రణ్‌వీర్ సింగ్, దీపికాపదుకొనే, రీల్ లైఫ్ లో..రియల్ లైఫ్ లో కూడా వీరు అద్భుతమైన జంట. ఇక దీపికా పదుకునే మాత్రం ముందుగా రణ్ బీర్ ను ప్రేమించింది. 2008 లో 'బచ్నా ఏ హసీనో' సినిమాలో నటించినప్పుడు డేటింగ్ ప్రారంభించారు. ఆ టైమ్ లోనే దీపికా తన మెడపై రణ్‌బీర్ కపూర్ పేరును పచ్చబొట్టు పొడిపించుకుంది. చాలా సన్నిహితంగా ఉన్న దీపికా, రణ్‌వీర్ అకస్మాత్తుగా విడిపోయారు. రణ్‌బీరు కపూర్ నుండి విడిపోవడం వల్ల దీపికా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఈ విషయం ఆమె స్వయంగా వెల్లడించింది.
రణ్‌వీర్, దీపికా
ఇక 'రాం-లీలా' షూటింగ్ సమయంలో దీపికా రణ్‌వీర్ సింగ్‌ను కలిసింది. ఈ కలయిక స్నేహంగా మారి చివరికి ప్రేమగా వికసించింది. దీని తర్వాత, వారిద్దరూ తమ ప్రేమ జీవితాన్ని ప్రారంభించారు, కొన్ని సంవత్సరాల డేటింగ్ తరువాత వారు 2018 లో వివాహం చేసుకున్నారు. వారి వివాహం ఇటలీలోని లేక్ కోమోలో ఘనంగా జరిగింది. దీపికా, రణ్‌వీర్‌లకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు దువా.
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బాలీవుడ్ స్టార్ జంటలలో ఒకరు. దీపికా గత సంవత్సరం సినిమాకు విరామం ఇచ్చింది, ఎందుకంటే ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో, రణ్‌వీర్ సింగ్ నటనలో బిజీగా ఉన్నారు. ఇంతలో, రణ్‌వీర్ సింగ్ ఇటీవల కరణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్ 7' షోలో పాల్గొని తన బెడ్‌రూమ్ సీక్రెట్స్‌ను పంచుకున్నారు. ముఖ్యంగా, అతని ఫస్ట్ నైట్ సీక్రెట్ గురించి మాట్లాడటం ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.
ఆ షోలో, కరణ్ రణ్‌వీర్‌ను బింగో ఆడమని అడిగాడు. పెళ్లి ఆచారాల తర్వాత అతను అలసిపోయాడా అని కరణ్ అడిగినప్పుడు, రణ్‌వీర్ తల ఊపాడు. తాను, దీపికా తమ ఫస్ట్ నైట్‌లో సన్నిహితంగా ఉన్నామని అతను ఒప్పుకున్నాడు. తన వానిటీ వ్యాన్‌లో కూడా ఇలా చేసినట్లు అతను ఒప్పుకున్నాడు. మూడ్‌ను మార్చి.. భావోద్వేగాలను రేకెత్తించే బోలెడు పాటలు తన ప్లే లిస్ట్ లో ఉన్నాయని అన్నారు. దాంతో అక్కడ ఉన్నవారు రణ్ వీర్ సమాధానం విని ఆశ్చర్యపోయారు.