kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది

Published : Jan 01, 2026, 09:55 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 విన్నర్‌ కళ్యాణ్‌ పడాల తన లవ్‌ స్టోరీని బయటపెట్టాడు. తన ప్రియురాలు ఎలా మోసం చేసిందో పూస గుచ్చినట్టు చెప్పాడు. హార్ట్ బ్రేక్‌ అయిన సందర్భాన్ని పంచుకున్నాడు. 

PREV
16
బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ విన్నర్‌ గా కళ్యాణ్‌ పడాల

కళ్యాణ్‌ పడాల ఆర్మీ జవాన్‌ జాబ్‌ని వదులుకుని బిగ్‌ బాస్‌ తెలుగు 9లోకి వచ్చిన విషయం తెలిసిందే. కామన్‌ మ్యాన్‌ గా అగ్నిపరీక్షలో పాల్గొని విన్నర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చాడు. సైలైంట్‌గా ఎదుగుతూ విన్నర్‌గా అయ్యాడు. ఎంతో మందిని ఆశ్చర్యపరిచాడు. కళ్యాణ్‌ పడాల బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కామన్‌ మ్యాన్‌ కేటగిరిలో బిగ్‌ బాస్‌ కి వచ్చి కప్‌ గెలుచుకుని వెళ్లిన రెండో కంటెస్టెంట్‌గా కళ్యాణ్‌ నిలిచాడు. ఆయన కంటే ముందు పల్లవి ప్రశాంత్‌ ఏడవ సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

26
కళ్యాణ్‌ పడాల లవ్‌ స్టోరీ

అయితే బిగ్‌ బాస్‌ కప్‌ గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్‌కి జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కళ్యాణ్‌ పడాల సైలైంట్‌గా ఉన్నాడు. ఎక్కడా బయటకు రావడం లేదు. కొన్నాళ్లు మళ్లీ వాస్తవంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కళ్యాణ్‌ పడాలకు సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అగ్ని పరీక్ష గెలిచిన తర్వాత కళ్యాణ్‌ ఐడ్రీమ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తన లవ్‌ స్టోరీని బయటపెట్టాడు. ఎవరికీ తెలియని క్రేజీ లవ్‌ స్టోరీని వెల్లడించాడు కళ్యాణ్‌.

36
చిన్ననాటి క్లాస్‌ మేట్‌తోనే కళ్యాణ్‌ లవ్‌

కళ్యాణ్‌ పడాల లవ్‌ స్టోరీ ఏంటనేది చూస్తే, అదొక క్రేజీ ట్రాక్‌ కావడం విశేషం. అదే సమయంలో సాడ్‌ లవ్‌ స్టోరీ కావడం గమనార్హం. కళ్యాణ్‌ పడాల తన చిన్ననాటి క్లాస్‌ మేట్‌ని ప్రేమించాడు. ఇంకా చెప్పాలంటే ఆమెనే కళ్యాణ్‌ని ప్రేమించిందట. చిన్నప్పట్నుంచి పరిచయం, అయితే అప్పుడు పెద్దగా పట్టించుకోలేదట. ఆ తర్వాత రెగ్యూలర్‌గా మాట్లాడుతుండేవాళ్లు. ఆ మాటలు డీప్‌గా వెళ్లిపోయాయి. దీంతో ఓ సారి తనే ప్రపోజ్‌ చేసిందట. కానీ కళ్యాణ్‌ రిజెక్ట్ చేశాడు. `నన్ను మా అమ్మనే భరించదు, నీ వల్ల కాదు, ఇది అవ్వదు` అని చెప్పాడట. దీంతో ఆమె హర్ట్ అయ్యింది. కొన్ని రోజులకు అరే బాధపెట్టానే అనిపించిందట. ఆ తర్వాత ఆమె లవ్‌ ని యాక్సెప్ట్ చేశాడట. ఆ తర్వాత రెండుమూడు నెలలకే తను ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు, ట్రైనింగ్‌కి వెళ్లాల్సి వచ్చిందట.

46
వస్తానని హ్యాండిచ్చిన కళ్యాణ్‌

వెళ్లిపోయాక కొన్ని రోజులు బాగానే నడిచింది. కానీ మధ్యలో కాల్స్ లేవు, మెసేజెస్‌ లేవట. దానికి తన తప్పే ఉందని, ఓ రోజు లీవ్‌ లో ఊరికి వస్తుంటే ఇలా వస్తున్నా అని చెబితే ఇంటికి వచ్చి మామయ్యతో మాట్లాడు అని చెప్పిందట. ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్ ఉండటంతో నెక్ట్స్ డే మార్నింగ్‌ కలుస్తానని చెప్పాడట. కానీ వెదర్‌ కారణంగా తాను ఫ్లైట్‌కి వెళ్లిపోవాల్సి వచ్చింది, ఆ రోజు కలవలేదు. ఆ తర్వాత ఫోన్‌ చేస్తే రెస్పాన్స్ లేదు. సరేలే ఇంట్లో ఇబ్బందిపెడుతున్నారేమో అనుకున్నాడట. ఆ తర్వాత కాలేజీలో చేరిందని తెలిసి ఎలాగోలా ఫోన్‌ నెంబర్‌ సాధించి ఫోన్‌ చేస్తే మాట్లాడను అని చెప్పిందట.

56
వేరే అబ్బాయితో వెళ్లిపోయిన కళ్యాణ్‌ లవర్‌

దీంతో కొన్ని రోజుల తర్వాత లీవ్‌ దొరకడంతో ఇంటికి వెళ్లాడట. కానీ వాళ్లపేరెంట్స్ నో చెప్పారు, ఇది అవ్వదు, వదిలేయమని చెప్పారట. ఇంటికి రావద్దు అని గట్టిగా చెప్పారట. దీంతో సరేలే అనుకుని వెళ్లిపోయాడట. మళ్లీ మూడు నాలుగు నెలలకు తన ప్రియురాలు ఫాదర్‌కి ఫోన్‌ చేశాడట. ఆమెవద్ద తన బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ కోసం ఫోన్‌ చేస్తే నువ్వే మాట్లాడూ అని నెంబర్‌ ఇచ్చాడట. దీంతో ఆమెని కన్విన్స్ చేయడానికి మూడు నాలుగు రోజులు పట్టిందట. ఆ తర్వాత ఎట్టకేలకు కన్విన్స్ అయ్యింది. అంతా సెట్‌ అయ్యిందనుకున్నాడట కళ్యాణ్‌. కానీ కట్‌ చేస్తే మళ్లీ మూడు రోజుల తర్వాత ఫోన్‌ ఎత్తడం లేదని, తనని బ్లాక్‌లో పెట్టిందని చెప్పాడు కళ్యాణ్‌. ఆ తర్వాత ఆరా తీస్తే మరో అబ్బాయితో ఎఫైర్‌ పెట్టుకుందట. నా కంటే వాడు బెటర్‌గా ఉండని వాడితో వెళ్లిపోయిందని తెలిసింది, ఆ విషయం తెలిసి హార్ట్ బ్రేక్‌ అయ్యిందని తెలిపాడు కళ్యాణ్‌. ఆ టైమ్‌లో దెబ్బ గట్టిగానే తగిలిందని తెలిపాడు కళ్యాణ్‌. మొత్తంగా సినిమా లెవల్లో తన లవ్‌ ట్రాక్‌ని నడిపించాడని చెప్పొచ్చు. కానీ అది సాడ్‌ ఎండింగ్‌ కావడం బాధాకరం. 

66
సినిమాల్లోకి కళ్యాణ్‌ పడాల

కళ్యాణ్‌కి యాక్టింగ్‌ అంటే పిచ్చి. మొదట సినిమాల్లోకి రావాలని అనుకున్నాడు. ఫాదర్‌ కోసం ఆర్మీ వైపు వెళ్లాడు.ఇప్పుడు బిగ్‌బాస్‌ తెలుగు 9 విన్నర్‌గా నిలిచాడు. సెలబ్రిటీ క్రేజ్‌ వచ్చింది. దీంతో ఇకపై తాను సినిమాల్లో ప్రయత్నిస్తానని, మంచి యాక్టర్‌గా నిరూపించుకుంటానని ఇటీవల బిగ్‌ బాస్‌ బజ్‌లో శివాజీతో చెప్పాడు కళ్యాణ్‌. దీంతో ఇప్పుడు ఆయన సినిమా ట్రయల్స్ లో ఉన్నాడని చెప్పొచ్చు. ఇక ఆర్మీ జాబ్‌ ని పూర్తిగా వదిలేసి నటుడిగా సెటిల్ కాబోతున్నాడు కళ్యాణ్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories