బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అసలేం జరగబోతోంది.. సత్తా చాటే సామాన్యులు ఎవరు ?

Published : Aug 21, 2025, 11:09 PM IST

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కి ముందు బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరుతో ప్రీ షో ప్రసారం కాబోతోంది. 45 మంది నుంచి 6 సామాన్యులని ఎంపిక చేసే ఉద్దేశంతో ఈ ప్రీ షో నిర్వహిస్తున్నారు. 

PREV
15
బిగ్ బాస్ అగ్నిపరీక్ష

గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ తెలుగు షో ప్రారంభానికి ముందు బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరుతో సరికొత్త ప్రీ షోని తీసుకువచ్చారు. ఈ షో జియో హాట్ స్టార్ లో ఆగష్టు 22 నుంచి ప్రారంభం కాబోతోంది. సామాన్యులు, కొంతమంది ఇన్ఫ్లు యెన్సర్లు బిగ్ బాస్ తెలుగు 9 హౌస్ లో ఎంట్రీ కోసం ప్రీ షోలో పోటీ పడతారు. మొత్తం 45 మంది పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఆరుగురు సభ్యులు మాత్రమే బిగ్ బాస్ తెలుగు 9 షోకి కంటెస్టెంట్స్ గా ఎంపిక అవుతారు.

25
ముగ్గురు న్యాయ నిర్ణేతలు

బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో ఆగష్టు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు ప్రసారం కానుంది. ఈ షోకి శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్నారు. మాజీ బిగ్ బాస్ విన్నర్ అభిజీత్, బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ నటి బిందుమాధవి, నటుడు నవదీప్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. వీరు ముగ్గురే బిగ్ బాస్ 9 హౌస్ లోకి వెళ్లే సామాన్యులని డిసైడ్ చేసేది.

35
వారికి కూడా అవకాశం

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రీ షోని ఫన్నీ గేమ్స్, సీరియస్ టాస్క్ లతో డిజైన్ చేసినట్లు ప్రోమోల ద్వారా అర్థం అవుతోంది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశాన్ని కొందరు దివ్యాంగులకు కూడా కల్పించారు. 45 మంది పెర్ఫార్మెన్స్, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవల్ ని బట్టి అభిజీత్, బిందుమాధవి, నవదీప్ మార్కులు ఇస్తారు. ఇందులో ఎలిమినేషన్స్, ఉత్కంఠని కలిగించే టాస్క్ లు కూడా ఉంటాయి.

45
ఛాన్స్ దక్కించుకునే సామాన్యులు ఎవరు ?

బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ దక్కించుకునే సామాన్యులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే తమ ప్రతిభని బిగ్ బాస్ హౌస్ ద్వారా చాటుకుని సెలెబ్రిటీలుగా మారిపోవచ్చు. అదే విధంగా వృద్ధులకు కూడా అవకాశం కల్పించారు.

55
సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం

45 మందిలో ఆ ఆరుగురిని ఎలా ఫిల్టర్ చేస్తారు అనేది ఆసక్తికరం. ఇక ప్రధాన బిగ్ బాస్ తెలుగు 9 షో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతోంది. ఈ సారి 2 హౌస్ లో ఉండబోతున్నాయి. మునుపెన్నడూ లేని హంగామా, ఎంటర్టైన్మెంట్స్ ఆడియన్స్ కోసం సిద్ధం అవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories