చిరంజీవి తన భార్య సురేఖకు నేర్పించిన రెండు స్పెషల్ వంటలు ఏంటో తెలుసా? అల్లు వారిపై మెగాస్టార్ ఫన్నీ కౌంటర్

Published : Dec 23, 2025, 08:29 AM IST

మెగాస్టార్ చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో మాత్రమే కాదు.. ఇంట్లో బెస్ట్ హస్బెండ్ అని కూడా నిరూపించుకున్నారు. తన భార్య సురేఖకు వంట నేర్పింది కూడా ఆయనే నట. ఇంతకీ చిరు నేర్పిన ఆ స్పెషల్ వంటలు ఏంటో తెలుసా? 

PREV
15
డ్యాన్స్ లు ఫైట్లు మాత్రమే కాదు..

మెగాస్టార్ చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలో తన ట్యాలెంట్ తో ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి. డ్యాన్స్ , ఫైట్స్, ఎమోషన్స్. ఇలా అంత వరకూ ఏ హీరో చూపించని ప్రతిభను చిరంజీవి చూపించి.. తెలుగు పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగాడు. అయితే ఆయన ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఉన్నా.. ఇంట్లో గరిటపట్టి వంట చేయడం మాత్రం తప్పలేదట. అంతే కాదు తన భార్యకు కూడా తానే వంట నేర్పించాడట చిరంజీవి. ఈ విషయాన్ని గతంలో జయప్రద హోస్ట్ గా జరిగిన జయప్రదం కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. ఇంతకీ మెగాస్టార్ తన భార్యకు నేర్పించిన స్పెషల్ వంటల ఏంటంటే?

25
చింరజీవి తన భార్యకు నేర్పిన స్పెషల్ వంటలు..

మీరు ఇండస్ట్రీలో అంత పెద్ద మెగాస్టార్ కదా.. మరి ఇంట్లో ఎప్పుడైనా గరిట పడతారా అని ..జయప్రదం ప్రోగ్రామ్ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెపుతూ..'' నేను ఇంట్లో వంట చేస్తాను. వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం.. అసలు సురేఖకు వంట నేర్పిందే నేను.. ఆమెకు ఉప్మా చేయడం నేర్పింది నేనే. కాఫీ పెట్టడం కూడా ఎలాగో నేను చెప్పాను. అసలు ఉప్మా చేయడం కూడా ఆమెకు రాదు.. అలా పంపించారు అల్లు వారు నా ఇంటికి.. అని సరదాగా అల్లు ఫ్యామిలీపై సెటైర్లు వేశారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి అన్ని రకాల వంటలు చేయగలరు. కానీ ఆయన పేరు మీద స్పెషల్ గా దోసెలు మాత్రం చాలా పేమస్ అయ్యాయి. వాటిచి చిరు దోసెలు అని పేరు కూడా వచ్చింది.

35
చిరు స్టీమ్ దోసెలు స్పెషల్ ..

చిరంజీవి స్టీమ్ దోసెలు ఇండస్ట్రీలో చాలా స్పెషల్.. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఎక్కువగా చేసుకునే హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఇది. నూనె లేకుండా.. ఆవిరితో ఉడికించే మెత్తటి దోసెలు. చిరంజీవి స్వంగా ఇంట్లో చాలా ఇష్టంగా ఈ దోసెలు చేసుకుని తింటారట. అందుకే ఇవి 'చిరు దోస'గా ప్రసిద్ధి చెందాయి. వీటిని రవ్వ, మైదా, బియ్యం పిండి, పెరుగు, కూరగాయలతో తయారు చేస్తారు, ఇవి నోట్లో కరిగిపోయేంత మెత్తగా ఉండి, చట్నీలు, సాంబార్‌తో తింటారు, ముఖ్యంగా అల్లు అరవింద్ ద్వారా ఈ దోసెలు సెలబ్రిటీలలో కూడా చాలా పాపులర్ అయ్యాయి. చిరంజీవి ఫ్యామిలీతో పాటు గా రజనీకాంత్, సచిన్ టెండూల్కర్ లాంటి సెలెబ్రిటీలకు కూడా ఈ దోసెలు చాలా ఇష్టం.

45
చిరంజీవి చాలా ఇష్టంగా తినే ఫుడ్..

చిరంజీవి మంచి ఫుడీ... ఇష్టమైనవన్నీ మితంగా తింటారు. కాని ఇష్టమైన ఫుడ్ కనిపిస్తే మాత్రం వదిలిపెట్టరు. చిరంజీవికి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పారు. అది కూడా మెగా మదర్ అంజనాదేవి చేతి వంట అంటే మరీ ఇష్టమట. ఆమె చేసే చేపల పులుసు, ఎండు చేపల కూర అంటే లొట్టలేసుకుని తింటారట మెగాస్టార్. ఓ సందర్భంలో ఆయన తన తల్లి అంజనాదేవికోసం ఎండు చేపల ప్రై కూడా చేసి పెట్టారు. కరోనా టైమ్ లో చేసిన ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. అంతే కాదు కొన్ని టీవీ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. చిరంజీవి సీ ఫుడ్ ఎక్కువగా తింటే.. పవన్ కళ్యాన్ మాత్రం పులవ్ ను ఎక్కువగా ఆస్వాదిస్తారట.

55
70 ఏళ్లు వచ్చినా తగ్గేదేలే..

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా 70 లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆయనలో ఏమాత్రం హుషారు తగ్గలేదు.. డ్యాన్స్ విషయంలో కూడా అదే స్టైల్, అదే గ్రేస్.. అదే యాటిడ్యూడ్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. రీసెంట్ గా అనిల్ రావిపూడి సినిమా మన శంకర వర ప్రసాదుగారు నుంచి చిరు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అందులో చిరంజీవి డ్యాన్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆయనకు 70 ఏళ్లంటే నమ్మేలా లేదంటున్నారు. ప్రస్తుతం ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమాతో రిలీజ్ కు రెడీ అవుతున్నారు మెగాస్టార్. ఆతరువాత సమ్మర్ కోసం విశ్వంభరను సిద్ధం చేస్తున్నాడు. ఇక మెగా డైరెక్టర్ బాబీతో మరోసినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది.

Read more Photos on
click me!

Recommended Stories