెడ్ కార్డ్ ఇవ్వడంతో అగ్నిపరీక్షలో అతనికి ఎదురు దెబ్బ తగిలింది. సెలక్ట్ కాకుండానే వెనుదిరి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈమధ్యలో అతను చెప్పిన చాలా విషయాలు జడ్జ్ లను ఇరిటేట్ చేశాయి.

Read more Photos on
click me!

Recommended Stories