ఈమధ్య సినిమాల్లో స్సెషల్ సాంగ్స్ లో కనిపించింది ఉదయ భాను. గతంలో లీడర్, జులాయ్ సినిమాల్లో కూడా సాంగ్స్ చేసింది. అయితే యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేయడానికి ముందే ఉదయభాను కొన్నిసినిమాల్లో నటించింది.
ఆర్.నారాయణ మూర్తి తెరకెక్కించిన ఎర్ర సైన్యం సినిమాతో ఉదయ భాను కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈమధ్య సినిమాలకోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తున్న ఉదయ భాను.. రీసెంట్ గా వచ్చిన ప్రతినిథి 2 లో ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. కాని ఈసినిమా ప్లాప్ అయ్యింది.