
`బిగ్ బాస్ తెలుగు సీజన్ 9` గ్రాండ్‌గా ముగిసింది. హౌజ్‌లోకి వచ్చే కంటెస్టెంట్లు తేలిపోయారు. ముందునుంచి ఏషియానెట్ చెబుతున్నట్టుగానే 15 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 9 మంది సెలబ్రిటీలు హౌజ్‌లోకి రాగా, ఆరుగురు కామనర్స్ ఎంపిక అయ్యారు ఇలా మొత్తంగా 15 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. మరి ఎవరెవరు వచ్చారనేది లిస్ట్ చూస్తే.
నటి తనూజ మొదటి కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి వచ్చారు. తన తండ్రికి తెలియకుండా తాను సినిమాల్లోకి వచ్చిందట. ఇప్పుడు ఈ విషయం కూడా తండ్రికి తెలియదని చెప్పింది తనూజ. తండ్రి గర్వపడేలా చేస్తానని పేర్కొంది.
బాలయ్య సినిమా `నరసింహ నాయుడు`లో నటించి మెప్పించిన ఫ్లోరా సైనీ రెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె తన జీవితంలో ఎన్నో అవమానాలు ఫేస్ చేసింది. చిత్ర హింసకు గురయ్యింది. అవన్నీ దాటుకుని, వాటికి సమాధానంచెప్పేందుకు బిగ్ బాస్ కి వచ్చినట్టు తెలిపింది. మళ్లీ తానేంటో నిరూపించుకోవాలనుకుంటుందట.
సోల్జర్ పవన్ మూడో కంటెస్టెంట్‌గా ఎంపికయ్యారు. ఆయన కామనర్ విభాగంలో వచ్చిన విషయం తెలిసిందే. కామనర్‌గా సత్తా చాటి ఎట్టకేలకు కంటెస్టెంట్‌గా ఛాన్స్ కొట్టారు.
నాల్గో కంటెస్టెంట్‌గా జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్ ఎంట్రీ ఇచ్చారు. దేనికీ పనికిరావు అనే దశ నుంచి ఇంటి నుంచి వచ్చేసి ఇప్పుడు స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు ఇమ్మాన్యుయెల్. బిగ్ బాస్ హౌజ్‌లో గుర్తిండిపోయేలా రచ్చ చేస్తానని తెలిపాడు.
`పుష్ప 2` కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఐదో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో వైరల్‌గా మారింది శ్రష్టి.
కామనర్‌గా అగ్నిపరీక్షలో రచ్చ చేసిన మాస్క్ మ్యాన్ హరీష్ ఆరో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన అగ్నిపరీక్షలో గుండు కొట్టించుకున్నాడు. బిగ్ బాస్ షో మొత్తంలో ఆయన ఇలా గుండుతోనే ఉండాలనేది బిగ్ బాస్ కండీషన్.
టీవీ సీరియల్స్ తో పాపులర్ అయ్యారు నటుడు భరణి, ఆ తర్వాత సినిమాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నెగటివ్ రోల్స్ చేసి మెప్పించారు. ఆయన ఏడో కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే తనతోపాటు చిన్న లాకెట్ తీసుకొచ్చారు. దాన్ని మొదట బిగ్ బాస్ అలౌ చేయలేదు. ఆ తర్వాత చిన్న ట్విస్ట్ ఇచ్చి హౌజ్‌లోకి పంపించారు.
ఎనిమిదో కంటెస్టెంట్ గా సోషల్ మీడియా సెన్సేషన్, టీవీ నటి రీతూ చౌదరీ ఎంట్రీ ఇచ్చింది. గ్లామర్ ఫోటోలతో రచ్చ చేసే రీతూ చౌదరీ ఆ మధ్య 700కోట్ల ల్యాండ్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంది. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ షోకి రావడం విశేషం. ఆమె అసలు పేరు వనం దివ్య.
కామనర్ విభాగంలో కంటెస్టెంట్‌గా డీమాన్ పవన్ ఎంపికయ్యారు. ఆయన మంచి బాడీ బిల్డర్. పుషప్స్ ఇవ్వడంలో దిట్ట. నాగ్ ముందు స్టేజ్‌పై భరణితో కలిసి పుషప్స్ ఇచ్చి వాహ్ అనిపించారు. 9వ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టాడు.
పదో కంటెస్టెంట్‌గా ఒకప్పుటి హీరోయిన్ సంజనా గాల్రానీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న వివాదాలు, ముఖ్యంగా ఓ కేసు విషయాన్ని వెల్లడించారు. ఎమోషనల్ అయ్యారు. దాన్నుంచి బయటపడేందుకు, తన నిజాయితీని నిరూపించుకునేందుకు హౌజ్‌లోకి వచ్చినట్టు తెలిపారు. అంతేకాదు ఐదు నెలల పాపని వదిలేసి వచ్చిందట.
`రాను బొంబయికి రాను` పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటతో పాపులర్ అయ్యాడు రాము రాథోడ్. ఫోక్ సింగర్‌గా, డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన 11వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
నాల్గో కామనర్‌గా దమ్ము శ్రీజ ఎంపికయ్యింది. ఆమె 12వ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చలాకీతో, ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకున్న శ్రీజ కప్ కొట్టుకుని వస్తానని తెలిపింది.
13వ కంటెస్టెంట్‌గా ఒకప్పటి స్టార్ కమెడియన్ సుమన్ శెట్టి ఎంట్రీ ఇచ్చారు. ఇతర భాషల్లో సినిమాలు చేయడం వల్ల తాను తెలుగుకి దూరమయ్యాయని, ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలిపారు. అందుకు ఈ షో హెల్ప్ అవుతుందన్నారు.
కామనర్స్ నుంచి 5వ కంటెస్టెంట్‌గా ప్రియా ఎంపికయ్యింది. ఆమె 14వ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న సవాళ్లని తెలిపింది.
నిజానికి 14 మందితోనే షో క్లోజ్ అని నాగార్జున తెలిపారు. చివరి నిమిషంలో వచ్చిన యాంకర్ శ్రీముఖి మరో కామనర్‌కి అవకాశం కల్పించాలని తెలిపింది. వారి కోరిక మేరకు నాగ్ ఓకే చెప్పారు. అలా చివరగా మర్యాద మనీష్ ఆరో కామనర్‌గా ఎంపికయ్యారు. 15వ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టారు. ఇది టోటల్ లిస్ట్.
బిగ్ బాస్ తెలుగు 9లో రెండు హౌజ్‌లు ఉన్నాయని ముందే నాగార్జున చెప్పారు. తాజాగా ఆ లెక్కేంటో బయటపెట్టారు. అందులో ఒకటి మెయిన్ హౌజ్ ఉంటుంది. రెండోది ఔట్ హౌజ్. మెయిన్ హౌజ్‌లో లగ్జరీలుంటాయి. ఔట్ హౌజ్‌లో ఎలాంటి లగ్జరీలు ఉండవు. అయితే అగ్నిపరీక్ష ద్వారా ఎంతో పోరాడి సాధించి ఫైనల్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కామనర్స్ కి మెయిన్ హౌజ్‌లో ఉండే అవకాశాం కల్పించారు నాగార్జున. అలా కామనర్స్ కళ్యాణ్, డీమాన్ పవన్, దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీష్, ప్రియా, మర్యాద మనీష్‌లు అన్ని సదుపాయాలు ఉన్న మెయిన్ హౌజ్‌లో ఉండబోతున్నారు.
ఇక ఔట్ హౌజ్ లో సెలబ్రిటీలు ఉంటారని తెలిపారు నాగార్జున. అందులో ఎలాంటి లగ్జరీ సదుపాయాలు ఉండవు. వారంతా ఆ సదుపాయాలను తమ టాస్క్ ల ద్వారా, గేమ్స్ ద్వారా సాధించుకోవాల్సి ఉంటుంది. ఇక సెలబ్రిటీలుగా వచ్చిన తనూజ పుట్టుస్వామి, సంజనా గాల్రానీ, ఫ్లోరా సైనీ, ఇమ్మాన్యుయెల్, రాము రాథోడ్, సునీల్ శెట్టి, భరణి, రీతూ చౌదరీ, శ్రష్టి వర్మలు ఔట్ హౌజ్(టెనెంట్)లో ఉండబోతున్నారు. ఈ లెక్కన సెలబ్రిటీలకు చుక్కలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.