డేంజర్‌ జోన్‌లో టాప్‌ కంటెస్టెంట్‌.. మరి టాప్‌లో ఉన్నదెవరు? బిగ్‌ బాస్‌ తెలుగు 9 లేటెస్ట్ ఓటింగ్‌

Published : Dec 04, 2025, 12:11 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 13వ వారం లేటెస్ట్ ఓటింగ్‌ అప్‌ డేట్‌ వచ్చింది. ఇందులో టాప్‌ కంటెస్టెంట్లు డేంజర్‌ జోన్‌లోకి వెళ్లడం ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ వారం టాప్‌లో ఉన్నదెవరనేది చూస్తే 

PREV
15
బిగ్‌ బాస్‌ తెలుగు 9 టికెట్‌ టూ ఫినాకే విన్నర్‌ ఎవరు?

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ ఇంకా మూడు వారాలే ఉంది. ఈ వారం ఆల్‌రెడీ సగం అయిపోవడంతో మరో రెండు వారాల్లోనే షో క్లోజ్‌ కాబోతుంది. ఈ క్రమంలో దీనిపై అంచనాలు పెరిగాయి. ఆసక్తి పెరుగుతుంది. ముందు ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. టికెట్‌ టూ ఫినాలే కోసం ప్రస్తుతం ఇమ్మాన్యుయెల్‌, రీతూ చౌదరీ, కళ్యాణ్‌ పోటీ పడుతున్నారు. మిగిలిన వారు ఈ పోటీ నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. వరుసగా వీరికి బిగ్‌ బాస్‌ టాస్క్ లు ఇస్తున్నారు. మరి ఈ ముగ్గురిలో ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఆ విషయం తేలనుంది. దీంతో ఇప్పుడు షో మరింత రసవత్తరంగా మారిందని చెప్పొచ్చు.

25
13వ వారం ఓటింగ్‌ అప్‌ డేట్‌

ఇదిలా ఉంటే ఈ వారం(13వ వారం) నామినేషన్‌లో ఉన్న వారి పరిస్థితేంటి? ఎవరు టాప్ లో ఉన్నారు. ఎవరు డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో కొందరు బిగ్‌ బాస్‌ ఫాలోవర్స్ రెగ్యూలర్‌గా నిర్వహించే అనధికారిక ఓటింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ వారం తనూజ, భరణి, రీతూ చౌదరీ, సంజనా, డీమాన్‌ పవన్‌, సుమన్‌ శెట్టి నామినేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌజ్‌లో ఎనిమిది మంది ఉండగా, కళ్యాణ్‌, ఇమ్మాన్యుయెల్‌ ఈ వారం నామినేషన్‌లో లేరు. మరి ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లకి సంబంధించిన ఓటింగ్‌ అప్ డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

35
డేంజర్‌ జోన్‌లో ఉన్నది వీరే

13వ వారం లేటెస్ట్ ఓటింగ్‌ ప్రకారం టాప్‌ కంటెస్టెంట్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నాడు. ఆయనే సుమన్‌ శెట్టి. ఆయన గత వారం కూడా లీస్ట్ లోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా లీస్ట్ లో కనిపిస్తున్నారు. అయితే గత రెండు వారాల క్రితం వరకు సుమన్‌ శెట్టి టాప్‌ కంటెస్టెంట్‌గా నిలిచాడు. ఆ మధ్య నాగార్జున వీకెండ్‌లో ఎవరు బెస్ట్ అని పోలింగ్‌ పెడితే ఆయనకు మాత్రమే వంద శాతం ఓటింగ్‌ వచ్చింది. అలాంటి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా ఉన్న సుమన్‌ శెట్టి ఇప్పుడు బాటమ్‌లోకి పడిపోవడం ఆశ్చర్యపరుస్తోంది. బిగ్‌ బాస్‌ షోలో ఆయన పెద్దగా సందడి లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ఆ మధ్య అడపాదడపా కామెడీ అయినా చేశాడు, కానీ ఇప్పుడు చాలా వరకు సైలెంట్‌గా ఉంటున్నాడని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. దీని వల్లే ఓటింగ్‌ పడిపోయిందంటున్నారు.

45
ఈ ముగ్గురిలో ఒకరు ఔట్‌

ఆ తర్వాత సంజనా డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. ఆమె కూడా గత రెండు వారాలుగా డేంజర్‌ జోన్లో ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఆమె లీస్ట్ లో ఉన్నారు. అలాగే డీమాన్‌ పవన్‌ సైతం డేంజర్‌ జోన్‌లోనే ఉండటం గమనార్హం. ఎప్పుడూ మిడిల్‌లో ఉండే పవన్‌.. ఈ సారి డౌన్‌ అయ్యారు. సంజనా, డీమాన్‌ పవన్‌ల మధ్య ఓటింగ్‌ జంప్‌ అవుతుంది. ఒకరు అటుఇటుగా మారుతున్నారు. కానీ ఈ వారం ఈ ముగ్గురూ డేంజర్‌లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిలోనే ఒకరు ఈ వారం ఎలిమినేట్‌ అవుతారు.

55
సేఫ్‌లో ఉన్న కంటెస్టెంట్లు వీరే

ఓటింగ్‌లో టాప్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరనేది చూస్తే, తనూజ ఎప్పటిలాగే టాప్‌లో దూసుకుపోతుంది. ఆమెకి 30శాతానికిపైగా ఓటింగ్‌ పడుతోంది. దీంతో ఎవరికి అందనంత టాప్‌లో ఉండటం విశేషం. ఆ తర్వాత రీతూ చౌదరీ టాప్‌లో ఉంది. ఆమెకి 15శాతానికిపైగా ఓటింగ్‌ వస్తోంది. రీతూ మంచి స్థానంలోనే ఉంది. టాప్‌ 5లో ఉండే అవకాశం ఉంది. ఇక మూడో స్థానంలో భరణి ఉన్నారు. గతంలో డౌన్‌లో ఉన్న ఆయన ఇప్పుడు నెమ్మదిగా పుంజుకుంటూ సేఫ్‌లోకి వెళ్లిపోతున్నారు. క్రమంగా స్ట్రాంగ్‌ అవుతున్నాడనిపిస్తుంది. ఇలా ఈ వారం తనూజ, రీతూ, భరణి సేఫ్‌లో ఉంటే, సుమన్‌ శెట్టి, డీమాన్‌ పవన్‌, సంజనా డేంజర్‌ లో ఉన్నారు. మరి వీరిలో ఈ వారం హౌజ్‌ని వీడేదెవరనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories