తమిళంలో `జెమిని` సినిమాతో తెరకు పరిచయమైన కిరణ్, ఆ తర్వాత `విలన్` సినిమాలో అజిత్ సరసన నటించారు. అలాగే `అన్బే శివం`, `దివాన్`, `పరశురాం`, `అరసు`, `తెన్నవన్` వంటి సినిమాల్లో నటించారు. పాపులర్ అయ్యింది.
కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడంతో, విజయ్ తిరుమలై సినిమాలోని 'వాడియమ్మా శక్కమ్మా' పాటకు ఐటెం సాంగ్ చేశారు. ఆ తర్వాత న్యూ, జిన్నా, తిమిరు, ఇది కాదల వరం పరువం, వసూల్, రాజాధి రాజా, గురు శిష్యన్, శకుని, ఆంబళ, ముత్తిన కత్తిరిక, ఇళమై ఊంజల్ వంటి సినిమాల్లో నటించారు.
read more: జూ ఎన్టీఆర్ ప్రస్తావన రావద్దు అంటూ బాలయ్య కండీషన్? అన్‌స్టాపబుల్ షో గెస్ట్ లకు ముందే సూచన, ఇంత పగేంటి?
కిరణ్ చివరిగా నటించిన సినిమా `ఇళమై ఊంజల్` ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. బరువు పెరగడంతో హీరోయిన్ అవకాశాలు రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించారు. తమిళంతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ నటించారు.